“దికు మొక్కు లేని జనం ఒక్కొక్కటి అగ్ని కణం అయి లేచినప్పుడు , సంక్షోభం అనే కాలం సుడి తిరుగుతూ వస్తున్నప్పుడు, దిక్కులు పిక్కటిల్లే” ఆజాదీ”నినాదం ఉత్త డొల్ల కాదు.దేశ యువత కలఅది, ఆకలి, ఆర్తనాదం, అవమానం ఏదో ఒకనాడు వెల్లువ ఎత్తక మానదు.అందుకు చిన్న సంకేతమే ఈ తిరుగుబాటు ‘బౌద్ధిక ‘బొద్దింక!?”
-ఎన్.తిర్మల్ సీనియర్ జర్నలిస్టు, రచయిత, సామాజిక కార్యకర్త మొబైల్: 9441864514. ఇమెయిల్: thirmal. 1960@gmail.com
అశాంతి నుండి శాంతి పుడుతుంది.శాంతి,ఓపిక,సహనం కూడా హేతుబద్దత వైపు ప్రయాణం చేసినప్పుడు అశాంతి ప్రబలి అంతిమంగా శాంతి కి బీజం వేసే అవకాశం ఉంది.మన ఉన్నంత న్యాయస్థానం చీప్ జస్టిస్ సూర్యకాంత్ నోటి నుండి పుట్టిన బొద్దింక కూడా బౌద్ధిక న్యాయం సూత్రానికి దర్పణమే! జస్టీస్ సూర్యకాంత్ అన్యొపదేశంగా ఓ తీర్పు సందర్భంగా కొందరు యువకులు పనిపాటలేక సమాచార హక్కు కార్యకర్తలు,సోషల్ మీడియా కార్యకర్తలు గా మారి సమాజానికి చికాకు కలిగిస్తూ,ఇబ్బంది కరంగా తయారయ్యారు అన్నారు.దేశ యువతపై ఆయన వ్యక్తం చేసిన పరాన్న జీవి కాక్రోచ్ కాస్తా, న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సత్వర నిరసనతో రెక్కలు తొడిగి బొద్దింక @ అలియాస్ కాక్రోచ్ ను బౌద్ధిక తిరుగుబాటు చిహ్నం గా మార్చి వేసింది. బొద్దింక నెత్తిన పరిశృంగాలు కాస్తా యువత హేతుబద్ధ ప్రశ్నలుగామోలిచాయి. బొద్దింకకు జీవశాస్త్రం చరిత్ర ఉంది.ఇది “అని మారియా”అనబడే కింగ్ డమ్ కు ,”ఇన్ సెక్టా”అనబడే వర్గానికి చెందిన జీవి.”బ్లూటోడియా”దీని శాస్త్రీయ నామం.అమెరికాలో దీన్ని”ప్లెరీపేనాటా అమెరికానా”అని,జర్మనీలో”బ్లాటిల్లా జర్మనీ నా”అని అంటారు.స్పానిష్ భాష లో ”కాక్రోచ్”అంటారు.అదే పదం అంతర్జాతీయంగా స్థిరపడింది.మనదేశంలో కూడా “కాక్రోచ్”అనే పిలుస్తాము.ఇప్పుడు పెరిగిన ప్రాదాన్యత రీత్యా మనదేశంలో ముద్దుగా”సూర్యాకాంక్రొచ్”గా పిలుచుకోవచ్చునేమో!
ఇన్ సెక్టా జాతికి చెందిన జీవుల్లో కాక్రోచ్ ప్రత్యేకత ఏమంటే జీవిలో రక్తం ఉండదు.అంతేకాదు ఊపిరితిత్తులు ప్రత్యేకత కలిగి ఉంటాయి. అందుకే అణుబాంబులు పడినా చలించని జీవి ఏమైనా ఉంది అంటే మన కాక్రోచ్ నే అని చెప్పుకోవచ్చును.మన చీప్ జస్టిస్ గారు చెప్పినట్లు,మురికి ఉన్నచోటే మనుగడ సాగిస్తుంది .ఇది ఖాలీ ఇండ్లలో,చీకటి గదుల్లో చిందరవందరగా తిరిగే పరాన్న జీవినే! కాకుంటే ఎవరు మాత్రం పరాన్న జీవులు కాదు? ఆ మాటకొస్తే మనిషికి ఆహారం ఎక్కడి నుండి వస్తుంది.ఇతర జీవులు,మోక్కల నుండి.జంతువులకు ఆహారం ఎక్కడినుండి వస్తుంది? మోక్కలు,ఇతరజంతువులనుండేకదా! ఆమాటకొస్తే ఈచరాచర జగత్తు మొత్తం ఆహారం కోసం ఒకరినొకరు పరస్పరం భక్షించే లేక భుజించే పరాన్న జీవులే కదా? న్యాయం, చట్టం, అధికారం,ఉద్యోగం అన్నీపరాన్నభుక్తమేకదా?కాదని ఎవరైనా అనగలరా?అంతమాత్రం చేత కాక్రోచ్ లనే నిందించడం ఏమి కీటక న్యాయం?
చూపుడు వేలిని నెత్తిమీద మెత్తుకొని ఆలోచనలో పడింది మన బొద్దింక@కాక్రోచ్.మన ప్రధాన న్యాయమూర్తి వెంటనే నాలిక కరుచుకొని నేను అన్ని బొద్దింకల్ని అనలేదు.కొన్ని బొద్దింకల తోనే నాకు పేచీ అన్నాను అని తన మాటల్ని సవరించుకున్నారు.అయినా అప్పటికే కాలాతీతం అయ్యింది.బొద్దింక కాస్తా సూర్య తేజం నింపుకొని ,అసంత్రృప్తి రెక్కలు తొడుక్కొని మన’బౌద్దిక బొద్దింక ‘తనదైన శైలిలో సోషల్ మీడియాలోకి ఎగిరిపోయింది.ఏతావాతా దేశాన్ని సరిహద్దులు దాటి ప్రపంచాన్ని చుట్టేసింది.ప్రఖ్యాత బోస్టన్ యూనివర్సిటీ లో పబ్లిక్ రిలేషన్స్ లో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్న మహారాష్ట్ర కు చెందిన అభిజీత్ దీప్కే అనే ఓపిల్లకాయ ఎగిరి వచ్చిన బొద్దింక రెక్కలు అణచి పట్టుకొని శోధించి,పరిశోధించి తన చదువు కాస్తా ప్రయోగాత్మకంగా ప్రయోగించి తన సోషల్ మీడియా వెబ్సైట్ లో బొద్దింక తో జత కలిసి “కాక్రోచ్ జనతాపార్టీ”సిజేపి పార్టీని స్థాపించాడు.సరదాగా చీప్ జస్టిస్ పుణ్యం కనుక”చీప్ జస్టీస్ పార్టీ”అర్థం వచ్చేలా తన సిజెపి పార్టీ ఉందికదా! మొత్తం మీద బిజెపి పార్టీ వారంలోగానే పాలక పార్టీ బిజెపి సోషల్ మీడియాను కూడా దాటిపోయింది. దాటిపోవడమే కాదు,షేక్ చేసింది.15 కోట్ల మైలురాయి దాటడం తో సెటారికల్ గా ఏర్పడ్డ’ కాక్రోచ్ పార్టీ ‘కాస్తా సంచలనం అయ్యింది.ఉద్యోగాలు రాక నిరుద్యోగులుగా మారిన 30 కోట్లమంది యువత,ఇటీవల పేపర్ లీకుతో భవిష్యత్ అందకారబందురమై వీదులెక్కిన విద్యార్థులు,అవును మేం పరాన్న భుక్కులమే కానీ,మీలా దోచుకునే దొంగలం మాత్రం కాదని మర్లబడ్డారు.అంటే తిరగబడ్డారు.
కాక్రోచ్ జనతాపార్టీ ఓ షార్టు ప్రణాళిక కూడా ప్రకటించింది.ఇప్పుడు దేశంలో అదికారపక్షాలు,ప్రతిపక్షాలు లోపాలను బలహీనత బహిర్గత పరిచేసిన ప్రణాళిక అది.
సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎవరికీ పదవి విరమణ అనంతరం రాజ్యసభ సభ్యత్వం ఇవ్వబడదు (ఇది పరోక్షంగా బొద్దింక కు రాజకీయ రూపం తొడిగిన న్యాయమూర్తి ని దృష్టిలో పెట్టుకొని చేసిన ప్రాధాన్యతా అంశం)
ఎలక్ట్రానిక్ మెసిన్లు కాకుండా బ్యాలెట్ పై వోట్లు వేసే ఏర్పాటు తోపాటు పౌరులు వోటును తొలగించిన ఎన్నికల అధికార్లను ఉపా చట్టం క్రింద కేసు పెట్టి జైళ్ళలో వేయాలి.
రాజకీయాల్లో సమాజంలో సగభాగం అయిన మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి.
వ్యాపార వెత్తలు నిర్వహిస్తున్న గోది మీడియా జర్నలిజం లైసెన్స్ లు రద్దుచేయాలి.
పార్టీ మారిన ప్రజాప్రతినిధులను 20 ఏళ్ళపాటు ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధం విధించాలి.
ఈ ఐదు అంశాలు కూడా రాజకీయంగా ఎంతో నైతిక ప్రాదాన్యత కలిగి ఉండడంతో పాటు,ప్రస్తుతం అధికారపార్టీ అనుసరిస్తున్న అపసవ్య ధోరణుల ను ఎత్తిచూపేవి కావడం,ప్రతిపక్షాల అసమర్థతను కప్పిపుచ్చేవి కావడంతో దేశ యువత దృష్టి ‘సిజేపి’వైపు మళ్ళింది.ప్రణాళిక పట్ల సానుకూలత వ్యక్తం అయ్యింది.ఒకరకంగా అధికారం వెలగబెట్టే పార్టీలు వ్యవస్థలో బలహీనతలతో ఆడుకుంటున్న వైనంపై కాక్రోచ్లు తన సోషల్ మీడియా దాడిని ఎక్కువ పెట్టాయి.
మోదట కాస్తా తేలిగ్గా తీసుకున్న అధికారపార్టీ తర్వాత ఎక్కడో తమ పునాదులు కదులుతున్న జాడలు పసిగట్టాయి.తన పాలన పట్ల యువత లో ఉన్న అసంతృప్తి కి భయపడిపోయింది.కళ్ళు మూసుకొని పాలు తాగే పిల్లిలా బిజెపి పార్టీ వ్యవస్థాగతంగా చేస్తున్న గుండా గిరికి తిరిగి రెక్కలు తొడిగింది.తన సహజమైన ధోరణితో తూచ్…అసలు కాక్రోచ్ పార్టీ లేదు? కాక్రోచ్ ముఖాలు,రెక్కలు కట్టుకొన్న వారందరూ పక్కదేశాలైన పాకిస్థాన్, బంగ్లాదేశ్ పరాన్న బుక్కులు మన దేశ పరాన్న బుక్కులు కాదు అంటూ మన పురాతన ,పురాన దేశభక్తులు ఎప్పటిలా చెలరేగిపోయారు. బుకాయింపులకు దిగారు.పరాన్న భుక్కులు కదా!అని వదిలి వేయకుండా”కాక్రోచ్ పార్టీ”సోషల్ మీడియా అకౌంట్స్ మూసివేయడంతో పాటు,పార్టీని సోషల్ మీడియాలో పుట్టించిన వారికి చక్కగా చావు బెదిరింపులు సాగనంపారు.బిత్తర పోయినా కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజీజు లాంటి వారు కూడా “కాక్రోచ్”పార్టీపై దండయాత్ర మోదలెట్టారు.
ఇక ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్,మహువా మెయిత్రా,కీర్తీ అజాద్ లాంటి వారు కాక్రోచ్ పార్టీ ప్రణాళిక సమర్థించడం తో యువతలో ఉత్సాహం ఉరకలెత్తుతుంది.ఈ యువప్రవాహం జెన్ జెడ్ తిరుగుబాటుగా మారి ప్రస్తుత పాలకులను ముంచెత్తగలదా?లేదా?అనే విషయం పక్కన పెడితే, ఒకరకంగా ప్రస్థుత పాలకుల వైఫల్యాలను,అసమర్థతను బహిర్గతం చేసిన సోషల్ మీడియా తిరుగుబాటు అని చెప్పక తప్పదు.ఏ పాలకుడైనా అవినీతి, ఆశ్రిత పక్షపాతం శృతిమించితే,అబద్దాలతో, తప్పుడు ప్రచారాలతో, దౌర్జన్యాలు తో పాలించే పాలనకు చెల్లుచీటీ చెప్పే విధంగా,ఇప్పుడు ఉన్న యువత తిరుగుబాటు జెండా ఎగుర వేయగలదా? ఏమో!చెప్పలేము.
తమ మాయామేయ పరిపాలన ద్వారా పరిపాలనలో ఉన్న బలమైన ప్రతిపక్ష ప్రభుత్వాలను, సాయుధ పోరాట మనబడే పటిష్టమైన సైద్ధాంతిక బలం కలిగిన నక్సలైట్లు ను కూలదోసిన బిజెపి “మోషా”ద్వయం ఈ రెక్కల పురుగు పార్టీకి బయటపడుతుందా?అనే సంశయం ఉన్నప్పటికీ! జరుగుతున్న పరిణామాలు అధికార, ప్రతిపక్షపార్టీ లలో ఒకరకమైన భయం ను సోషల్ మీడియా రూపంలో పుట్టించాయనడంలో సందేహం లేదు.దికు మొక్కు లేని జనం ఒక్కొక్కటి అగ్ని కణం అయి లేచినప్పుడు , సంక్షోభం అనే కాలం సుడి తిరుగుతూ వస్తున్నప్పుడు,దిక్కులు పిక్కటిల్లే”ఆజాదీ”నినాదం ఉత్త డొల్ల కాదు.దేశ యువత కల అది,ఆకలి,ఆర్తనాదం,అవమానం ఏదో ఒకనాడు వెల్లువ ఎత్తక మానదు.అందుకు చిన్న సంకేతమే ఈ తిరుగుబాటు ‘బౌద్ధిక ‘బొద్దింక!?