వాయనాడ్‌లో కొండచరియల బీభత్సం

విరిగి పడడంతో 107కు పైగా మంది మృతి…పలువురు గల్లంతు
రెస్క్యూ కోసం కేంద్ర సాయం కోరిన కేరళ ప్రభుత్వం
వయనాడ్‌ విషాదంపై రాహుల్‌ ఆవేదన…
అదనపు పరిహారం అందించాలని లోక్‌సభలో వినతి
సహాయక, రెస్క్యూ చర్యలు ముమ్మరం
బారీ వర్షాలతో సహాయక చర్యలకు ఆటంకం

 
ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌, జూలై 30 : కేరళలోని వాయనాడ్‌ జిల్లాలో మెప్పాడి సమీపంలోని కొండ ప్రాంతాలలో భారీ కొండచరియలు బీభత్సం సృష్టించాయి. కొండచరియలు విరిగిపడటంతో శిథిలాల కింద పడి 107 మందికి పైగా మృతి చెందగా పలువురు గాయపడ్డారు. మంగళవారం తెల్లవారుజామున కేరళలోని వాయనాడ్‌ జిల్లాలో ఈ ఘటన సంభవించింది. కాగా ఇంకి పలువురు గల్లంతైనట్టు గుర్తించారు. గల్లంతైన వారి సంఖ్యను బట్టి మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కాగా ఘటనలో మరణించిన వారి బంధువులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. భారీ వర్షాలకు పెద్ద పెద్ద బండరాళ్లు కొండలపై నుంచి పడి ఎన్నో ఇళ్లు నేలమట్టం కాగా అనేక వాహనాలు కొట్టుకుపోయాయి. మరోవైపు కొండచరియలు మార్గాలను అడ్డుకోవడంతో రెస్క్యూ పనిలో వర్కర్లు నిమగ్నమయ్యారు. చనిపోయిన వారిని, క్షతగాత్రులను అంబులెన్స్‌లలోకి తరలించారు.
కాగా ఎడతెపి లేని భారీ వర్షం కారణంగా సహాయక చర్యలకు అడుగడుగునా ఆటంకం ఏర్పడుతున్నది. అనేక మంది శిథిలాల చిక్కుని ఆర్తనాదాలు చేస్తుండడంతో ఆ ప్రాంతంతో హృదయవిదారక దృశ్యాలు కనిపించాయి. ఇక భారీ వర్షాల వల్ల వరదలు, బురద ప్రవాహంలో వందలాది మంది కొట్టుకుపోయినట్లు సమాచారం. వారి ఆచూకీ కోసం సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టి, డ్రోన్లు, జాగిలాలతో అన్వేషణ కొనసాగిస్తున్నారు. కాగా 600 మంది వలస కార్మికుల ఆచూకీ గల్లంతు కావడం అధికారుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. మరో వైపు వాయనాడ్‌ విపత్తు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నేటి నుండి రెండు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది.
వయనాడ్‌ విషాదంపై రాహుల్‌ ఆవేదన…అదనపు పరిహారం అందించాలని లోక్‌సభలో వినతి
వయనాడ్‌లో విషాదంలోపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ ప్రస్తావించారు. దాదాపు 70 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారన్నారు. అదనపు పరిహారం అందించాలని కోరారు. వయనాడ్‌ విషాదంపై మంగళవారం లోక్‌సభలో చర్చకు వొచ్చింది. ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ ఈ అంశంపై మాట్లాడుతూ…వయనాడ్‌లో పలుమార్లు కొండచరియలు విరిగిపడ్డాయని, ఇప్పటి వరకు దాదాపు 70 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారని, బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయయని, ముండకై గ్రామంలో నష్టాన్ని అంచనా వేయాల్సి ఉందని తెలిపారు. రక్షణ మంత్రి, కేరళ ముఖ్యమంత్రితో తాను చర్చించానని, బాధితులకు తక్షణమే నష్టపరిహారం పెంచి పంపిణీ చేయాలన్నారు. వయనాడ్‌, పశ్చిమ కనుమల్లో గత కొన్నేళ్లుగా చాలా ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడే ముప్పు పొంచి ఉందన్నారు. ఇటువంటి ఘటనలు మన దేశంలో పెరిగిపోయాయని, ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. పర్యావరణ విపత్తులకు అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో వాటిని ఎదుర్కునడానికి అవసరమైన యాక్షన్‌ ప్లాన్‌ను సిద్ధం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
వయనాడ్‌లో కొండచరియలు, బురద విరుచుకుపడిన ఘటనలో ఇప్పటి వరకు 63 మంది మరణించారన్నారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఒకరిని రక్షించాయని, ఈ బృందాలు బాధితులను నదిపై నుంచి తరలిస్తున్నాయని తెలిపారు. ఆరోగ్యశాఖ మంత్రి వీణాజార్జ్‌ వాయనాడ్‌ ఘటనపై అత్యవసర సమావేశం నిర్వహించారు. హెల్త్‌ వర్కర్ల లీవ్‌లను తక్షణమే రద్దు చేశారు. మృతుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో..మృతదేహాలను బంధువులకు అప్పగించేందుకు సవిూప వైద్యశాలల్లో పోస్టుమార్టం పక్రియను వేగవంతం చేశారు.  మరో 108 అంబులెన్స్‌లను అదనంగా వయనాడ్‌ తరలించనున్నారు.  కోజికోడ్‌, కన్నూర్‌, త్రిశూర్‌ మెడికల్‌ కాలేజీల నుంచి ప్రత్యేక వైద్య బృందాల తరలింపు చేపట్టారు.  అవసరాన్ని బట్టి తాత్కాలిక ఆసుపత్రి, మార్చురీ ఏర్పాటుకు సన్నాహాలు. దీంతోపాటు కేరళ మెడికల్‌ సర్వీస్‌ కార్పొరేషన్‌ నుంచి అదనపు ఔషధాల తరలింపునకు ఆదేశాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page