హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 12 : రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టుల కోసం ఈనెల 21న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)పై తెలంగాణ మీడియా అకాడమి వర్క్‌షాప్ నిర్వహించనుంది. వర్క్ షాప్ ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నాంపల్లి ఛాపెల్ రోడ్డులోని మీడియా అకాడమి ఆడిటోరియంలో జరుగుతుంది. ఈ వర్క్ షాప్‌లో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ప్రవేశిక, వినియోగించే టూల్స్, పద్ధతులు, దీని ద్వారా రూపొందించే అంశాలలో బాధ్యతాయుత, నైతిక ప్రమాణాల లాంటి అంశాలు ఉంటాయి. వర్క్‌షాప్‌లో పాల్గొనేందుకు ఆసక్తి గల జర్నలిస్టులు వారి పేరు, పనిచేస్తున్న మీడియా సంస్థ, ప్రదేశం, మొబైల్ నెంబర్ వివరాలు అకాడమి వాట్సఅప్ నెంబర్ 7093600977కు పంపి 18వ తేదీలోగా నమోదు చేసుకోవాలి. ముందుగా నమోదు చేసుకున్న అర్హత గల 50మంది వర్కింగ్ జర్నలిస్టులకు ఈ వర్క్‌షాప్‌లో పాల్గొనే అవకాశం ఉంటుంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు



