special Stories

special Stories

డ్రైనేజీ–నాలా అభివృద్ధి వ్యవస్థను పటిష్టం చేయాలి

“హైదరాబాద్‌ వంటి వేగంగా విస్తరిస్తున్న మహానగరంలో డ్రైనేజీ వ్యవస్థను నిర్లక్ష్యం చేయడం భవిష్యత్తులో మరింత పెద్ద విపత్తులకు దారితీస్తుంది. అందువల్ల ఎస్‌ఎన్‌డీపీని కేవలం ఒక మౌలిక వసతుల ప్రాజెక్టుగా కాకుండా హైదరాబాద్‌ భవిష్యత్‌ భద్రతకు సంబంధించిన అత్యవసర కార్యక్రమంగా ప్రభుత్వం పరిగణించాలి.డ్రైనేజీ–నాలా వ్యవస్థ పటిష్టమైతేనే హైదరాబాద్‌ వరద ముప్పు నుంచి సురక్షితంగా ఉంటుంది. శాస్త్రీయ ప్రణాళిక,…

మరింత బలమైన ఉపాధి హామీ పథకం అవసరం!

“మొత్తం మీద, గ్రామీణ కష్టాలను తగ్గించడంలో నిరూపితమైన ట్రాక్ రికార్డ్ ఉన్నప్పటికీ, గత ఐదేళ్లుగా భారతదేశ ఉపాధి హామీ కార్యక్రమం ఒక అద‌న‌పు ఆదాయ‌ వ్యవస్థగా బలహీనపడటం ఆందోళన కలిగించే విషయం. దాదాపు ఒక దశాబ్దంగా వాస్తవ వేతనాలు స్తంభించిపోయిన నేపథ్యంలో, రుతుపవన వర్షాలు తక్కువగా పడటం అనేది పథకాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వాన్ని ప్రేరేపించి…

నిర్భయంగా సాగుతున్న దందా… నిర్లజ్జగా నిఘా?

Telangana Infant-Sale Racket

తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన పసిబిడ్డల అమ్మకాల ముఠాల ఉదంతంపై తెలంగాణ హైకోర్టు వ్యక్తం చేసిన ఆందోళన అత్యంత తీవ్రమైనది, ఆలోచింపజేసేది. సూర్యాపేట జిల్లాలో వెలుగుచూసిన 3 నుండి 9 ఏళ్ల పసిపిల్లల అమ్మకాల ఉదంతాన్ని విచారించిన ధర్మాసనం, ఇది కేవలం ఒక ప్రాంతానికో, జిల్లాకో పరిమితమైన సమస్య కాదని, రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించిన ఒక…

ఆక్రమణలు తొలగించాలి… పౌరుల హక్కులను కాదు

హైదరాబాద్‌లో చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురికావడం కొత్త విషయం కాదు. దశాబ్దాలుగా రాజకీయ అండదండలు, అధికారుల నిర్లక్ష్యం, రియల్‌ ఎస్టేట్‌ ప్రయోజనాలు కలిసి నగర సహజ వనరులను కబళించాయి. వాటిని పరిరక్షించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా (HYDRAA) లక్ష్యం అవసరమైనదే. కానీ ఎంత గొప్ప లక్ష్యంతో ఏర్పడిన సంస్థ అయినా చట్టానికి…

అసమానతలపై శాంతి సమరం… ప్రవక్త ముహమ్మద్ సమాజ పరివర్తనం

“మదీనాలో ముహమ్మద్ ఒక ఆదర్శవంతమైన రాజనీతిజ్ఞుడిగా, న్యాయమూర్తిగా వ్యవస్థలను తీర్చిదిద్దారు. భిన్న మతాలు, యూదు, క్రైస్తవ తెగలు కలిసి జీవించేందుకు ‘మీసాఖ్-ఎ-మదీనా’ (మదీనా రాజ్యాంగం) పేరిట ప్రపంచంలోనే తొలి లిఖితపూర్వక ప్రజాస్వామిక ఒప్పందాన్ని రూపొందించారు. ఇది మత స్వేచ్ఛను, పౌరులందరికీ సమాన రక్షణ బాధ్యతను కల్పించింది.” మదీనా రాజ్యాంగం నుంచి మానవ హక్కుల దాకా: మహోన్నత…

మహిళలు లక్ష్యంగా అనైతిక రాజకీయాలు!

“త్రిషా కృష్ణన్, జార్జియా మెలోనిల పట్ల ఆన్లైన్ లో జరిగిన వ్యవహారశైలిని కలిపేది ఒకటే —పురుషులను అణగదొక్కడానికి మహిళల పేర్లను ఉపయోగించడం అనే అంతర్లీన యంత్రాంగం. రెండు సందర్భాల్లోనూ, అసలైన రాజకీయ లక్ష్యం ఒక పురుష నాయకుడే, కానీ చౌకబారు వ్యాఖ్యానాల వల్ల మూల్యం చెల్లించింది మాత్రం మహిళే! ఇది రాజకీయ పోరాటంలో ఒక స్పష్టమైన,…

కాంగ్రెస్ లో’ ముసలం ‘పుట్టిందా!?

“అంతర్గత బలహీనతలు సొమ్ము చేసుకునే రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ కి వెన్నతో పెట్టిన విద్య. కనుక ముసలం ముదిరి పాకానపడుతున్నట్లే రాజకీయ వాతావరణం కనిపిస్తోంది. ఒక వైపు కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానాలు నెరవేర్చలేని స్థితి, మరోవైపు సగం సగం అమలు జరిపిన అసంతృప్తి, కొన్నింటిని ఆపేసుకుంటున్న స్థితి ,నిధులు కొరత ఆ పార్టీకి శాపంగా…

ఇంకా కనువిప్పు కాలేదా?

63. వరంగల్ వాణి 1987 సంపాదకీయం ప్రతిపక్షాలు సంఘటితంగా ఉంటే ప్రతిపక్షాల నోట్లు చీలిపోకుండా అధికార పార్టీని సులభంగా గద్దెదించటానికి వీలవుతుంది అంటూ ఇటీవలివరకూ నిరంతర ప్రచారంచేసిన వివిధ ప్రతిపక్షాల నాయకులు హఠాత్తుగా ప్లేటు ఫిరాయించాలిచ్చాడు. ‘ఏ విధమైన సామర్థ్యం లేని ప్రతిపక్షాలు సంఘటితమై ఉండలేవనీ, కనీసం కలిసికట్టుగా ఉండేందుకు కనీసకార్యక్రమాన్నైనా రూపొందించుకోలేవనీ, ఒకవేళ రూపొందించుకోగల్గినా…

విశ్వవిద్యాలయ మానసిక సంక్షోభం: విద్యార్థుల ఒత్తిడి మరియు మూల్యాంకన విధానాల వైఫల్యం

“మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఈ పరిస్థితిని “కాటాస్ట్రోఫిక్ థింకింగ్” అని పిలుస్తారు. ఒక రసాయన శాస్త్ర పరీక్షలో తప్పు సమాధానం ఇవ్వడం చిన్న తప్పుగా కాకుండా జీవిత పతనానికి ఆరంభంగా విద్యార్థులు భావిస్తున్నారు. స్కాలర్‌షిప్ పోతుంది, తల్లిదండ్రులను నిరాశపరుస్తాను, భవిష్యత్తు మూసుకుపోతుంది అనే ఆలోచనలు వారి మనసును ఆక్రమిస్తున్నాయి. ఈ నిరంతర భయ భావన విద్యార్థులు పరీక్షల్లో…

అధికార్ల‌పై క్రిమిన‌ల్ చ‌ర్య‌లు అవ‌సరం!

హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌ పరిధిలోని అంజయ్యనగర్–కొండాపూర్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఏడు అంతస్తుల భవనం ఆగస్ట్ 22న కుప్పకూలడం, ఇద్దరు వలస కార్మికులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విచారకరం. నగరంలో ఒక అక్రమ కట్టడం కూలిపోవడం ఇదే మొదటిసారి కాదు, బహుశా ఆఖరిది  కాకపోవొచ్చు. అయితే, ప్రతి ప్రమాదం తర్వాత వినిపించే అధికారిక ప్రకటనలు, కారణాలు…