రాక్స్ ఐటీ పార్కు ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు
హనుమకొండ,ప్రజాతంత్ర,జూలై4: రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ విస్తరించాలన్నదే తమ సంకల్పమని తెలంగాణ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. హనుమకొండలో రాక్స్ ఐటీ పార్కును ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఐటీ పరిశ్రమకు పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. విదేశాల్లోని తెలంగాణ వాసులు రాష్ట్రానికి వచ్చి ఐటీ కార్యాలయాలు స్థాపించాలని కోరారు.
‘ఎన్నారైలకు ఇక్కడ అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తాం. మామునూరు విమానాశ్రయ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటాం. పారిశ్రామికంగా హనుమకొండ, వరంగల్ అభివృద్ధి చెందుతాయి. చిన్న, మధ్యతరహా పరిశ్రమలు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తాం. ప్రైవేటు పరిశ్రమలతో యువతకు ఉపాధి కల్పిస్తాం‘ అని శ్రీధర్‌బాబు తెలిపారు.