special Stories

special Stories

ఆహార పదార్థాల కల్తీని శాశ్వతంగా నిర్మూలించడం ఎలా?

“ఆహార కల్తీ నిర్మూలన బాధ్యత ప్రభుత్వానిదే అని భావించడం సరైంది కాదు. చట్టాలను రూపొందించడం, అమలు చేయడం, తనిఖీలు నిర్వహించడం ప్రభుత్వ బాధ్యత అయితే, కల్తీకి పాల్పడకుండా నైతికంగా వ్యవహరించడం వ్యాపారుల బాధ్యత. అనుమానాస్పద ఆహార పదార్థాలను గుర్తించి సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయడం వినియోగదారుల బాధ్యత.ప్రజలు కూడా తక్కువ ధరకు వస్తున్నాయనే కారణంతో నాణ్యతపై…

యువత ఆశలపై ‘టామ్కామ్’ నీళ్లు!

సమాజంలో ‘ఉద్యోగం’ అనేది కేవలం ఒక ఉపాధి మార్గం మాత్రమే కాదు; అది లక్షలాది నిరుద్యోగ కుటుంబాల ఆత్మగౌరవం, జీవితకాల కల. రాష్ట్రంలో కొలువుల భర్తీ ప్రక్రియపై ఇప్పటికే రాజకీయ రగడ సాగుతుండగా, తాజాగా ప్రభుత్వ రంగ సంస్థ  తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ (టామ్కామ్) ద్వారా విదేశీ ఉద్యోగాల నియామకాల చుట్టూ ముసురుకున్న వివాదం…

తెలంగాణ జెన్‌ జీలో నిస్తేజం ఎందుకు?

“తెలంగాణ జెన్‌ జీలో నిస్తేజం ఎందుకు ఆవరించుకున్నది? రాష్ట్ర సాధన ఉద్యమంలోనూ, విద్యార్థి, విప్లవ ఉద్యమాల్లోనూ కీలక పాత్ర పోషించి చైతన్యానికి ప్రతీకలుగా నిలిచిన యువత జంతర్‌ మంతర్‌ ఉద్యమాలకు ఎందుకని స్పందించడం లేదు? రాజకీయ నైరాశ్యమా? ఆత్మసంతృప్తా? కెరీరిజమా? ఏ కారణంగా యువత ఉద్యమాలను భుజానికెత్తుకోవడం లేదు? దేశవ్యాప్తంగా వోటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర…

రష్యాపై ఆంక్షల “మినహాయింపు” అమెరికా వ్యూహాత్మక “కవ్వింపు”

“ఆంక్షల అసలు లక్ష్యం రష్యా యుద్ధ సామర్థ్యాన్ని తగ్గించి, ఉక్రెయిన్‌ యుద్ధానికి ముగింపు పలికేలా ఒత్తిడి తీసుకురావడం. కానీ ఆంక్షల ప్రభావం అమెరికా, భారత్‌ సహా ఇతర దేశాల ఆర్థిక ప్రయోజనాలపై కూడా పడుతున్నప్పుడు వాటిని యథాతథంగా కొనసాగించడం అంత సులభం కాదు. అందుకే ట్రంప్‌ సిద్ధాంతపరమైన కఠిన వైఖరి కంటే ప్రయోజనాల ఆధారిత విధానానికి…

పంటకు విరామం సరే… రైతు బతుకుకు భరోసా ఏది?

“గత ప్రభుత్వాన్ని విమర్శించడం ద్వారా ప్రస్తుత ప్రభుత్వ బాధ్యత తగ్గిపోదు. గత పాలన విజయాలన్నీ సంపూర్ణమని చెప్పడం కూడా సమస్యకు పరిష్కారం కాదు. ఎవరి హయాంలో ఏ తప్పు జరిగిందో నిర్ధారించడంతోపాటు ఇప్పుడు రైతుకు నీరందించేందుకు ఏం చేస్తున్నారన్నదే ముఖ్యం. రాజకీయ పోటీకి రైతు జీవితం మూల్యంగా మారకూడదు. పాలనకు గీటురాయి ప్రచారం కాదు; ప్రజలకు…

శివ శక్తి స్వరూపమే దుర్గామాత

 “దుర్గాష్టమి రోజును ఆయుధాలకు, వాహానాలకు పూజ చేస్తారు. పాండవులు అరణ్యవాసం ముగించి, అజ్ఞాతవాసానికి వెళ్తూ జమ్మిచెట్టు కొమ్మల మధ్య తమ ఆయుధాలను దాచి వెళ్లారు. తిరిగి వచ్చిన తర్వాత అర్జునుడు జమ్మిచెట్టుపై దాచిన ఆయుధాలను తీసి, పూజించి, ఉత్తర గోగ్రహణ యుద్ధం చేశాడు. శత్రువులను జయించి విజయుడయ్యాడు. ఆయుధాలకు రక్షణ కల్పించిన జమ్మిచెట్టు పవిత్రతను సంతరించుకుంది.…

నిరసనలను సాధారణ ప్రజలకు దూరంచేసే యత్నం!

“దిల్లీలోని జంతర్ మంతర్, ముంబైలోని ఆజాద్ మైదాన్, బెంగళూరులోని ఫ్రీడమ్ పార్క్‌లో ఒక చిన్న ప్రాంతం వంటి ప్రదేశాలు “ప్రత్యేక నిరసన స్థలాలు”గా మారాయి. అంటే, ఆ ప్రదేశానికే పరిమితమయ్యే నిరసనను చేపట్టడానికి ముందు ప్రజలు పోలీసుల అనుమతి తీసుకోవలసిన ప్రదేశాలుగా ఇవి మారాయి. (ఆర్టికల్ 19 ప్రకారం నిరసనలు చేయడం, సమావేశమవడం ప్రజల ప్రాథమిక…

పనిదినాల్లో వోటర్ల నమోదు శిబిరాలు.. వెలవెలబోయిన కేంద్రాలు

హైదరాబాద్‌లో అక్టోబర్ 15, 16 తేదీల్లో నిర్వహించిన ప్రత్యేక వోటర్ల నమోదు శిబిరాలకు ఆశించిన స్థాయిలో స్పందన కరువైందని అక్టోబర్ 17న ప్రచురితమైన వార్తా కథనాలు స్పష్టం చేస్తున్నాయి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియలో భాగంగా అర్హులైన కొత్త వోటర్లను చేర్చడానికి, డ్రాఫ్ట్ జాబితా నుంచి తొలగించిన పేర్ల పునరుద్ధరణకు ఫారమ్-6 ద్వారా దరఖాస్తు…

ప్రజల జీవన సంస్కృతికి ప్రతీకలు బతుకమ్మ – దసరా

“బతుకమ్మ – దసరా తెలంగాణ ప్రజల జీవన సంస్కృతిలో భాగమైన పండుగలు. పూలను పేర్చే చేతుల్లో ప్రకృతితో అనుబంధం, పాటల్లో మహిళల అనుభవాలు, పల్లె ఉత్సవాల్లో సామూహిక జీవితం, జానపద కళల్లో శ్రమజీవుల సృజన కనిపిస్తాయి. ఈ ప్రజా సంస్కృతిని మతతత్వం, మార్కెట్‌ వినియోగ సంస్కృతి తమ ప్రయోజనాలకు ఉపయోగించుకునే పరిస్థితిని ఎదుర్కోవాలి. సమానత్వం, లౌకికత,…

రాజకీయ రణ క్షేత్రంలో రగులుతున్న వివాదాలు

  “నిరసనలను పట్టించుకోకుండా,  పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి డీ లిమిటేషన్ బిల్లుతో పాటు, మహిళలకు చట్టసభల్లో మూడో వంతు రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకున్న నిర్ణయానికి ఆమోద ముద్ర వేయించుకోవాలని ప్రయత్నిస్తున్నది. ఈ బిల్లులు ప్రస్తుతం జరుగుతున్న సిజెపి, విపక్షాల నిరసనల నుండి దారి మళ్ళించడానికా? లేక ప్రతి పక్షాలు మహిళల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయని…