తెలంగాణలో కాంగ్రెస్‌ వర్సెస్‌ కాంగ్రెస్‌..!!

“దేశంలో ఒకప్పుడు తిరుగులేని శక్తిగా నిలిచి దేశ రాజకీయాలనే కాదు ఆలీనోద్యమంతో ప్రపంచ రాజకీయాలను కూడా ఒకానోక సమయంలో కాంగ్రెస్‌ పార్టీ శాసించింది. అయితే ఇప్పుడు గతమెంతో ఘనకీర్తి,నేడు అధోగతి అన్నట్లు తయారైంది. ఏ అంతర్గత ప్రజాస్వామ్యం, ఎవరు ఎవరిపైనా అయిన విమర్శలు చేసే స్వేచ్చ వంటి అంశాలే కాంగ్రెస్‌కు బలమని ఆ పార్టీ హైకమాండ్ ప్రకటించుకుంటుందో ఇప్పుడు అవే బలాలు పార్టీకి బలమైన బలహీనతలుగా మారాయి.. ప్రత్యార్థి బీజేపీకి ప్రభావంతమైన ప్రచారాయుధాలుగా మారాయి.”

తెలంగాణ కాంగ్రెస్‌లో విభేదాలు కొంతకాలంగా నివురుగప్పిన నిప్పులా ఉంది..కాంగ్రెస్‌ పార్టీ అంటేనే గ్రూప్‌ పాలిటిక్స్‌కే కేరాఫ్‌ అడ్రస్‌ గాంధీ భవన్‌..కాంగ్రెస్‌లో నాయకులకు స్వేచ్చ ఎక్కువ, తమ పార్టీ సముద్రం వంటిందని ఆ పార్టీ నేతలను గ్రూప్‌ రాజకీయాలకు సమర్ధించుకోవచ్చు..కాంగ్రెస్ బలం బలహీనతలు కూడా గుంపు రాజకీయాలు, అతి స్వేచ్చే.

పార్టీలో నేతల మధ్య పోటీ పార్టీని బలోపేతం చేసేలా ఉండాలి. నాయకుల మధ్య ఆరోగ్యకరమైన,మంచి పోటీ వాతావరణం ఉంటే ఏ రాజకీయ పార్టీ అయిన ప్రజల్లోకి బలంగా వెలుతుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్య చాలా ముఖ్యం.అయితే కాంగ్రెస్‌ ఈ  అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని ఆ పార్టీ నేతలు విశ్వాసిస్తారు. 140 ఏళ్ల కాంగ్రెస్‌ చరిత్రను, దాదాపు 8 దశాబ్దాలుగా దేశంలో కాంగ్రెస్‌ ప్రజలకు ఎలా దూరమైందో పరిశీలిస్తే అర్థమైతుంది. కాంగ్రెస్‌లో ఉండేది పార్టీని బలోపేతం చేస్తూ ప్రజలకు దగ్గరయ్యే ప్రజాస్వామ్యం కాదు.నేతల మధ్య ఉన్నది ఆరోగ్యకమరమైన పోటీకాదు.ఆనారోగ్యకరమైన పోటీ.పార్టీని ప్రజలకు దూరం చేసే పోటీ. ప్రజలు పార్టీకి దూరమయ్యే పోటీ.

దేశంలో ఒకప్పుడు తిరుగులేని శక్తిగా నిలిచి దేశ రాజకీయాలనే కాదు ఆలీనోద్యమంతో ప్రపంచ రాజకీయాలను కూడా ఒకానోక సమయంలో కాంగ్రెస్‌ పార్టీ శాసించింది. అయితే ఇప్పుడు గతమెంతో ఘనకీర్తి,నేడు అధోగతి అన్నట్లు తయారైంది. ఏ అంతర్గత ప్రజాస్వామ్యం, ఎవరు ఎవరిపైనా అయిన విమర్శలు చేసే స్వేచ్చ వంటి అంశాలే కాంగ్రెస్‌కు బలమని ఆ పార్టీ హైకమాండ్ ప్రకటించుకుంటుందో ఇప్పుడు అవే బలాలు పార్టీకి బలమైన బలహీనతలుగా మారాయి..ప్రత్యార్థి బీజేపీకి ప్రభావంతమైన ప్రచారాయుధాలుగా మారాయి.

ఏ అంశాలైన తమ పార్టీకి బలమని కాంగ్రెస్‌ నమ్మిందో, అవే అంశాలు ఆ పార్టీకి బలహీనతలుగా మారి 140 ఏళ్ల గ్రాండ్ ఓల్డ్‌ పార్టీ పునాదులను కూల్చుతున్నాయి. స్వేచ్ఛ, అంతర్గత ప్రజాస్వామ్యం గాంధీ భవన్‌ను చెదలులా తినేస్తు బలహీనపర్చుతుంది. అందుకే దేశంలో కాంగ్రెస్‌ మూడు రాష్ట్రాల్లో మాత్రమే అధికారానికి పరిమితం అయ్యింది. కేరళం, తమిళనాడు, జార్ఖండ్‌ వంటి రెండు మూడు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకు తోక పార్టీలుగా దిగజారి పోయింది. ఉత్తరాది బీమారు స్టేట్స్‌లో కాంగ్రెస్‌ ప్రాభవాన్ని కోల్పోయి ఘోర పరాజయాన్ని చవిచూడటంతో వైప్ అవుట్ అయింది. ఏఐసీసీ కూడా పూర్తిగా ఉత్తర భారత్‌ లో పార్టీని వదిలేసి దక్షిణ భారత్‌పై ఫోకస్‌ పెట్టింది. ఒక్క మాటలో చెప్పాలంటే కాంగ్రెస్‌ ఇప్పుడు దక్షిణాది పార్టీగా ఉత్తరాది ప్రజల్లో ముద్రపడింది.

దేశంలో కాంగ్రెస్‌ను బయట ప్రత్యార్థి పార్టీలు బలహీనపర్చాల్సిన అవసరం లేదు. పార్టీలో గ్రూప్‌ పాలిటిక్స్‌, అంతర్గత విభేదాలే ఆ పార్టీని పుట్టిముంచింది. ఇప్పటికీ ముంచుతుంది కూడా. నార్త్‌లో ఉనికే ప్రశ్నార్థకంగా మారితే ఇప్పుడు సౌత్‌లో కూడా ఉనికే ప్రమాదంలో పడే విధంగా కాంగ్రెస్‌ వ్యవహర శైలి ఉంది. దేశంలో కేవలం మూడు రాష్ట్రాల్లోనే పూర్తి స్థాయి మేజార్టీలో అధికారంలో ఉంది. అందులో ఒక నార్త్‌ ఉంటే రెండు సౌత్‌లో ఉన్నాయి. ఉత్తరాదిలో చిన్న రాష్ట్రం హిమాచల్‌లో మాత్రమే పవర్ లో ఉంది..అతి కూడా అంపశయ్యపైనే ఉంది. దక్షిణాదిలో తెలంగాణ, కర్నాటక వంటి బలమైన ఆర్థిక రాష్ట్రాల్లో కాంగ్రెస్‌లో అధికారంలో ఉన్నా  దాన్ని నిలుపుకునేలా పాలన కనిపించడం లేదు.

ఏ గ్రూప్‌ పాలిటిక్స్‌, అంతర్గత ప్రజాస్వామ్యం కాంగ్రెస్ బలమని ఆ పార్టీ చెప్పుకుంటుందో ఆ అంశాలే తెలంగాణ,కర్నాటకలో కాంగ్రెస్‌లో పుట్టిముంచుతున్నాయి. రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం తుమ్మితే ఊడిపోయే పరిస్థితి ఉంది..ప్రభుత్వంలో, పార్టీలో అంతర్గత కుమ్ములాలటు తారా స్థాయికి చేరింది..రెండున్నర మూడేళ్లల్లోనే తెలంగాణ, కర్నాటక రాష్ట్ర కాంగ్రెస్‌లో గ్రూప్‌ రాజకీయాలు, నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్‌ మధ్య గ్రూప్‌ పాలిటిక్స్‌ పీక్‌ చేరాయి..పార్టీలో ప్రభుత్వంలో తన ఆధిపత్యాన్ని నిలుపుకున్న రేవంత్‌ రెడ్డి ఒరిజినల్  కాంగ్రెస్‌ నేతలకు చెక్‌ పెట్టుతున్నారు. రేవంత్‌ రెడ్డి బీసీ నినాదం ఎత్తుకున్నట్లే ఎత్తుకుని బీసీ నేతలు, బీసీ మంత్రులపై తన వర్గం చేత విష ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలు పార్టీలో వినిపిస్తుంది.బీసీ నేతలు, బీసీ మంత్రులను టార్గెట్ చేస్తూ తన అనుకూల మీడియాలో వ్యతిరేక వార్తలు రాయిస్తున్నారనే అనుమానాలు ఒరిజినల్ కాంగ్రెస్‌ నేతల్లో వ్యక్తమవుతున్నాయి..గతంలో మంత్రి కొండా సురేఖ, మంత్రి పొన్నం, భట్టి విక్రమార్కపై అవినీతి ఆరోపణలు, భూకబ్జాలంటూ ఒక సెక్షన్‌ మీడియాలో ప్రచారం చేశారన్న ఆరోపణలున్నాయి.

తాజాగా టీపీసీసీ చీఫ్‌ పై కాంగ్రెస్‌ పార్టీ మీడియాలో వ్యతిరేక ప్రచారం దాన్ని నడిపిస్తున్న షాడో నేత వ్యతిరేక ప్రచారం చేయించారన్న చర్చ గాంధీ భవన్‌లో జరుగుతుంది. స్వయంగా సొంత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిపైనే  సొంత ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేయింది..రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ఆఫీస్‌ గాంధీ భవన్‌లోనే బీర్‌ సీసాలంటూ ప్రచారం చేసింది. నిత్యం మంత్రులు, ప్రభుత్వ విప్‌లు, ముఖ్యమంత్రి వచ్చే తమ పార్టీ ఆఫీస్‌నే బార్‌ షాప్‌ అన్నట్లు బీర్‌ సీసాలున్నాయని కాంగ్రెస్‌ మీడియా ప్రచారం చేసింది. గాంధీ భవన్‌కు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు, మంత్రులు, ఏఐసీసీ నేతలతో పాటు సీఎం కూడా వస్తారు మరీ వాళ్లలో ఎవరో ఒకరు తీసుకెళ్లితే తప్ప బీర్‌ సీసాలు గాంధీ భవన్‌ కంపోండ్‌లోకి వెళ్లవు. మరీ ఎవరూ తాగారు.?.ఎవరూ గాంధీ భవన్‌లోకి తీసుకువెళ్లారు.?.

అది పక్కనబెట్టితే, టీపీసీసీ చీఫ్‌ను, కాంగ్రెస్‌ పార్టీని టార్గెట్‌ చేసే ఉద్దేశ్యం ఎవరి ఉంటుంది..?..అందులోనూ కాంగ్రెస్‌ నేత ఆధ్వర్యం నడిచే, షాడో బ్రదర్స్‌ నాయకత్వంలో నడిచే మీడియాలోనే ఇలా కాంగ్రెస్‌కు నష్టం చేసే వార్త వచ్చిందంటే తెరవెనుక ఎవరున్నారో తెలంగాణ ప్రజలకు, కాంగ్రెస్‌ కార్యకర్తలు తెలుసుకోలేనంత అమాయకులేం కాదు.

సరే బీర్‌ సీసా వదిలేస్తే అసలు టీపీసీసీ చీఫ్‌ను కాంగ్రెస్‌ మీడియా ఎందుకు టార్గెట్‌ చేసింది..?.సొంత పార్టీ అధ్యక్షుడిపై కక్షకట్టి రోజంతా బ్రేకింగ్‌లు నడపాల్సిన అవసరం ఎవరికి ఉంది.?. సొంత పార్టీ అధ్యక్షుడిపై సొంత మీడియాతో వ్యతిరేక వార్తలు రాస్తే ప్రభుత్వానికి నష్టం జరగదా..? ఖచ్చితంగా జరుగుతుంది..ఇది అవగాహన లేక రాయించిన వార్త కాదు..ఉద్దేశ్యపూర్వంగా బీసీ నేత, టీపీసీసీ చీఫ్‌ను టార్గెట్‌ చేసి రాయించిన వార్త.

అయితే టీపీసీసీ చీఫ్‌పై వ్యతిరేకంగా వార్త రాయించాల్సిన అవసరం పార్టీలో ఎవరికి ఉంది..?.సొంత పార్టీ ప్రయోజనాలు ప్రమాదంలో పెట్టి రాయించే సాహసం ఎవరూ చేస్తారు..?.రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియకుండానే కాంగ్రెస్‌ అనుకూల మీడియాలో ప్రచారం జరిగిందా..అంటే ఆ చానల్‌ నడిపిన వార్తను చూస్తే దీని వెనుక ప్రభుత్వ పెద్ద ఎవరో ఉన్నారని స్పష్టంగా అర్థమైతుంది.

ప్రభుత్వ పథకాలు పార్టీ పరంగా టీపీసీసీ చీఫ్‌, ఏఐసీసీ ఇంచార్జ్‌ ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో విఫలమైందని, పార్టీ పదవులు భర్తీ చేయడం లేదని ప్రధానంగా ఆ చానల్‌ టీపీసీసీ చీఫ్ పై చేసిన ఆరోపణలు.టీపీసీసీ చీఫ్‌ వల్ల క్యాడర్‌ అసంతృప్తితో ఉన్నారని మరో విమర్శ. అయితే ప్రభుత్వ పథకాలు ఏ మున్నాయని టీపీసీసీ చీఫ్ ప్రజల్లోకి తీసుకువెళ్లలేదు..ఏ సంక్షేమం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిందిగనుక జనాల్లో తీసుకువెళ్లడానికి..అరకొరగా ఒకటి రెండు అమలు చేసిన పథకాలకు ముఖ్యమంత్రి సభలు పెట్టి మరీ ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.కదా.ఇక టీపీసీసీ చీఫ్‌ ఏం చేస్తుంది.?.అంటే టీపీసీసీ చీఫ్ పై కాంగ్రెస్‌లో ఒక గ్రూప్‌కు చెందిన మీడియా ఉద్దేశ్య పూర్వకంగానే టీపీసీసీ చీఫ్‌పై ప్రభుత్వ పెద్ద ఆదేశాలతో వ్యతిరేక ప్రచారం చేసిందని స్పష్టమైతుంది.

రాష్ట్రంలో సీఎం రేవంత్‌ రెడ్డి బీజేపీకి దగ్గర అవున్నారని, రెండున్నేరళ్ల పాలనలో విఫలమయ్యారనే చర్చ ప్రజల్లో జరుగుతుంది. ముఖ్యమంత్రి తీరుతో కాంగ్రెస్‌ పార్టీపై తీవ్ర జనాగ్రహం పెరుగుతుంది..అయితే ఈ వ్యతిరేకత తన వల్ల కాదని, టీపీసీసీ వల్లే అని చెప్పేందుకు తన అనుకూల మీడియాలో రేవంత్ రెడ్డి పార్టీ వ్యతిరేక రాతలు రాయించారనే వాదన గాంధీ భవన్‌ వర్గాల్లో వ్యక్తమైంతుంది.

 అంతేకాదు ఇటీవలె రాష్ట్రంలో రాజకీయ సంచలనం సృస్టించిన ఒక ఫోక్సో కేసు కాంగ్రెస్‌లో తుఫాన్‌ సృష్టించింది. నిందితుడి తండ్రి కేంద్ర మంత్రి కావడంతో నిందితుడిని కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం కాపాడే ప్రయత్నం చేసిందన్న అభిప్రాయం ప్రజల్లోకి బలంగా వెళ్లింది.దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్‌పై ప్రజా వ్యతిరేకత పెరిగింది. ఈ పోక్సో కేసు టీకాంగ్రెస్‌లో గ్రూప్‌ రాజకీయాలను తారా స్థాయికి చేర్చింది.పార్టీ అధ్యక్షుడు-పార్టీ ముఖ్యమంత్రికి మధ్య విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి.

వాస్తవానికి సీఎం రేవంత్‌ రెడ్డి బీజేపీ దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నట్లు ఆయన వ్యవహశైలితో అర్థమైంతుంది. ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయాలు కూడా ఏకపక్షంగా, కాంగ్రెస్‌ పార్టీ సిద్దాంతాలకు వ్యతిరేకంగా, ఏఐసీసీ రాజకీయ ఆలోచనలకు విరుద్దంగా ఉంటున్నాయి..సొంత పార్టీని ఇరుకు పెట్టి.ప్రత్యర్థి పార్టీ బలోపేతం అయ్యేలా ఉన్నాయని హైకమాండ్ గుర్రుగా ఉంది.

జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ బీజేపీతో రాజకీయ యుద్దం చేస్తుంటుంటే తెలంగాణలో కాంగ్రెస్ సీఎం మాత్రం బీజేపీని భుజాలకెత్తుకుంటున్నారు..అదానీ నుంచి బండి భగీరథ్‌ వరకూ రాహుల్ గాంధీ ఎడ్డెం అంటే తెలంగాణ ముఖ్యమంత్రి తెడ్డెం అంటారు. మోదీ  షాలు హమ్ దో హమారే దో అని అదానీ అంబానీలకు దేశ సంపద దోచిపెడుతున్నారని విమర్శిస్తే.తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ ముఖ్యమంత్రి అదానీలకు రెడ్ కార్పెట్‌ పరుస్తున్నారు . రాహుల్‌ గాంధీ దేశం కోసం జోడో యాత్రలు చేస్తే, తెలంగాణ సీఎం సొంత ప్రయోజనాల కోసం బీజేపీతో దోస్తీ కట్టుతున్నారు.రాష్ట్ర రాజకీయాలు, కాంగ్రెస్‌ విధానాలు గమనిస్తున్న తెలంగాణ ప్రజలు హస్తం పార్టీపై ఆగ్రహంతో ఉన్నారు.

కేసీఆర పాలన కంటే మెరుగైన పాలన అందిస్తారని ఆశలో కాంగ్రెస్‌ను గెలిపిస్తే. రెండున్నరేళ్లు దాటిని పాలన గాడిన  పడలేదు. అభివృద్ది,సంక్షమం పట్టాలెక్కలేదు. ఆరు గ్యారంటీలు, 420 హామీల అమలు లేదు..డిక్లరేషన్లు ఎక్కిరిస్తున్నాయి. ప్రజా సమస్యలు వదిలేసి పదవుల కోసం  పాకులాడుతున్నారు..గ్రూప్‌లతో ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజల నోట్లో మట్టి కోట్టుతుంది.

-తోటకూర రమేష్ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *