వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలను అభివృద్ది చేయలేనంత కాలం దేశం ఆర్థికంగా పురోగమించదని నిపుణులు పదేపదే సూచి స్తున్నా..అందుకు అనుగుణంగా అడుగులు వేయడం లేదు. దేశంలో సహజ వనరులు ఉన్నా, ఇంకా దిగుబడులపై ఆధార• •డుతున్నాం. వంటనూనెలు, పప్పుల దిగుమతులపై పునరా లోచన చేయాలి. సొంతంగా ఆహారధాన్యాలు ఉత్పత్తి చేసు కునేలా రైతులను ప్రోత్సహించాలి. కార్పోరేట్లకు ఇస్తున్న రాయితీలను రైతులకు కూడా వర్తింపచేసి పంటలను పండించుకునే దిశగా అడుగులు వేయాలి. దేశ జనాభాకు అనుగుణంగా అవసరమైన పంటలను ప్రోత్సహించాలి. వ్యవసాయ దిగుబడులను తగ్గించి, ఎగుమతులను పెంచు కోవాలి. వ్యవసాయాధారిత పరిశ్రమలను ప్రోత్సహించాలన్న సూచనలు పెడచెవిన పెడుతున్నారు.
నదుల అనుసంధానం జరగడం లేదు. అధికారంలోకి వొచ్చిన కొత్తలో వ్యవసాయాన్ని అభివృద్ది చేసి, రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తానన్న మోదీ హావిరీ పదేళ్లయినా అమలు కావడం లేదు. దేశ జనాభాలో 60 శాతం మందికి పైగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. అయినా ఈ రంగాన్ని పైకి తీసుకుని రావడం, వ్యవసాయాధారిత పరిశ్రమలను ప్రోత్సహించడం జరగడం లేదు. పప్పుల ధరలు పెరుగుతున్నా, మనదేశంలో పప్పు పంట లను ప్రోత్సహించడం లేదు. నూనె ధరలు పెరుగుతున్నా, నూనెగింజల పంటలకు ప్రోత్సాహం దక్కడం లేదు. 2018-19 నాడు 7.8 శాతం అభివృద్ధితో వున్న వ్యవసాయరంగం 2024 మార్చి నాటికి 0.6 శాతానికి పడిపోయింది. వేగంగా దిగజారిపోతున్న వ్యవసాయ రంగాన్ని ఆదుకోవలసి వుంది. కానీ అలాంటి ప్రయత్నాలు జరగడం లేదు. రానున్న రోజుల్లో ఎరువులు, పురుగు మందుల ధరలు మరింతగా పెరుగుతాయి. పంటల పెట్టుబడి సహాయం పెంచకుండా, కనీస మద్దతు ధర, ఉచిత బీమా అమలు చేయకుండా వ్యవసాయ సంక్షోభాన్ని బిజెపి ప్రభుత్వం మరింత తీవ్రం చేస్తున్నది. ఆహార సబ్సిడీ తగ్గించడంతో పేదలకు అందుతున్న రేషన్ సరుకుల కోటా తగ్గిపోతుంది.
ఆకలి కేకలు పెరుగుతాయి. అన్నింటికి మించి ఉపాధి పనులను వ్యవసాయానికి అనుబంధించాలన్న డిమాండ్ పట్టించుకోవడం లేదు. దేశంలో వ్యవసాయ కూలీలు దొరకడం లేదు. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు దక్కడం లేదు. అలాగే సామాన్యులకు తిండిగింజలు దొరకడం లేదు. అధిక ధరలతో సామాన్యులు ఉప్పులు, పప్పులు కొనుక్కోలేక పోతు న్నారు. ఈ సమస్యలను పార్లమెంటు చర్చించదు. బయటా చర్చించడం లేదు. దేశంలో నిరుద్యోగ తీవ్రత చాలా ఎక్కువగా వుంది. దేశంలో పని చేయగలిగిన శ్రామికుల సంఖ్య 64 శాతానికి పెరిగిందని, కేవలం 37 శాతం మందికి మాత్రమే పనులు దొరికాయని ఓ నివేదిక తెలిపింది. యువతకు ఉపాధి కల్పించడం దేశం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాల్‌గా మారింది. సాంకేతిక పరిజ్ఞానం, కృత్రిమ మేధ ప్రభావంతో నిరుద్యోగం మరింత తీవ్రం కానుంది.
ఐటి సేవల రంగాలలో తక్కువ న్కెపుణ్యం ఉంటే చాలన్న రీతిలో సాగుతోంది. ఐటి కంపెనీలు కూడా ఉద్యోగులను ఉన్న పళంగా తీసేస్తున్నాయి. ఈ క్రమంలో వ్యవసాయానుబంధ రంగాలను బలోపేతం చేయడం మినహా మరో గత్యంతరం లేదు. ఆరోగ్యం, సాంఘిక సంక్షేమం, గ్రామీ ణాభివృద్ధి రంగాలన్నింటికి నిధుల కేటాయింపులు తగ్గిపో తున్నాయి. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా నినాదా లను రాజకీయ ప్రచారం కోసం వాడుకుంటున్నారు. ప్రపం చీకరణ ఆర్థిక విధానాల వల్ల ప్రభుత్వ సేవలు కుదిం చుకుపోయాయి. పేద, మధ్య తరగతి వారికి వచ్చే అరకొర ఆదా యం నుండి విద్య, వైద్యానికి చేసే ఖర్చులు పెరిగి పోయా యి. ఉపాధి అవకాశాలు తగ్గిపోవడంతో పాటు పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలు ప్రజల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఆర్థిక అంతరాలను తగ్గించడానికి సంపన్నుల విరీద పన్నులు వేయడానికి మోదీ ప్రభుత్వం సిద్ధంగా లేదు.
-సమీర్