prajatantra_news

prajatantra_news

విద్యతో క్రీడల అనుసంధానం

– రాష్ట్రాన్ని క్రీడా శక్తిగా తీర్చిదిద్దేందుకే స్పోర్ట్సు వర్శిటీ – అంతర్జాతీయస్థాయి క్రీడాకారులను తయారు చేయడమే లక్ష్యం – శాసనమండలిలో యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి శ్రీహరి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 12 : క్రీడలను విద్యతో అనుసంధానం చేసి అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడాకారులను తీర్చిదిద్దే లక్ష్యంతో యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్…

వర్కింగ్ జర్నలిస్టులకు ఏఐపై 21న వర్క్‌షాప్

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 12 : రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టుల కోసం ఈనెల 21న‌ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)పై తెలంగాణ మీడియా అకాడమి వర్క్‌షాప్ నిర్వహించనుంది. వర్క్ షాప్ ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నాంపల్లి ఛాపెల్ రోడ్డులోని మీడియా అకాడమి ఆడిటోరియంలో జరుగుతుంది. ఈ వర్క్ షాప్‌లో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్…

డిసెంబర్ 2027కు నాగపూర్- వరంగల్ హైవే పూర్తి

–  మండలిలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 12 : నాగ్‌పూర్-మంచిర్యాల-వరంగల్-ఖమ్మం-విజయవాడ గ్రీన్‌ఫీల్డ్ హైవే చాలా ముఖ్యమైన రహదారి అని, మొత్తం 310 కి.మీ పొడవు ఉన్న ఈ ప్రాజెక్టులో 280 కి.మీ తెలంగాణలోనే ఉందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. శాసనమండలిలో సభ్యులు…

మండపాలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం

– అతిథులను ఆహ్వానిస్తే కమిషనరేట్‌కు సమాచారం ఇవ్వండి – పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలి – గణేష్ ఉత్సవాలపై సీఎం సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 12 : దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. మండప నిర్వాహకులు సంబంధిత అధికారుల వద్ద…

‘రీయింబర్స్‌మెంట్’పై దాటవేత తగదు

– రూ.15 వేల కోట్ల బకాయిల విడుదల ఎప్పుడో ప్రకటించాలి – జీవో 97తో పాలిటెక్నిక్ వ్యవస్థను నాశనం చేస్తున్నారు – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 12 : కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదలపై కాలయాపన చేయకుండా స్పష్టమైన ప్రకటన చేయాలని…

కృత్రిమ పనీర్‌ ‌బంద్‌

-ఏ డాదిపాటు అనలాగ్‌ ‌పనీర్‌పై నిషేధం – ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ హైదారాబాద్‌,‌ ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 11: ‌హోటళ్లు, దాబాలు, రోడ్డు పక్కన ఫాస్ట్‌ఫుడ్‌ ‌సెంటర్లలో పనీర్‌ ‌బట్టర్‌ ‌మసాలా, పన్నీర్‌ ‌టిక్కా అంటూ లొట్టలేసుకుని లాగించే భోజనప్రియలకు ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. మార్కెట్లో విచ్చలవిడిగా లభిస్తున్న కృత్రిమ, నాన్‌-‌డెయిరీ అనలాగ్‌ …

ట్రాక్టర్లపై అసెంబ్లీకి వెళ్లిన బీజేపీ ఎమ్మెల్యేలు

హైదారాబాద్‌, ‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 11: ‌రాష్ట్రంలోని రైతాంగాన్ని ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన్‌ ‌మంత్రి ఫసల్‌ ‌బీమా యోజనను రాష్ట్రంలో వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ ‌చేస్తూ బీజేపీ శాసనసభాపక్షం నిరసన వ్యక్తం చేసింది. శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ ‌నుంచి అసెంబ్లీ వరకు బీజేపీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు ట్రాక్టర్లతో భారీ నిరసన…

డాక్టర్ అనితా రెడ్డికి అయిలమ్మ బ్రేవరీ, సోషల్ జస్టిస్ అవార్డు

వ‌రంగ‌ల్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 11:  అనురాగ్ సొసైటీ చైర్మన్, కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యు లు డాక్టర్ అనితా రెడ్డి చేస్తున్న సమాజ సేవను గుర్తించి చాకలి అయిలమ్మ బ్రేవరీ సోషల్ జస్టిస్ అవార్డు 2026  అందించారు. మహిళల విద్య, వైద్యం, ఆర్థిక ఎదుగుదలకు చేప‌డుతున్న‌ కార్యక్రమాలు, ఆరోగ్యకరమైన సమాజం కోసం డాక్టర్ అనితా రెడ్డి…

ఆయుధాల చోరీ కేసులో నలుగురి అరెస్ట్

కేసు ఛేదించిన పోలీసులు, మిలిటరీ అధికారులు ‌హైదారాబాద్‌,‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 11: ‌హైదరాబాద్‌లోని బొల్లారంలో ఉన్న మద్రాస్‌ ‌రెజిమెంట్‌ ‌బెల్‌ ఆఫ్‌ ఆర్మస్‌లో జరిగిన భారీ ఆయుధాల చోరీ కేసును పోలీసులు, మిలిటరీ అధికారులు అత్యంత సమర్థవంతంగా ఛేదించారు. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌ ‌వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి మొత్తం…

అనర్హుల ఖాతాలకు రూ.10 వేలు రిఫండ్‌

‌హైదారాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 11: ఇం‌దిరమ్మ ఇళ్ల పథకానికి ద‌ర‌ఖాస్తు చేసి లిస్ట్‌లో పేరు రాలేదా.. అయితే మీకు గుడ్‌ ‌న్యూస్‌. అప్లికేషన్‌ ‌సమయంలో డిపాజిట్‌గా చెల్లించిన రూ.10 వేల మొత్తాన్ని హౌసింగ్‌ ‌బోర్డు తిరిగి దరఖాస్తుదారుల బ్యాంక్‌ ‌ఖాతాల్లో జమ చేయనుంది. ఈ రిఫండ్‌ ‌ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుందని హౌసింగ్‌ ‌బోర్డు…