తెలంగాణా మేధావులూ … మీరు ఎటువైపు..?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అసలు రంగు బయటపడుతోంది.ప్రభుత్వం పదవి కాలం దగ్గర పడుతున్నాకొద్దీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిస్వారూపం బయటపడుతోంది..జాతీయ కాంగ్రెస్ పార్టీ చెపుతున్నట్లు, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హస్తం పార్టీ ప్రజాస్వామ్య పార్టీ, ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పార్టీ కాదని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను బట్టి అర్థమవుతోంది.రాజ్యాంగ బద్ధమైన పాలనా, పౌరహక్కుల గురించి కాంగ్రెస్ మాట్లాడుతున్న మాటలన్నీ పచ్చి అబద్ధాలనీ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన గమనిస్తున్న ప్రజలకు స్పష్టమైతోంది.కాంగ్రెస్ పార్టీ చెపుతున్నట్లు రాజ్యాంగ, ప్రజాస్వామ్యం, పౌర హక్కులు, మీడియా స్వేచ్ఛ అనేది హస్తం పార్టీ అధికారాన్ని చేజిక్కించుకునే రాజకీయాస్త్రాలే తప్ప మరోకటి కాదని తెలుస్తోంది..కాంగ్రెస్ చెపుతున్నట్లు లౌకికవాదం, రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య స్ఫూర్తి సూక్తులన్నీ ఒట్టి బూటకం.. కాంగ్రెస్ చెప్పే మాటలు నీతులు మేడిపండు చందంగా తయారైంది.తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన చూస్తే ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ వల్లించే ప్రజాస్వామ్యం రాజ్యాంగం లౌకికవాదం అంశాలు నేతి బీరకాయ చందంగా ఉంది.. కాంగ్రెస్ పార్టీ మాటల్లో తప్ప చేతల్లో అవేవి కనిపించవు.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విధానాలే అందుకు ప్రత్యేక్ష ఉదాహరణ.

 

హిట్లర్ ను స్పూర్తిగా తీసుకున్న ముఖ్యమంత్రి..నాజీలాను మించిన పాలన చేస్తున్నారు.కాంగ్రెస్ అంటే ప్రకటిత ఎమర్జెన్సీ కాదు అప్రకటిత ఎమర్జెన్సీ అని ముసుగులో అధికారంలోకి వచ్చింది..ప్రజలకు ఆరు గ్యారెంటీలతో పాటు పౌర సంఘాలు, మేధావులు, బుద్ధి జీవులకు పౌర హక్కుల పరిరక్షణ, సభలు సమావేశాలు పెట్టుకునే స్వేచ్ఛయుతమైన వాతావరణం కల్పిస్తామంటూ ఏడో గ్యారంటీ ఇచ్చింది..కాంగ్రెస్ పార్టీ గుంట నక్కా మాటలు నమ్మి  మేధావి వర్గం మోసపోయింది.అధికారంలోకి వచ్చిన తక్షణమే వారికి తడిగుడ్డతో గొంతు కోసింది.. రేవంత్ సర్కారు తేనె పూసిన కత్తితో బుద్ధి జీవులను వెన్నుపోటు పొడిచింది.

 

రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణం స్వీకారం చేసిన వెంటనే ప్రగతి భవన్ కంచెలు బద్దలు కొట్టామని ప్రకటించారు..సీఎం ఊసరవెల్లి మాటలకు బుద్ధి జీవులు, మేధో వర్గం ఆహా ఓహో అంటూ ఊగిపోయారు..తెలంగాణకు ఇప్పుడే స్వాతంత్య్రం  వచ్చినట్లు, ప్రజలు స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నట్లు భజన చేశారు.ప్రజాస్వామ్యం మొదలైంది, రాజ్యాంగ పాలనా స్టార్టైంది..పౌర హక్కులు నాలుగు పాదాలపై నడుస్తాయంటూ మేధావులు తమ బుద్దిని పక్కనబెట్టి, ఆలోచన శక్తి కోల్పోయి, ప్రజల పక్షాన ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన మేధో వర్గం తన ఉనికిని కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర తాకట్టు పెట్టారు.

 

ప్రగతి భవన్ వద్ద కంచెలు తొలగించి మేధావి వర్గం మాట్లాడకుండా వాళ్ళు మెదళ్ళకు, ఆలోచన శక్తికి చుట్టు వేశారు.రేవంత్ రెడ్డి ఆలోచనాపరులు ఆలోచన చేయకుండా వారి మేథో శక్తిని ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, ఇందిరమ్మ పాలన ముసుగులో నిర్బంధించారు.తెలంగాణలో మేథావి వర్గం చాలా పవర్ ఫుల్..ఎంతో ముందు చూపుతో ఆలోచిస్తారు..కానీ రేవంత్ రెడ్డి రాజకీయ వ్యూహం ముందు తెలంగాణ మేధో  వర్గం తేలిపోయింది..ఒక పార్టీపై, ఒక నాయకుడిపై కోపంతో  బుద్ధి జీవులు కురుచ బుద్దితో ఆలోచనలు చేశారు.తమ జ్ఞానానికి  పరిధి ఏర్పరుచుకున్నారు.గాంధీ భవన్ గేట్లు దాటి ఆలోచనలు చేయలేకపోయారు.

 

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తెలంగాణ మేధో వర్గంతో ప్రభుత్వానికి సలహాలు ఇచ్చేందుకు సలహా కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ఇచ్చే సలహాలతో పాలన సంస్కరణలు అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది..మేధావులు, బుద్ది జీవులతో ప్రభుత్వ సలహా కమిటీ ఏర్పాటంటూ నమ్మబలికిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆలోచనా పరులను కూడా మోసం చేశాడు.వాళ్ళను తడిగుడ్డతో గొంతు కోశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటింది నో సలహా మండలి.. కనీసం సలహా మండలి ఏర్పాటు ఆలోచనా కూడా రేవంత్ సర్కారు చేయడం లేదు..

 

పైగా తెలంగాణ వ్యతిరేకులతో సలహదారుల గుంపును రేవంత్ రెడ్డి తయారు చేసుకుంటున్నారు.. తెలంగాణ కోసం పోరాటాలు, త్యాగాలు చేసిన మేధో  వర్గం రాష్ట్రంలో ఉంది..తెలంగాణ పట్ల వారికి అమితమైన అభిమానం ప్రేమ ఉంది.. భౌగోళికంగా, రాజకీయంగా, సాంస్కృతిక పరంగా, తెలంగాణ ప్రజల ఆచార వ్యవహారాలపై  భాషా పాండిత్యం ఉంది..తెలంగాణలో అణువణువు తెలిసే మేధో  జ్ఞాన శక్తి ఉంది..అన్ని రంగాల్లో నిష్ణాతులై వృత్తి నైపుణ్యం ఉన్నవారు ఉన్నారు..కానీ వారెవ్వరినీ రేవంత్ రెడ్డి సలహాదారుగా పెట్టుకోలేదు..వారితో ప్రభుత్వానికి సలహాలిచ్చే సలహా మండలి ఏర్పాటు చేయలేదు. ఇక ముందు చేస్తారనుకోవడం లేదు..

 

తెలంగాణ మేధావులకు రేవంత్ రెడ్డి తాళం వేశారు..ప్రశ్నించే యూనివర్సిటీ ప్రొఫెసర్లను తన భజన మండలగా మార్చుకున్నారు. ప్రభుత్వానికి సలహాలిచ్చే సలహా మండలి ఏర్పాటు చేయలేదు కానీ తన భజన చేసేందుకు భజన మండలి మాత్రం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసుకున్నారు..ఆ భజన మండలిలో తెలంగాణ ఉద్యమానికి, మేథో వర్గానికి, బుద్ది జీవులు, పౌర హక్కుల సంఘాలకు నాయకత్వం వహించిన వారు ఉండటం బాధాకరం.

 

మరోవైపు తెలంగాణ మేధావులు తెలంగాణ సోయి, తెలంగాణ ఆత్మగౌరవం, ఆత్మాభిమానం అస్తిత్వం కోసం దశాబ్దాలుఖా పని చేసి, ఇప్పుడు పని చేస్తున్న వారికి ప్రభుత్వ సలహాదారులుగా నియమించుకోకుండా తెలంగాణ వ్యతిరేకులు, తెలంగాణను దోపిడీ చేసే సీమాంధ్ర అధికారుల సలహాదారులు రేవంత్ రెడ్డి పెట్టుకున్నారు.. తెలంగాణ ద్రోహుల సలహాదారులతో సచివాలయం నిండిపోయింది.తెలంగాణ ద్రోహే పాలకుడైతే తెలంగాణ ద్రోహులతో రాష్ట్ర ఎలా దివాలా  తీస్తుందో చెప్పడానికి రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలన ఒక ఉదాహరణ.

 

మేధావులు పట్ల కాంగ్రెస్ పార్టీకి ఎంత గౌరవం ఉందో రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కారు బుద్ధి జీవులను మోసం చేసిన తీరుతో అర్థం చేసుకోవచ్చు.తెలంగాణ సోయితో మాట్లాడే వారికి నో పదవులు.వెరసి తెలంగాణ గురించి మాట్లాడితే జైల్లో వేయాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తోంది.. తెలంగాణ గురించి, తెలంగాణ హక్కలపై మాట్లాడే మేధావులను, బుద్ధి జీవులు జైల్లో వేయాలని సీఎం రేవంత్ అంటున్నారు.ఇలాంటి వ్యాఖ్యలు ప్రజాస్వామ్యం స్పూర్తికి, రాజ్యాంగ విరుద్ధం.అంతేకాదు ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రమాదకరం కూడా.

 

ఉచిత బస్సు పథకం వల్ల తెలంగాణతో మెటరో రైలు ప్రాజెక్టు ఉనికి ప్రమాదంలో పడుతుందని ఉచిత  బస్సు పథకంపై  కాంగ్రెస్ ప్రభుత్వం పునరాలోచన చేయాలని, దానికి ఒక  క్రైటీరియా ఉండాలని మెట్రో అధికారి విజ్ఞప్తి చేశారు..రేవంత్ రెడ్డి సీఎం బాధ్యతలు చేపట్టిన తొలి నాళ్ళలో ఒక జాతీయ మీడియా చర్చలో పాల్గొన్న  ముఖ్యమంత్రి మెట్రో అధికారిని జైల్లో పెట్టాలంటూ ఆవేశంగా మాట్లాడారు ..నాడు ఎల్‌ అండ్ టీ అధికారిని జైల్లో వేయాలన్న సీఎం వ్యాఖ్యల తర్వాత రాష్ట్రంలో కీలక మెట్రో రైలు ప్రాజెక్టు నుంచి ఎల్ అండ్ టీ తప్పుకుంది.ఇది రాష్ట్రాభివృద్ధికి భారీ నష్టాన్ని మిగిల్చింది.

 

హిట్లర్ ను ఆదర్శంగా, ట్రంప్ ను స్పూర్తిగా తీసుకున్న రేవంత్ రెడ్డి ఆయనలో ఉన్న నియంత ఆలోచనలు బయటపెట్టుకుంటున్నారు.కన్నెపల్లి నుంచి నీళ్ళు ఎత్తిపోసి తెలంగాణపై తరుముకు వస్తున్న కరువు నుంచి తెలంగాణను కాపాడలంటూ ప్రతిపక్షం డిమాండ్ చేస్తుంటే నీళ్ళు ఎత్తిపోసేది లేదు, అవసరమైనతే ప్రతిపక్షాల రక్తం పారిస్తే సరిపోతుందంటూ హిట్లర్ లో ఉన్న రక్తపిపాసి లక్షణాలను రేవంత్ రెడ్డి బయట పెట్టుకుంటున్నారు. అంతే కాదు బీజేపీ ఎంపీ, తనకు తెలంగాణ ఫస్ట్ అని వెంటనే కాళేశ్వరం నీళ్ళు ఎత్తిపోయాలని, రైతులకు సాగు తాగు నీరు ఇవ్వాలని రైతుల ప్రయోజనాలను , హైదరాబాద్ తాగు నీరు కష్టాలను తొలగించాలని అడిన ఈటల రాజేందర్ పై రేవంత్ రెడ్డి తన అక్కసును  వెళ్లగక్కారు.

 

ప్రతిపక్షాలను, మెట్రో అధికారులనే కాదు స్వయంగా తెలంగాణ కోసం, తెలంగాణ సోయితో దశాబ్దాల పాటు ఇంజినీర్లను గా పని చేసి తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ కరును తరిమి, తెలంగాణను సస్యశ్యామలం చేయడంలో కీలకపాత్ర పోషించిన తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్లు ప్రస్తుతం రాష్ట్రంలో ఎల్ నినో తో కరువు వస్తుంది కన్నెపల్లి నుంచి నీళ్ళు ఎత్తిపోయాలని ప్రభుత్వానికి లేఖ రాశారు..  నీళ్ళు ఎత్తిపోయాలి, పోసే అవకాశం ఉందని లేఖ రాసినందుకు ఇవాళ ఏకంగా తెలంగాణ మేధావులు, రిటైర్డ్‌ ఇంజినీర్లను జైల్లో వేయాలంటూ సీఎం మాట్లాడటం కాంగ్రెస్ పార్టీ సిగ్గుపడాలి..

 

నీళ్లు ఇవ్వాలన్న ఇంజినీర్లను, తెలంగాణ కోసం మాట్లాడుతున్న మేధావులను సీఎం రేవంత్ జైల్లో పెట్టాలంటూ తన నియంతృత్వ పోకడలను బయట పెట్టుకుంటున్నారు.. రాజ్యాంగ పరిరక్షణ, పౌర హక్కుల అమలు ఏడో గ్యారంటీ ఏమోగానీ ఎనిమిదో గ్యారంటైనా  నియంతృత్వాన్ని రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం వేగంగా అమలు చేస్తోంది. ప్రభుత్వ వైఫల్యాన్ని , కాంగ్రెస్ , సీఎం అసమర్థతను ప్రశ్నిస్తున్న తెలంగాణవాదులను,  తెలంగాణ జర్నలిస్టులు, తెలంగాణ మేధావులపై  రేవంత్‌  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..

 

 

ముఖ్యమంత్రి తీరు నోటితో పొగిడి నొసలుతో ఎక్కిరించినట్లుంది..రేవంత్ ప్రజాస్వామ్యం పాలన మాటలకు అమలు చేస్తున్న నియంత విధానాలు కాంగ్రెస్ అసలు రంగును బయట పెట్టుతుంది.. ఒకవైపు ప్రతి పక్షం, మేధావులు ప్రభుత్వానికి సలహాలు సూచనలు చేయాలంటూనే, సలహాలు ఇచ్చిన వారి రక్తంతో పంటలు పండిస్తా అంటాడు.. సూచనలు చేసిన రిటైర్డ్ ఇంజినీర్లను జైల్లో పెట్టాలంటాడు…సలహాలు ఇచ్చిన వారి రక్తంతో పండించడం, సూచనలు చేసిన ఇంజినీర్లను జైల్లో వేస్తామడం ప్రజాస్వామ్యపాలన…?.ప్రజల సాగు తాగు నీళ్లు అడిగితే ప్రతిపక్షాల రక్తం చల్లి సాగుచేయాలనడం రాజ్యాంగ పాలనా..?.

 

ఏ హిట్లర్‌  స్పూర్తితో రేవంత్ రెడ్డి పాలన చేస్తున్నారో అదే హిట్లర్ కాలంతో అదే  జర్మన్‌ రచయిత మార్టిన్ నీమోలర్‌ అనే గొప్ప రచయిత ఉన్నాడు..ఆ రచయిత చెప్పిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణకు సరిగ్గా సరిపోతుంది..”మొదట వాళ్లు కమ్యూనిస్టుల కోసం వచ్చారు, నేను కమ్యూనిస్టును కానందున నేను మౌనంగా ఉన్నాను.తర్వాత వాళ్లు సోషలిస్టుల కోసం వచ్చారు, నేను సోషలిస్టును కానందున నేను మాట్లాడలేదు. తర్వాత వాళ్లు యూదుల కోసం వచ్చారు నేను యూదుడిని కానందున నేను పట్టించుకోలేదు. చివరకు వాళ్లు నా కోసం వచ్చారు, అప్పటికి నా కోసం మాట్లాడేవాళ్ళు ఎవరూ మిగల లేదు..” ఇప్పుడు అలాంటి పరిస్థితే తెలంగాణలో ఉంది. మొదట రేవంత్‌ బీఆర్ఎస్‌ నేతలను టార్గెట్‌ చేశారు. ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడుతున్న   మేధావులు మాట్లాడలేదు.ఎందుకంటే సీఎం తిడుతుంది తమని కాదని మౌనంగా ఉన్నారు.

ఆ తర్వాత ప్రభుత్వం విద్యార్థి నిరుద్యోగుల అరెస్ట్‌లు చేస్తూ వారికి ఇచ్చిన హామీల కోసం పోరాటం చేస్తే బుద్ధి జీవులు మౌనంగా ఉన్నారు..వెరసి ఉద్యోగాలు ఇచ్చేందుకు ఏదో ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తుందని రేవంత్ సర్కార్ ను సమర్థించారు..లగచర్ల రైతులు, మూసీ హైడ్రాపై మాట్లాడలేదు..రైతుల ఆందోళనలు, యూరియా కష్టాలు, మద్దతు ధర, బోనస్‌పై మౌనంగా ఉన్నారు.  సీఎం తమను అంటలేడు, తమని ఇబ్బంది పెడుతలేడు కదా అని రెండున్నర ఏళ్ళు మేధావులు మాట్లాడలేదు. జర్నలిస్టుల నుంచి ఇప్పుడు మేధావుల దగ్గరకు వచ్చారు..పౌర సమాజం మౌనంగా ఉంటే జర్నలిస్టులు మాట్లాడారు.వారిని జైల్లో వేసిన మేధావులు మాట్లాడలేదు.ఇప్పుడు రేవంత్‌ రెడ్డి మేధావుల దగ్గరకు వచ్చారు..రిటైర్డ్‌ ఇంజినీర్ల దగ్గరకు వచ్చారు..తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించి, తెలంగాణాభివృద్దిలో కీలకంగా వ్యవహరించిన ఒక్కొక్క వర్గాన్ని రేవంత్‌, కాంగ్రెస్ టార్గెట్ చేసింది.

 

మేధావులు, బుద్ధి జీవులు, ఆలోచనా పరులు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మానేసినా తెలంగాణ  ప్రజలు మాత్రం ప్రభుత్వం పై తిరుగుబాటు చేస్తున్నారు.ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడుతున్నారు. హామీలపై ప్రశ్నిస్తున్నారు..నీళ్లు నిధుల దోపిడిపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు..కానీ మేధావులు మౌనంగా ఉంటున్నారు..ఇంకా కాంగ్రెస్ మోసాల చీకట్లో బతుకుతున్నారు. ప్రజలు కాంగ్రెస్ చీకట్ల నుంచి బయటకు వస్తున్నారు.బుద్ది జీవులు రావడం లేదు..కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి చెపుతున్న ప్రజాస్వామ్యం రాజ్యాంగం పౌర హక్కుల పరిరక్షణ ముసుగు నుంచి బయటపడటం లేదు.

 

రేవంత్ రెడ్డి రాజకీయ వ్యూహంలో మేధావి వర్గం కొట్టుకుపోయింది.ప్రశ్నించే గొంతులు మూగబోయాయి. అబద్దాలతో రేవంత్ రెడ్డి ప్రజలకు, మేధావులకు మధ్య సృష్టించిన దూరంలో కొట్టుకుపోతున్నారు..మేధో అజ్ఞానులుగా,  ప్రజా వ్యతిరేకులుగా చరిత్రలో నిలిచిపోతున్నారు.. ఇప్పటికైనా మేధావులు మేల్కోపోతే నష్టపోయేది తెలంగాణ మాత్రమే కాదు..ప్రజల్లో మీకున్న గౌరవం కూడా..గతంలో మేధావుల్లారా రచయితల్లారా మీరు ఎవరివైపు అని యువత ప్రశ్నించినట్లే..తెలంగాణ మేధావుల్లారా  మీరు ఎవరి వైపు అని ప్రశ్నించే పరిస్థితి ఏర్పడుతుంది..!!

-తోటకూర రమేష్ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *