హైదరాబాద్‌ ‌సీపీ ఆఫీస్‌ ‌వద్ద ఉద్రిక్తత

  • పోలీసులతో బిఆర్‌ఎస్‌ ‌నేతల వాగ్వాదం
  • సిపికి ఫిర్యాదు చేసేందుకు వచ్చామన్న హరీష్‌ ‌రావు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 12 : ‌హైదరాబాద్‌ ‌సీపీ ఆఫీస్‌ ‌వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.సీపీ ఆఫీస్‌కు వెళ్లిన ఎమ్మెల్యే కౌశిక్‌ ‌రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తన ఇంటిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూసైబరాబాద్‌ ‌సీపీ ఆఫీస్‌ ‌లో పాడి కౌశిక్‌ ‌రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన అక్కడ ఉన్న పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. వారిని నిలదీసేలా మాట్లాడారు. కౌశిక్‌ ‌రెడ్డితోపాటు హరీశ్‌ ‌రావు, భారీగా బిఆర్‌ఎస్‌ ‌నాయకులు సీపీ ఆఫీస్‌కు వెళ్లారు. దీంతో హరీష్‌ ‌రావుతో పాటు బీఆర్‌ఎస్‌ ‌నాయకులను సైబరాబాద్‌ ‌పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గులాబీ నేతలకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కౌశిక్‌ ‌రెడ్డి ఇంటిపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని.. ఏసీపీ,సీఐను సస్పెండ్‌ ‌చేయాలని బిఆర్‌ఎస్‌ ‌నాయకులు డిమాండ్‌ ‌చేశారు.

 

హైదరాబాద్‌ ‌నగరంలో పట్టపగలు ఎమ్మెల్యే ఇంటిపై దాడి జరిగిందని.. బీఆర్‌ఎస్‌ ‌కార్యకర్తలను గృహ నిర్భందం, అరెస్టులు చేశారని మాజీ మంత్రి హరీష్‌ ‌రావు అసహనం వ్యక్తం చేశారు. పైలెట్‌, ఎస్కార్ట్ ఇచ్చి తమ ఎమ్మెల్యే ఇంటిపై కాంగ్రెస్‌ ‌వాళ్ళను దాడికి పంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేటలో తన క్యాంపు కార్యాలయంపైన కూడా దాడి జరిగిందని చెప్పారు. ఇటీవల ఖమ్మంలో వరద బాధితుల పరామర్శకు వెళ్తే కూడా తమపై దాడి చేశారని హరీశ్‌ ‌రావు గుర్తు చేశారు.

 

ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అనుచరులు కొండాపూర్‌లోని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ ‌రెడ్డి ఇంటిపై దాడి చేసిన విషయం తెలుసుకున్న హరీశ్‌ ‌రావు.. సిద్దిపేట నుంచి కౌశిక్‌ ‌రెడ్డి నివాసానికి బయలుదేరి వచ్చారు. కౌశిక్‌ ‌రెడ్డితో కలిసి వి•డియాతో మాట్లాడారు. సైబరాబాద్‌ ‌సీపీకి ఫిర్యాదు చేసేందుకు ఎమ్మెల్యే కౌశిక్‌ ‌రెడ్డిని వెంటబెట్టుకొని కొండాపూర్‌ ‌నుంచి మాజీ మంత్రులు హరీష్‌ ‌రావు, వేముల ప్రశాంత్‌ ‌రెడ్డి, సబితా ఇంద్రా రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్‌ ‌మాజీ చైర్మన్లు, బీఆర్‌ఎస్‌ ‌పార్టీ నాయకులు బయలుదేరి వెళ్లారు. తర్వాత సీపీ కార్యాలయం వద్ద కూడా ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page