తప్పుల తడకగా తెలంగాణ కులగణన

  • ఓబీసీల పట్ల కాంగ్రెస్ కపటప్రేమ
  • బీసీలను రాజకీయంగా అణచివేసేందుకు కుట్ర
  • బీజేపీ ఎంపీఓబీసీ జాతీయాధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన మీద ప్రవేశపెట్టిన నివేదిక పూర్తిగా తప్పుల తడకగా ఉందని బీజేపీ ఎంపీఓబీసీ జాతీయాధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. దిల్లీలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కులగణన అసమగ్రంగాఅశాస్త్రీయంగా.. వాస్తవ దూరంగా ఉందనినిజంగా కాంగ్రెస్ పార్టీకిరేవంత్ రెడ్డికి సామాజిక న్యాయం పట్ల చిత్తశుద్ధి ఉంటే చట్టరూపంలో తీసుకొచ్చి అమలు చేసేందుకుఅందులో ఉన్న లోటుపాట్లను సరిదిద్ది బిల్లు రూపంలో తీసుకురావాలని  కానీ అందకు బదులు.. మొక్కుబడిగాతూతూమంత్రంగా చేశారని విమర్శించారు. ఓబీసీల పట్ల కపటప్రేమ ఒలకబోస్తున్నారు. సర్వేలో బీసీల శాతాన్ని తగ్గించి చూపించారు. బీసీలను రాజకీయంగా అణచివేసేందుకు వేసిన చర్యగానే దీన్ని భావించాలి. ఇది కాంగ్రెస్ మానసిక ఆలోచనకు అద్దం పడుతోంది. రాజ్యాంగ విరుద్ధమైన పదాలు వాడారు. హిందూ బీసీలుముస్లిం బీసీలు అని పేర్కొన్నారు. మండల్ కమిషన్ లోనూ 51%, బీఆర్ఎస్ సమగ్రకుటుంబ సర్వేలోనూ.. 52% బీసీలున్నారని వెల్లడైంది. మరి ఈ సంఖ్య ఎలా 46%కి వొచ్చింది. 4 కోట్ల జనాభాలో దాదాపు 6% తగ్గుదల బీసీలకు చేస్తున్న ద్రోహానికి అద్దం పడుతోంది. 12% ముస్లింల జనాభాను చూపిస్తూ.. 2% ముస్లిం బీసీలుముస్లిం ఓసీలు అని చూపించడం దేనికి నిదర్శనం. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్.. మతపరమైన రిజర్వేషన్లు ఉండవనిచెప్పినా.. వీళ్లు మాత్రం దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. రాహుల్ గాంధీ రాజ్యాంగం చేతిలో పట్టుకుని తిరుగుతున్నారు.

కానీ దాన్ని ఏనాడూ తెరిచి చూడలేదని అర్థమవుతోంది. ముస్లింలను సంతుష్టి పరిచేందుకు.. బీసీల హక్కులను కాలరాసే ప్రయత్నం. బీసీల హక్కును ముస్లింలకు కట్టబెట్టే ప్రయత్నం. రాహుల్ గాంధీ సమక్షంలో గతేడాది నవంబర్ 6న ఈ సర్వేను ప్రారంభించారు. ఈ సర్వే దేశానికి ఓ రోల్ మాడల్ అని చెప్పారు. బీసీల ఓట్లను తగ్గించి ముస్లింలకు కట్టబెట్టడమే రోల్ మాడలాగ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో 150 సీట్లలో 50 సీట్లు బీసీలకు రిజర్వ్ చేస్తే.. ఇందులో 18 మాత్రమే బీసీలకు ఇచ్చి మిగిలినవి ముస్లింలకు కట్టబెట్టడం అత్యంత దారుణం. 32 బీసీ సీట్లలో ముస్లింలుగా గెలిచారు. సుప్రీంకోర్టు నిర్ణయానికి అనుగుణంగా 50%లోపే రిజర్వేషన్లు ఉండాలి. కానీ సీఎంగా రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు.. ముస్లింలకు సంబంధించిన 14 కులాలను బీసీలుగా పరిగణిస్తూ.. బీసీలకు దక్కాల్సిన వాటాను ముస్లింలకు కట్టబెట్టారు. ఇదేం కొత్తకాదు. సోనియా గాంధీ గారు నిర్ణయం తీసుకుని దేశవ్యాప్తంగా 27% బీసీ రిజర్వేషన్లలో 4% తొలగించి ముస్లింలకు ఇస్తే.. కోర్టు కొట్టేసింది. మండల్ కమిషన్ స్పష్టంగా.. 1990లో ముస్లింలలోని రెండు తెగలు (దూదేకులమెహతర్)ను బీసీల్లో రిజర్వేషన్లు పొందుతున్నారు. దీన్ని రాజశేఖర్ రెడ్డి 4%కోసం ప్రయత్నిస్తే.. కేసీఆర్ ఏకంగా 12% రిజర్వేషన్లు ముస్లింలకు ఇస్తామని చెప్పారు.

ఇదంతా బీసీల ఓట్లనుబీసీల రిజర్వేషన్లను తగ్గించేందుకు జరిగిన కుట్ర. రేవంత్ రెడ్డి ఏకంగా.. ఎన్నికల ముందు.. రిజర్వేషన్లలో బీసీలకు న్యాయం చేస్తానని చెప్పి ఇవాళ తూతూమంత్రంగా నివేదికను సమర్పించి చేతులు దులుపుకునే ప్రయత్నం ఇది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా బీసీల జనాభా పెరగాలని కానీ.. ఇవాళ కోటి 60 లక్షలమందే ఉన్నారని చెప్పడం నమ్మశక్యం కాని విషయం. 342‑ఏ చట్టం ప్రకారం .. రాష్ట్రాలకు పూర్తి స్వేచ్ఛ ఉంది. ఆ రాష్ట్రాలు బీసీల స్థితిగతులను పరిగణనలోకి తీసుకుని బీసీల రిజర్వేషన్లు అమలు చేయాల్సి ఉంది. కానీ అలా చేయడం లేదు  అని డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. దాదాపు 90% ముస్లింలు బీసీలు అని చెప్పడం సిగ్గుచేటు. మండల్ కమిషన్ రెండు తెగలను మాత్రమే బీసీలను అని చెబితే.. మీరు దీన్ని 90%కు పెంచడం దుర్మార్గమని అన్నారు. . నెహ్రూ కుటుంబ ఎజెండాలో రేవంత్ రెడ్డి భాగమయ్యారు. నిజంగా రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి ఉంటే.. మీ ప్రసంగంలో చెప్పినట్లుగా.. తెలంగాణలో 90% మంది బీసీఎస్సీఎస్టీలు గా ఉన్నప్పుడు.. ఆయా వర్గాలకు మీరు ఎన్ని పదవులు ఇస్తున్నారు.

రేవంత్ కేబినెట్ లో మంత్రులు.. నోరు విప్పాలి. బయటకు రావాలి. కేసీఆర్ ఒక్కరోజుల్లో తడి గుడ్డతో గొంతు కోస్తే.. రేవంత్ 50 రోజుల పాటూ రోజూ పొడిచి పొడిచి చంపారని మండిపడ్డారు. బీసీ గణన విషయంలో కేంద్రం అన్ని రాష్ట్రాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాము. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో కులం బీసీల్లో ఉంటుంది. అందుకే రాష్ట్రాలు సర్వే చేసి కరెక్ట్ వివరాలు సమర్పిస్తే మేం స్వాగతిస్తాం. బిహార్ లో మేం నిష్పక్షపాతంగా చేశాం. కానీ సిద్దరామయ్య సర్వే చేసి.. ఎందుకు పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు. బీఆర్ఎస్ పార్టీకి.. బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు.

ముస్లింల రిజర్వేషన్లను 12% పెంచుతామని చెప్పి.. బీసీల గొంతు కోసిన మాట నిజం కాదామధ్యప్రదేశ్ లో శివరాజ్ చౌహాన్ గారు.. సర్వే చేసి బీసీలకు న్యాయబద్ధంగా సీట్లు ఇచ్చారు. మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవిస్ గారు.. బీసీలకు తగ్గించిన సీట్లపై పోరాడి.. కోర్టులో పోరాడి దాని ఆధారంగా బీసీలకు సీట్లు ఇచ్చారు. బీసీ పాలసీ విషయంలో బీజేపీ సామాజిక చిత్తశుద్ధితో పని చేశాం. ఇకపైనా ఇదే విధానంలో ముందుకెళ్తాం. బీసీల అవకాశాలను దెబ్బతీస్తున్న కాంగ్రెస్ తీరుపై దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. జమ్మూకశ్మీర్లో 75 ఏళ్లపాటు రిజర్వేషన్లు లేవు. మోదీ  370 తొలగించిన తర్వాతే వారందరికీ రిజర్వేషన్లు అందాయి. ఎస్సీఎస్టీబీసీలతోపాటు.. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చిందే మోదీ అని  రిజర్వేషన్లు పెంచిందే బీజేపీ అని లక్షణ్ పేర్కొన్నరాు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page