˜సీఎం పర్యటన షెడ్యూల్ ఖరారు
భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్ 5 : ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదివారం భద్రాచలం రానున్నారు. సీతారాముల కల్యాణ మహో త్సవానికి హాజరుకానున్నారు. స్వామివారికి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చే ఆనావాయితీ ఉన్నందున రేవంత్ రెడ్డి దంపతులు సంప్రదాయం పాటించనున్నారు. ఆదివారం బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి 8.30 గంటలకు బయలుదేరి 10 గంటలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చేరుకుంటారు. నేరుగా సారపాక ఐటిసి గెస్ట్‌హౌస్‌లో సేద తీరుతారు. అనంతరం 10.30 గంటలకు ఐటిసి గెస్ట్‌హౌస్ నుండి సీతారామ చంద్రస్వామి ఆలయం వద్దకు చేరుకుంటారు.
10.40 నుంచి 11 గంటల వరకు సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 11 గంటలకు మిథిలా స్టేడియానికి చేరుకుంటారు. 11.10 నుంచి 12.30 వరకు సీతారామ చంద్ర స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని వీక్షిస్తారు. 12.30కు మిథిలా స్టేడియం నుంచి సారపాక చేరుకుంటారు. 12.35 నుండి 1.10 వరకు సారపాకలో ఉంటారు. బూరం శ్రీనివాస్ ఇంట్లో సన్నబియ్యంతో వండిన భోజనం చేస్తారు. అనంతరం 2 గంటలకు ఐటిసి గెస్ట్ హౌస్ నుంచి భద్రాచలం హెలిప్యాడ్‌కు చేరుకుని హైదరాబాద్ బయలుదేరుతారు.