త్రిబుల్ తలాఖ్, ఆర్టికల్ 370 రద్దు మరియు అయోధ్య రామ మందిర నిర్మాణం వంటి క్లిష్టమైన అంశాలను తమ ఆలోచనలకు అనుగుణంగా అమలు చేసిన కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ నేతృత్వం లోని ఎన్డీయే ప్రభుత్వం మంగళ వారం మరో సంక్లిష్టమైన అంశాన్ని తెరపైకి తెచ్చింది. జమిలి ఎన్నికలుగా ప్రచారంలో ఉన్న ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ విధానాన్ని చట్టం చేయడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది. 2023 సెప్టెంబర్ 2 న, భారత ప్రభుత్వం జమిలి ఎన్నికల అంశాన్ని పరిశీలించడానికి మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నేతృత్వం లో ఒక ఉన్నత స్థాయి కమిటీ నియమించింది. 14 మార్చి 2024న, మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కమిటీ రూపొందించిన 18,000 పేజీల తుది నివేదికను ప్రస్తుత భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించారు. నివేదికను కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం వన్ నేషన్-వన్ ఎలక్షన్‌కు పచ్చజెండా ఊపింది.
త్వరలో జరుగనున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్‌ను కేంద్రం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబోతున్నది. కోవింద్ కమిటీ నివేదికను కేంద్ర మంత్రివర్గం ఆమోదించిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ ప్రణాళిక ఆచరణ సాధ్యం కాదనీ . . ఇది ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం గా రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.’’ఎన్నికలు వొచ్చినప్పుడు, బీజేపీ వాస్తవ సమస్యల నుండి దృష్టిని మళ్లిస్తారు.’’ .ఒకే దేశం, ఒకే ఎన్నికలు’’ అన్నది దృష్టి మరల్చే బీజేపీ వ్యూహం.. ‘‘ఇది రాజ్యాంగానికి విరుద్ధం, ప్రజాస్వామ్యానికి విరుద్ధం, ఫెడరలిజానికి విరుద్ధం. దీన్ని దేశం ఎప్పటికీ అంగీకరించదు… అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి .సంప్రదింపుల సందర్భంగా 80 శాతం మంది మద్దతు తెలిపారన్న కమిటీ .. 80 శాతం మంది ఎవరన్నది తెలియాల్సి ఉంది. ఎవరైనా మమ్మల్ని ఏమైనా అడిగారా లేదా మాతో మాట్లాడారా? అని నిలదీస్తున్నారు . ఏకకాలంలో లోక్‌సభ మరియు అసెంబ్లీ ఎన్నికలను ప్రతిపాదించే ఈ ప్రణాళిక ప్రకారం, ఎన్డీయే మరియు సుప్రీంకోర్టులోని పలువురు న్యాయమూర్తుల మద్దతు ఉంది. దీని ప్రకారం సార్వత్రిక, రాష్ట్ర ఎన్నికలు జరిగిన 100 రోజుల్లోగా పట్టణ, పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలి. అయితే దీన్ని అమలు చేయడానికి పార్లమెంటులో మూడిరట రెండు వంతుల మెజారిటీ అవసరం, ఎందుకంటే ఇందులో రాజ్యాంగ సవరణ ఉంటుంది.
దీన్ని అమలులోకి తీసుకురావడానికి కనీసం ఆరు సవరణలు అవసరం. దీని తరువాత, అన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలచే ఆమోదించబడాలి. పార్లమెంటు ఉభయ సభల్లో ఎన్‌డీఏకు సాధారణ మెజారిటీ ఉండగా, ఏ సభలోనూ మూడింట రెండొంతుల మెజారిటీ సాధించడం సవాలుగా మారుతుంది . రాజ్యసభలోని 245 సభ్యులలో ఎన్డీఏకు 112, ప్రతిపక్ష పార్టీలకు 85..ఉన్నారు. మూడిరట రెండొంతుల మెజారిటీకి ప్రభుత్వానికి కనీసం 164 మంది సభ్యుల మద్దతు అవసరం.లోక్‌సభలో కూడా 545 సీట్లకు గాను ఎన్‌డీఏకు 292 సభ్యులు మాత్రమే ఉన్నారు . మూడిరట రెండు వంతుల మెజారిటీ మార్క్ 364 .. అయితే పరిస్థితి మారవొచ్చు .. ఎందుకంటే మెజారిటీని హాజరైన సభ్యుల వోటింగ్ మాత్రమే లెక్కించవచ్చు. సాంప్రదాయకంగా అంశాల వారీగా మద్దతిస్తున్న పార్టీలకు కొంతమంది ఎంపీలు కూడా ఉన్నారు, అయితే వారు ఇప్పుడు ఎటువైపు ఉంటారో ఇంకా తెలియదు. అంతకుముందు, బిజెడి మరియు ఎఐఎడిఎంకెలు ఎన్డీయే కు మద్దతు ఇచ్చాయి. ఒడిశా మరియు ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలలో నవీన్ పట్నాయక్ బిజూ జనతాదళ్ మరియు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకటి బిజెపి మరియు మరొకటి బిజెపి మిత్రపక్షం చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ చేతిలో ఓడిపోయారు.
బీజేడీకి రాజ్యసభలో 7 మంది, వైఎస్సార్‌సీపీకి రాజ్యసభలో 9 మంది, లోక్‌సభలో నలుగురు ఎంపీలు ఉన్నారు. ఎగువ సభలో అన్నాడీఎంకేకు నలుగురు ఎంపీలు మాత్రమే ఉన్నారు. అన్ని అడ్డంకులను తొలగించిన తర్వాత, చట్టాన్ని తేవొచ్చు . కానీ ప్రభుత్వం, దేశవ్యాప్తంగా ప్రజామోదం పొందాల్సిన అవసరముంటుంది. ‘‘ఒక దేశం ఒక ఎన్నిక’’ ప్రతిపక్షాలు ఈ ఆలోచనకు మద్దతు ఇవ్వడానికి నిరాకరిస్తూ , ఇది ప్రజాస్వామ్య విరుద్ధమని, రాజ్యాంగానికి వ్యతిరేకంగా మరియు ఆచరణాత్మకం కాదని వాదించారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని కి ప్రత్యామ్నాయం కోసం బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నారు.
వాస్తవానికి జమిలి ఎన్నికల ఆలోచనను దేశ ప్రజలు తిరస్కరించారనే చెప్పొచ్చు. 2024 సార్వత్రిక ఎన్నికలలో, లోక్‌సభలో బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే 353 నుండి 293 స్థానాలకు తగ్గింది, బిజెపి స్వయంగా 303 నుండి 240 సీట్లకు తగ్గింది. భారత జాతీయ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండీ కూటమి ఏకకాల ఎన్నికలను వ్యతిరేకిస్తూ 233 స్థానాలను గెలుచుకుంది . పార్లమెంటు ఉభయ సభలలో కనీసం 2/3 అత్యధిక మెజారిటీ (లోక్‌సభలో 362 మరియు రాజ్యసభలో 167) సాధించిన తర్వాత మాత్రమే ఏకకాల ఎన్నికలను అమలు చేయడానికి అవసరమైన రాజ్యాంగ సవరణలు చేయవొచ్చు కాబట్టి, ఈ ప్రతిపాదనపై పురోగతి సాధించడం చాలా తక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి.





