పాకులాట రాజకీయం

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు
అధికారం కోసం పోరాటాలు
అధికారంలోకి రాగానే
పదవుల కోసం ఆరాటాలు
పదవులు రాగానే
ఉన్నత పదవుల కోసం పాకులాటలు
ఆ పదవులు రాగానే
వాటిని కాపాడుకోవడానికి
కుట్రలు ఎన్ని పన్నాలో
కుయుక్తులు ఎన్ని వేయాలో
ఎత్తుకు పైఎత్తులు వేసే
జిత్తులమారి నక్క ఆలోచనలు
ఎన్ని చేయాలో
క్షణానికొక రంగులు మార్చే ఊసరవెల్లిలా
పదవుల కోసం పార్టీలెన్ని మారాలో
కేవలం అలంకార ప్రదమైన
ఆ పదవులని చూసి
మురిసిపోతున్న నాయకులారా
సామాన్యుడి ఘోష వినపడుతోందా?
కర్షకుల కన్నీరు కనపడుతోందా?
మీరు చేసే ఈ కంపు రాజకీయం కన్నా
మురికి కాల్వ పక్కన కంపులో
బ్రతుకుతున్న వారే నయం
మనుషులు మురికిగా ఉన్నా
వాళ్ళ మనసులు స్వచ్ఛం
తుమ్మితే ఊడిపోయే పదవులపై
మీకు ఎందుకంత వ్యామోహం?

– కోనేటి నరేష్‌, ‌శ్రీ సత్యసాయి జిల్లా, 8499847863

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page