సమాచారం అంతా ‘వెబ్‌’ గుప్పిట్లోనే…!

1948లో ట్రాన్సిస్టర్‌ అనే చిన్న ఎలక్ట్రానిక్‌ పరికరం కనుగొన్న తరువాత ఎలక్ట్రానిక్స్‌ రంగం రూపురేఖలు మారిపోయాయి. దీని సహాయంతో ఎలక్ట్రానిక్‌ చిప్లు తయారుచేసారు. కంప్యూటర్లు తయారు చేయబడ్డాయి. దీనికి తోడు అంతర్జాలం కనుగొనిన తరువాత ఈ రంగం వెనుకకు తిరిగి చూడలేదు.

జీవితంలో అంతర్భాగం: ప్రస్తుతం అంతర్జాలం( ఇంటర్నెట్‌ ) లేని రంగం లేదంటే అతిశయోక్తి కాదు. దైనందిన జీవితంలో వెబ్‌లో సోషల్‌ మీడియాను ఉపయోగించడం సర్వ సాధారణంగా మారింది. ఇది సమాచారాన్ని ప్రసారం చేయడమే కాకుండా ఒక కొత్త ప్రపంచ మార్కెట్‌ను సృష్టించింది. మనకు కావలసిన సమాచారం అంతర్జాలం ఉపయోగించి వెతకాలంటే ఒక బ్రౌజర్‌ అవసరం. ఇది వరల్డ్‌ వైడ్‌ వెబ్‌ ( డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ) సహాయాన్ని తీసుకుంటుంది. వరల్డ్‌ వైడ్‌ వెబ్‌ లేదా వెబ్‌ అనేది ఇంటర్‌కనెక్టడ్‌ వెబ్‌పేజీల వ్యవస్థ.

ఇంటర్నెట్‌ని ఉపయోగించి సమాచారాన్ని యాక్సెస్‌ చేయొచ్చు. విభిన్న పేజీలను ఒకదానితో ఒకటి కనెక్ట్‌ చేసే లింక్‌లను ఉపయోగించి సమాచారాన్ని సులభంగా భాగస్వామ్యం చేయడం, కనుగొనడంలో సహాయం చేయడానికి ఇది సృష్టించబడిరది. వెబ్‌సైట్‌లను బ్రౌజ్‌ చేయడానికి, వీడియోలను చూడటానికి, ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేయడానికి కంప్యూటర్‌లు లేదా ఫోన్‌ల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతరులతో కనెక్ట్‌ అవ్వడానికి వెబ్‌ అనుమతిస్తుంది. కమ్యూనికేషన్‌, వాణిజ్యం, విద్య వినోదాన్ని, ఆధునిక సమాజాన్ని రూపొందిస్తుంది. అనుసంధానించబడిన ప్రపంచ కమ్యూనిటీని సులభతరం చేసింది. వరల్డ్‌ వైడ్‌ వెబ్‌ అనేది మన రోజువారీ జీవితంలో అంతర్భాగంగా మారింది.

వరల్డ్‌ వైడ్‌ వెబ్‌ డే: వరల్డ్‌ వైడ్‌ వెబ్‌ డే ప్రతి సంవత్సరం ఆగష్టు 1 న జరుపుకుంటారు. వెబ్‌ని ఉపయోగించి సమాచారాన్ని స్వేచ్ఛగా బ్రౌజ్‌ చేసే వ్యక్తుల సామర్థ్యానికి గౌరవ సూచకంగా ఈ రోజు గుర్తించబడిరది.

చారిత్రాత్మక ఆవిష్కరణ: వరల్డ్‌ వైడ్‌ వెబ్‌ అనేది ఇంటర్నెట్‌కు కనెక్ట్‌ చేయబడిన కంప్యూటర్ల ద్వారా వినియోగదారులు యాక్సెస్‌ చేయగల ప్రపంచ సమాచార మాధ్యమం. వరల్డ్‌ వైడ్‌ వెబ్‌ ఇంటర్నెట్‌లో సులభంగా ఉపయోగించగల, సౌకర్యవంతమైన ఆకృతి ద్వారా సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి వీలు కల్పించింది. తద్వారా ఇంటర్నెట్‌ వినియోగాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషించింది. ఇది ఆధునిక ప్రపంచాన్ని తీర్చిదిద్దిన చారిత్రాత్మక ఆవిష్కరణ.

లక్ష్యం: వరల్డ్‌ వైడ్‌ వెబ్‌ యొక్క లక్ష్యం ప్రపంచవ్యాప్తంగా కమ్యూనికేషన్‌, విద్య జ్ఞానాన్ని పంచుకునేలా చేయడం ద్వారా ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండే గ్లోబల్‌ ఇన్ఫర్మేషన్‌-షేరింగ్‌ ప్లాట్‌ఫారమ్‌ను అందించడం. గ్లోబల్‌ కమ్యూనికేషన్‌, విద్య, వ్యాపారం వినోదం కోసం వరల్డ్‌ వైడ్‌ వెబ్‌ కీలకమైనది.

చరిత్ర: బ్రిటీష్‌ శాస్త్రవేత్త టిమ్‌ బెర్నర్స్‌-లీ 1989లో సెర్న్‌ అనే పరిశోధనా సంస్థలో పనిచేస్తున్నప్పుడు వరల్డ్‌ వైడ్‌ వెబ్‌ ని కనుగొన్నారు. సెర్న్‌ అనేది 100 కంటే ఎక్కువ దేశాల నుండి 17000 కంటే ఎక్కువ మంది శాస్త్రవేత్తలను కలిగి ఉన్న కారణంగా వారికి వారందరూ సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునే అవసరం ఏర్పడిరది. టిమ్‌ బెర్నర్స్‌ లీ కోసంబెల్జియన్‌ సిస్టమ్స్‌ ఇంజనీర్‌ రాబర్ట్‌ కైలియావుతో కలిసి నవంబర్‌ 1990లో ‘‘వరల్డ్‌వైడ్‌వెబ్‌’’ అని పిలువబడే ‘‘హైపర్‌టెక్స్ట్‌ ప్రాజెక్ట్‌’’ను రూపొందించారు. దీనిలో ‘‘బ్రౌజర్‌లు’’ ద్వారా ‘‘హైపర్‌టెక్స్ట్‌ డాక్యుమెంట్స్‌’’ యొక్క ‘‘వెబ్‌’’ వీక్షించవచ్చు. 1990 చివరి నాటికి టిమ్‌ బెర్నర్స్‌ లీ ప్రదర్శిస్తూ మొదటి వెబ్‌ సర్వర్‌, బ్రౌజర్‌ను ప్రారంభించాడు. అతను వెబ్‌ సర్వర్‌ కోసం కోడ్‌ను అభివృద్ధి చేశాడు. ఱఅటశీ.షవతీఅ.షష్ట్ర అనేది ప్రపంచంలోని మొట్టమొదటి వెబ్‌సైట్‌ తోపాటు వెబ్‌ సర్వర్‌ యొక్క చిరునామా కూడా. ప్రారంభ సంవత్సరాల్లో సెర్చ్‌ ఇంజిన్‌లు లేవు. టిమ్‌ బెర్నర్స్‌-లీ 1992లో మొదటి ఫోటోను అప్‌లోడ్‌ చేసి విప్లవానికి నాంది పలికారు. 90 వ దశకం మధ్య నాటికి వరల్డ్‌ వైడ్‌ వెబ్‌ కమ్యూనికేషన్‌ యొక్క అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మాధ్యమంగా మారింది, ఇది మిలియన్ల మంది క్రియాశీల వినియోగదారులను సంపాదించుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page