విజయవాడకు మంత్రి ఉత్తమ్‌ ‌దంపతులు

సిఎం చంద్రబాబుతో మర్యాదపూర్వక భేటీ

అమరావతి, సెప్టెంబర్‌ 12 : ‌రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి, ఆయన సతీమణి, ఎమ్మెల్యే పద్మావతి గురువారం అమరావతిలో ఏపీ ముఖ్యమంత్రి  చంద్రబాబునాయుడును మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వినాయకుడి విగ్రహాన్ని బహుకరించారు. గురువారం  విజయవాడకు మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి వెళ్లిన సందర్భంగా  ఏపీ సిఎం చంద్రబాబు తో భేటీ అయ్యారు.

తన చిన్న నాటి మిత్రుడిని పరామర్శించేందుకు విజయవాడకు వెళ్లిన  ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి దంపతులు నా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి పలు అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. ఇరు రాష్ట్రాల్లో వరద ప్రభావంపై, నీటిపారుదల అంశాలు, ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాల గురించి చర్చించినట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *