రెక్కలు తొడగాలి

లేలేత బాలసుమాల వికాసమిప్పుడు మొగ్గదశలో నిస్తేజమై వాడి రాలిపడుతోంది గూటిలోంచి రెక్కలు విదిలించేలోగా కాలం అరచేతిలో మాయాదర్పణమొకటి మొలిపిస్తోంది! చూపుడు వేలిని మంత్రదండం చేసి కళ్లముందు ప్రజ్వరిల్లే రంగుల ప్రపంచంలోకి శలభాల్లా ఆకర్షించి రెక్కల కదలికలు రాల్చేసి మనోభావాలు ఇంకించి నాలుగు కళ్ల మరబొమ్మల్లా మార్చేస్తోంది! లోకం ఏమాత్రం తెలీని అమాయక చూపులు నున్నటి వెలుగుల…









