బాధితులకు న్యాయం చేయాలి
దేశం శాస్త్ర, సాంకేతిక రంగాలలో అభివృద్ధి చెందింది, ప్రపంచ పెట్టుబడిదారి దేశాలను మించిపోతుంది అని మన దేశ పాలకులు ఉదరగొడుతున్నారు. అమెరికా, చైనాను అధిగమించి ముందుకు సాగుతున్నము అని చెప్పే అబద్ధాలు కట్టుకథలు నిజం కాదు అని.. వారి మాటల డొల్లతనాన్ని బయట పెట్టేవిధంగా అందవిశ్వాసాలు రాజ్యమేలుతున్నాయి. మూఢనమ్మకాలు ప్రచారం చేయడం నేరంగా పరిగణించి అరెస్ట్ చేయాలి. కఠినంగా శిక్షించాలి, బాబాల అక్రమ ఆస్తులు జప్తు చేయాలి, రాజ్యాంగంలోని ఆర్టికల్ 52 (%ష్ట్ర%) ప్రకారం ప్రతి పౌరుని ప్రాథమిక కర్తవ్యాలలో ఒకటి శాస్త్రీయ దృక్పదాన్ని, మానవతా వాదన్ని, జిజ్ఞాసను, సంస్కరణ తత్వాన్ని పెంపొందించుటకు ప్రభుత్వాలు భాధ్యత కలిగి ఉంటాయి.పౌరులందరు ఇట్టి విషయలను నిర్వర్తించాలి,
మూఢ విశ్వాసం అంటే ఏమిటి?
ఇది అజ్ఞానం లేదా భయానికి సంబంధించిన విశ్వాసం మరియు అతీంద్రియ శక్తుల పట్ల అబ్సెసివ్ గౌరవం కలిగి ఉంటుంది. ‘మూఢ విశ్వాసం’ అనే పదం లాటిన్ పదం ‘సూపర్స్టిటియో’ నుండి తీసుకోబడిరది , ఇది దేవుని పట్ల విపరీతమైన భయాన్ని సూచిస్తుంది . మూఢనమ్మకాలు దేశం, మతం, సంస్కృతి, సంఘం, ప్రాంతం, కులం లేదా తరగతికి సంబంధించినవి కావు, ఇది ప్రపంచంలోని ప్రతి మూలలో విస్తృతంగా వ్యాపించి ఉంది .
బ్లాక్ మ్యాజిక్ అంటే ఏమిటి?
చేతబడి అని కూడా పిలువబడే చేతబడి, చెడు మరియు స్వార్థ ప్రయోజనాల కోసం అతీంద్రియ శక్తిని ఉపయోగించడం మరియు భౌతికంగా లేదా మానసికంగా లేదా ఆర్థికంగా ఒకరిని నాశనం చేయడానికి హానికరమైన అభ్యాసాలను చేయడం . ఇది బాధితుడి జుట్టు, బట్టలు, ఫోటో లేదా నేరుగా కళ్ళలోకి చూడటం ద్వారా చేయవచ్చు దురదృష్టకరమైన విషయం ఏమిటి అంటే ఎవరైనా శాస్త్రీయ దృక్పథాన్ని ప్రజల్లో పెంచేందుకు కృషి చేస్తుంటే అనేక అంక్షాలకు గురి చేయబడుతున్నారు.కల్బర్జీ,ధబోల్
ప్రజల్లో శాస్త్రీయ దృక్పథం హేతుబద్ధత కల్పించే విధంగా ప్రభుత్వం ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి.ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో హత్రస్ సంఘటనలో 121 మంది అమాయక మహిళలు,చిన్న పిల్లలు బోలెబాబా అనే మోసకారి నిర్వహించిన సత్ సంఫ్‌ు కార్యక్రమంలో పాల్గొని తొక్కిసలాటలో చనిపోవడం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి ప్రధాన కారకుడు బోలె బాబాను అరెస్ట్ చేసి కటినంగా శిక్షించాలి.బాధ్యులైన అధికారులను,రాజకీయ నాయకులను నేరస్తులుగా పరిగణించి అరెస్ట్ చేయాలి,కటినంగా శిక్షించాలి,వారి ఆస్తులను జప్తు చేయాలి, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి అదిత్యనాద్ నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేయాలి,మరణించిన వారి కుటుంబాలకు 20 లక్షల రూపాయల నష్టరిహారం,కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి అని తెలంగాణ విద్యావంతుల వేదిక డిమాండ్ చేస్తుంది. మనుషుల బలహీనతలు పెట్టుబడిగా మోసం,అత్యాచారం ఆర్థిక దోపిడీకి కారణమైన బాబాలు, పాకిర్లు,పాస్టర్లు మాయ మాటలు నమ్మవద్దు అని దేశ ప్రజలందరికీ తెలంగాణ విద్యావంతుల వేదిక విజ్ఞప్తి చేస్తుంది. మళ్ళీ ఒకసారి దేశ వ్యాప్తంగా బుద్ధిజీవులు,మేధావులు సామజిక కార్యకర్తలు మూఢనమ్మకాలు నిరోధక చట్టం అమలు కోసం చర్చ చేయాలి,ప్రజలను చైతన్యం చేయాలి.
దేశ వ్యాప్తంగా మూఢ నమ్మకాల నిరోధక చట్టం అవసరం ఏమిటి?
అటువంటి పద్ధతులను అడ్డంకులు లేకుండా కొనసాగించడాన్ని అనుమతించడం అనేది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14 మరియు 21 ప్రకారం సమానత్వం మరియు జీవించే హక్కు అనే వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కును ఉల్లంఘిస్తుంది. ఇటువంటి చర్యలు భారతదేశం సంతకం చేసిన ‘యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, 1948’, ‘ది ఇంటర్నేషనల్ కవెనెంట్ ఆన్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్, 1966’ మరియు ‘కన్వెన్షన్ ఆన్ ది ఎలిమినేషన్’ వంటి అనేక అంతర్జాతీయ చట్టాల యొక్క అనేక నిబంధనలను కూడా ఉల్లంఘిస్తాయి. మహిళలపై అన్ని రకాల వివక్ష, 1979’. భారతదేశంలో ఇప్పటివరకు కేవలం ఎనిమిది రాష్ట్రాలు మాత్రమే మంత్రగత్తె వేట చట్టాలను కలిగి ఉన్నాయి.
వీటిలో బీహార్, ఛత్తీస్‌గఢ్, జారండ్, ఒడిశా, రాజస్థాన్, అస్సాం, మహారాష్ట్ర మరియు కర్ణాటక ఉన్నాయి. మూఢనమ్మకాలను పరిష్కరించడానికి చర్యలు లేనప్పుడు, అశాస్త్రీయమైన మరియు అహేతుకమైన ఆచారాలైన విశ్వాస వైద్యం, తప్పుడు సమాచారం మరియు వైద్య విధానాలకు సంబంధించి తప్పుడు సమాచారం కూడా పెరుగుతాయి, ఇది ప్రజా శాంతి మరియు పౌరుల ఆరోగ్యంపై తీవ్రమైన హానికరమైన ప్రభావాలను కలిగిస్తుంది. బోలె బాబా సత్సంగ్ కార్యక్రమంలో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలంగాణ విద్యావంతుల వేదిక తెలియచేస్తుంది.
-బెజ్జంకి ప్రభాకరాచారి
రాష్ట్ర కమిటి సభ్యుడు
తెలంగాణ విద్యావంతుల వేదిక
తెలంగాణ రాష్ట్రం.