పక్షుల వలె రెక్కలోచ్చి ఎగిరి పోతున్నననే భావనలో..
నింగికి ఎగిసిన జండాను చూసి
ముచ్చట పడుతున్నమన్న సంబరం లో..
గూగుల్ తో విశ్వమంతా చుట్టొస్తున్నమన్న ఆనందం లో..
ఆధునిక పోకడలతో
కురుగ్రామమైన ఈ ప్రపంచాన్ని
మితిమిరిన అహంకారం తో
మాయ దర్పణం లో మనిషి తనను తాను చూసుకొంటూ మాయల పకీరుల రూపంతరం చెందుతూ..
ఈ భూమిని బొంగరం ల ఆడిస్తున్న..
మనిషి గా మాత్రం’’ స్వేచ్ఛ ‘‘.. గా
జీవించడం మరిచిపోయిండు..
అందాల అనుబంధాల బతుకుల్ని
అగ్గి బుగ్గి చేసుకుంటూ..
కాలం నేర్పిన కరోనా లాంటి గుణపాఠాలను చులకన చేస్తూ..
స్వార్థం తో ధన, అధికారం,వ్యామోహం లో పడి
స్నేహ అనురాగాలను కొలబద్ద తో
కొలుస్తూ విర్ర వీగుతుండు
నిజం.. చెప్పాలంటే భయం..
నిజాయితీ గా ప్రవర్తించాలంటే లోపల వణుకు..
ప్రేమను పంచాలంటే కోతి చేష్టలు..
కాని,చావునే లెక్కించే రోజు వచ్చినప్పుడు మాత్రం..
వాస్తవికతను గ్రహించి లో లోపల
చేసిన తప్పులకు కన్నీరు మున్నిరయి
ఒంటరి పక్షిలా విల విల లాడుతాడు.!
ఆత్మీయత కు నోచుకొలేక..ఎడారిలో
బాటసారిలా మిగిలిపోతాడు.!!
– కొండా రవీందర్, 9059237771