డాక్టర్ అనితా రెడ్డికి అయిలమ్మ బ్రేవరీ, సోషల్ జస్టిస్ అవార్డు

వ‌రంగ‌ల్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 11:  అనురాగ్ సొసైటీ చైర్మన్, కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యు లు డాక్టర్ అనితా రెడ్డి చేస్తున్న సమాజ సేవను గుర్తించి చాకలి అయిలమ్మ బ్రేవరీ సోషల్ జస్టిస్ అవార్డు 2026  అందించారు. మహిళల విద్య, వైద్యం, ఆర్థిక ఎదుగుదలకు చేప‌డుతున్న‌ కార్యక్రమాలు, ఆరోగ్యకరమైన సమాజం కోసం డాక్టర్ అనితా రెడ్డి అందిస్తున్న సేవలను గుర్తించి అవార్డుకు ఎంపిక చేసి అందచేశామని నీతి ఆయోగ్య‌, మనం ఇంటర్నేషనల్ ఫౌండేషన్ పౌండర్ చైర్మన్ అడ్వకేట్ డాక్టర్ చక్రవర్తి తెలిపారు, మానవ హక్కుల పరిరక్షణ, కులమతాలను అరికట్టడంలో దైర్యంగా పోరాటం చేయడం, యువతను తీర్చిదిద్దుతున్న తీరు, సమాజంలో మహిళలు మోసపోకుండా ఉండేందుకు కల్పిస్తున్న అవగాహన కార్యక్రమాలు చాలా స్పూర్తి దాయ‌కంగా ఉన్నాయని, అవి సమాజానికి చాలా ఉపయోగపడుతున్నాయని , అందుకే  ఈ ప్రతిష్టాకరమైన అవార్డును డాక్టర్ అనితా రెడ్డికి ఇచ్చామ‌ని, అదే చాకలి అయిలమ్మకు ఇచ్చే ఘన నివాళి అని డాక్టర్ చక్రవర్తి అన్నారు, ఈ సందర్భంగా డాక్టర్ అనితా రెడ్డి మాట్లాడుతూ ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని, బాద్యత మరింత పెరిగిందని ,మహిళల ఎదుగుదల  సమానత్వం కులమతాలకతీతంగా మనుషులు ఒకరికొకరు గౌరవించుకుని, సహకరించుకునే మార్పు చూడాలన్నదే తన ద్యేయం అని, సమాజానికి విలువలతో కూడిన యువతను తయారు చేయడంలో కీలకమైన పాత్ర పోషించి సమాజాసేవ బాధ్యతగా చేస్తానని  అన్నారు, అవార్డులు రావడం గొప్ప కాదని ఆ అవార్డు కు వన్నె తెచ్చేలా పనిచేయగలగాలని నమ్మే వ్యక్తినని,  మాటలు కాదు పనిచేసి చూపిస్తానని డాక్టర్ అనితా రెడ్డి అన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *