డిజిటల్‌ ‌హెల్త్ ‌కార్డు రూప‌క‌ల్ప‌న‌కు అడుగులు

238 ప్రాంతాల్లో నేటి నుంచి పైలట్‌ ‌సర్వే
నేడు ప్రారంభించనున్న సిఎం రేవంత్‌ ‌రెడ్డి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌2: ‌కుటుంబ డిజిటల్‌ ‌హెల్త్ ‌కార్డు ప్రొఫైల్‌ ‌రూపకల్పన ప్ర‌క్రియను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ మేరకు డిజిటల్‌ ‌హెల్త్ ‌కార్డును అమ‌లులోకి తీసుకునిరాబోంది. ఎలాంటి భేదాలు లేకుండా ప్రజలందరికీ హెల్త్‌  కార్డుల వివరాలను పొందుపర్చనుంది. ఈ మేరకు గురువారం పైలెట్‌ ‌ప్రాజెక్ట్‌ను సిఎం రేవంత్‌ ‌ప్రారంభించ‌నున్నారు. మరోవైపు ఈ అంశంపై చర్చించిన రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రతీ కుటుంబానికి హెల్త్ ‌ప్రొఫైల్‌ ‌రూపొందించి, ప్రత్యేక నంబరుతో స్మార్ట్ ‌కార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు.

ఇందుకోసం ఈ నెల 3 నుంచి 7వ తేదీ వరకు 119 నియోజకవర్గాల్లోని 238 ప్రాంతాల్లో పైలట్‌ ‌సర్వే నిర్వహిస్తున్నారు. పైలట్‌ ‌ప్రాజెక్టును సీఎం రేవంత్‌ ‌రెడ్డి గురువారం ప్రారంభిస్తారు. అత్యంత ప్రాధాన్యం కలిగిన ఈ కార్డుల రూప‌క‌ల్ప‌న‌లో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా వివరాలు నమోదు చేయించాలని కలెక్టర్లను ఇప్పటికే ఆదేశించారు. నియోజకవర్గంలో ఒక పట్టణ, ఒక గ్రామీణ ప్రాంతాన్ని ఎంచుకుని ఎన్యుమరేషన్‌ ‌చేపడతారు.

ఒకవేళ పూర్తిగా అర్బన్‌ ‌ప్రాంతమైతే రెండు వార్డులు/డివిజన్లు ఎంచుకుంటారు. ప్రతి నియోజకవర్గానికి ఆర్డీవో స్థాయి, జోనల్‌ ‌కమిషనర్‌ ‌స్థాయి అధికారులను, మండలానికైతే ఒక తహసీల్దారును ప్రత్యేకాధికారులుగా నియమించారు. కుటుంబసభ్యుల వివరాల నమోదు, మార్పుచేర్పుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా డిజిటల్‌ ‌సర్వేకు అధికారులు రంగం సిద్దం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *