ఖమ్మంలో సీఎం రేవంత్ పర్యటన
ఖమ్మం జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. రాజీవ్ గృహకల్పలో ఇళ్లు నీట మునగడంతో తీవ్రంగా నష్టపోయిన వరద బాధితులకు రూ.10వేలు చొప్పున తక్షణ సాయం అందించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ప్రతి కుటుంబానికీ నిత్యావసరాలు అందించాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
సోమవారం సీఎం రోడ్డు మార్గంలో వరద ప్రభావిత ప్రాంతాలకు చేరుకున్నారు. సీఎం వెంట డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ రఘురాం రెడ్డి తదితరులు ఉన్నారు.





