సీఎం రేవంత్ రెడ్డి కి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్

  కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి తో ఆదివారం సాయంత్రం ఫోన్ లో
 రాష్ట్రంలో వర్షాలు వరద పరిస్థితులను అడిగి తెలుసుకు న్నారు.  ప్రాణ నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని అమిత్ షా కు సీఎం తెలిపారు. అవసరమైన తక్షణ సాయం అందిస్తామని  అమిత్ షా హామీ ఇచ్చారు.
 కేంద్ర ప్రభుత్వం తరపున అవసరమైన వరద సహాయక చర్యలు అందిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు.
 రాష్ట్ర స్థాయి అధికారులు, అన్ని జిల్లాల కలెక్టర్ల తో నేరుగా మాట్లాడి ఎప్పటికప్పుడు పరిస్థితిని ముఖ్యమంత్రి సమీక్షిస్తున్నారు. అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్య మంత్రి
అప్రమత్తం చేసారు.బాధిత కుటుంబాలను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *