హైడ్రా మరో భారీ అపరేషన్‌

-‌ పుప్పాలగూడ పరిధిలో ముష్కిన్‌ ‌చెరువుకు విముక్తి

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మే30:హైడ్రా మరో భారీ అపరేషన్‌ ‌చేపట్టింది. కబ్జాకు గురైన చెరువును పరిరక్షించింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పుప్పాలగూడ-నార్సింగి గ్రామాల పరిధిలో హైడ్రా భారీ ఆపరేషన్‌ ‌చేపట్టింది. ముష్కిన్‌ ‌చెరువు అభివృద్ధి పేరుతో చేస్తున్న కబ్జాలకు చెక్‌ ‌పెట్టింది. చెరువులో.. రూ.5,500 కోట్ల విలువైన కబ్జాలను తొలగించి భూమి చుట్టూ ఫెన్సింగ్‌ ‌వేస్తోంది. హెచ్‌ఎం‌డీఏ లెక్కల ప్రకారం చెరువు 52.20 ఎకరాల పరిధిలో ఉండగా.. చెరువు మధ్యలోంచి కట్ట నిర్మించి 34.21 ఎకరాలు కబ్జా చేసే ప్రయత్నం జరిగిందని హైడ్రా పేర్కొంది. సీఎస్‌ఆర్‌ ‌నిధులతో చెరువు అభివృద్ధి పనులు చేపట్టిన నిర్మాణ సంస్థ.. అభివృద్ధి మాటున కబ్జాకు ప్రయత్నించింది. గ్రామ రికార్డుల ప్రకారం చెరువు పరిధి 59.11 ఎకరాలు కాగా.. ఇందులో ప్రభుత్వ శిఖం 20.23 ఎకరాలు, మిగతా అంతా పట్టాభూమి. అక్కడ  ఎలాంటి నిర్మాణపనులు చేపట్టరాదనే నిబంధల్ని ఉల్లంఘించిన రియల్టర్లు.. పేదల పేరుతో గుడిసెలు వేసి కొట్టేయాలని ప్రయత్నించారు. ఖాలీ చేయాలని రెండు నెలల సమయం ఇచ్చిన హైడ్రా .. హద్దులు నిర్దారించి ఫెన్సింగ్‌ ‌వేస్తోంది. చెరువు మధ్యలో వేసిన కట్టను తొలగించింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *