నదిలా ఆమె నడుస్తూనే ఉంటుంది

‘మై జాన్తీ హు’ నేను స్వాప్నికురాలిని అంటుంది రెహానా. జీవిత అనుభవ సారాన్ని కవిత్వానికి అన్వయం చేసుకోవడం ఎప్పటి నుంచో పరంపరే అయినా ప్రతీ కవి అను భవం వేర్వేరుగా ఉంటాయి. సీనియర్‌ ‌జర్న లిస్ట్ ‌గా ఎన్నో సాహసోపేతమైన ప్రయాణాలు చేసి సంక్షుభిత ప్రాంతాల నుంచి లైవ్‌ ‌కవరేజ్‌ ‌లు, ప్రత్యేక కథనాలు అందించిన రెహానా ఈ నేపధ్యంలో నుంచి తన తొలి కవితా సంపుటిని ‘నదీవాక్యం’ పేరుతో వెలువరించారు. ఈ కవితా సంపుటి అంతా కాలప్రవాహంలా నడు స్తూనే ఉంటుంది. ఇందులో రెహాన వృత్తిరీత్యా జర్నలిస్ట్ ‌గా తాను ఎదుర్కొన్న అనుభవాలు, కరోనా కష్టకాలంలో మానవాళికి ఎదురైన అనుభవాల దృశ్యాలు, వయక్తిక జీవిత సత్యా లుగా మన ముందుకు తెచ్చారు. జీవితాన్ని మించిన పాఠం ఏముంటుంది నేర్చు కోవ డానికి. అందుకే రెహానా జీవితపు లోతుల్లో నుంచే ప్రతీది గమనించి దాన్ని కవితగా మలిచారు. అందుకేనేమో బహుశా తొలి కవితే ‘‘యుద్ధ కాలంలో స్వప్నాలు’’ అనే కవి తతో మొదలు పెట్టారు. ప్రపంచానికి రెండు దేశాలు ఎందుకు యుద్ధం చేస్తున్నాయన్నది కేవలం ఊహాగానాల ద్వారా మాత్రమే తెలు స్తుంది. ఆ యుద్దానికి కారణాలు లోలోపల అనేకం ఉండొచ్చు కవయిత్రికి అవేం అవ• •రంలేదు. ఆమెకు యుద్ధ కాలంలో కలలు ఎలా ఉంటాయో తెలుసుకోవడానికి ఏ మహ నీయుణ్ణి అడగమని అనడం లేదు. పోరా టానికి మారు పేరైన ‘గుగి వా థియాంగో’ ను అడగమని అంటోంది. అంతేనా ఉక్రెయిన్‌ ‌యుద్ధ కాలంలో బంకర్‌ ‌లో కళ్ళు తెరిచి తొలిసారిగా సంఘర్షణని కళ్లారా చూసిన పసిగుడ్డుని అడగమని అంటోంది.

‘మీ టోకెన్‌ ‌నెంబర్‌ ఎం‌త..?’ కొరోనా కష్ట కాలంలో ఎంత మంది బంధుగణం ఉన్నా కనీసం అంతిమ సంస్కారాలకి నోచుకోని వేదనని ‘వెయిటింగ్‌ ‌లిస్ట్’ అనే కవితలో ఉదహరిస్తారు. కరోనా కాలంలో హైదరాబాద్‌ ‌పాతబస్తీ ఎలా ఉంటుంది? అక్కడ ఉండే చార్మినార్‌ ‌సంగతి ఏంటి..? మినార్‌ ‌పక్కన నెలవంకని, బాలా పూర్‌ ‌శోభాయాత్ర సాగుతున్న వైభవాన్ని, లాడ్‌ ‌బజార్‌ ‌గాజుల శబ్దాన్ని విన్న కవయత్రి విషాద మౌన సందర్భ కాలంలో ఎన్నో అంశాలకు సాక్షీభూతంలా ఉన్న ఆ చారి త్రాత్మక కట్టడా న్నిఒంటరి యోధురాలీలాగా వర్ణింస్తుందీమే. చార్మినార్‌ ‌ది తనువంత మనిషి వాసన అన డంలో ఆమెకున్న మతసామరస్యపు ఆలోచన తెలుస్తుంది. పుస్తకం చదవడంలో ఉండే విజ్ఞానపు, చారిత్రక అంశాల మేళవింపుని చెబుతూ రాసిన ‘‘ధ్యానంగా…’’ అనే కవితలో మనం చూడొచ్చు. లోలోపల సుడి తిరు గుతున్న జ్ఞాపకాల జడి నుంచి తప్పుకోవడం సాధ్యంకాదు. లోకం చూడడం మొదలైన తర్వాత ఎన్నో విషయాలు ఎన్నో పాఠాలు నేర్పిస్తాయి. కొన్ని సంతోషాన్ని, మరికొన్ని ఆవేదనని ఇస్తాయి. అందుకే ఈమె ‘అడుగులు స్థిరపడిన తర్వాత పరుగెత్తడమే మంచిది’ అని సూత్రీకరణ చేస్తుంది. ఈ ఒక్క మాట జీవి తంలో ఎంత ఉపకరిస్తుందో, రెప్పల మాటు రక్షణ కంటే గాయాలు నేర్పే పాఠాలే ఎక్కువ అవసరం అనే దాన్లో మనం నేర్చుకోగలిగే అనుభవ సారం ఉంది. ‘ఎవ్వరిని ఆపొద్దు వెళ్ళనివ్వండి..దిక్కులులేని ప్రపంచంలోకి రెక్కలు విప్పి ఎగరనివ్వండి’ అనే మాటల వెనుక ఉండే స్వేచ్ఛాకాంక్షని, ప్రపంచాన్ని కేవలం కళ్ళతోనే కాక అనుభవాలతో చూసి నేర్చుకోమనే పాఠం చెవుతుంది.

ఈమె ఎక్కడా సుదీర్ఘ ఉపన్యాసం ఇవ్వదు. పేరాలకి పేరాలు రాయదు. కేవలం అతి తక్కువ పదాల్లో కవితలు అల్లడం ఈమె ప్రత్యేకత. ‘పురిటి గీతం’ అనే కవితలో డాక్టర్‌ ‌ల గురించి రాస్తూ ‘‘గర్భస్థ దశకు, చైతన్య ప్రవాహానికి ఆమె వారధై నిలబడుతుంది’’ అని రాశారు. ఎంచుకున్న వస్తువును యథాతథంగా కాక ఎక్కడో ఒకచోట ఆ వస్తువును ఎలివేట్‌ ‌చేసే విధంగా చెప్పడం వల్ల అది నేరుగా గుండెలోకి ఇంకిపోతుంది. ‘సంఘర్షణ లేకుండా నువ్వూ లేవు, నేనూ లేను’ అనే మాట చెప్పడంలోని వాస్తవికతలో ఈమె వాక్యం నేల విడిచి సాము చేయడం లేదని చెప్పకనే చెబుతుంది. ‘దృశ్యం’ లాంటి కవితల్లో ఉన్న భావుకత, సముద్రం ఒడ్డున జరిగే సంభాషణ లను పోగేసి చెప్పిన తీరు, ప్రయాణంలో ఎదురుగా నిలబడ్డ దృశ్యాలని దండ కట్టినతీరు, ఇద్దరి మధ్యలో ఉండే ప్రేమని చర్చకి తీసుకొచ్చినా ఎక్కడా నిరుత్సాహం పరిచే మాటలు దరిచేరని వ్వలేదు. ‘ప్రతీ కవిత వెనుక ఒక కథ ఉం టుంది ప్రతీ అక్షరం ఆవేదనకో, ఆనందానికో ప్రతినిథి అయి నిలబడుతుంది’ అని కవితకు వెనకాల ఉండే మూలసూత్ర రహస్యాన్ని గుట్టు విప్పుతుంది.

పాత కాగితం ముక్క దొరికినా, అందులో ఏమున్నా అదో అనాది నెచ్చెలి అని మురిసిపోయే కవిత్వం రాసింది రెహానా. మృగ్యమైపోతున్న మానవ సంబంధాల పట్ల కాస్త కినుక వహించి ‘మాట్లాడటానికేం ఉందని, మాట్లాడుతూనే ఉండడానికి, లోపల అంతా హ్యాలో… భావరహిత స్థితి’ అని మను షుల్లో ఉండే భావరాహిత్యాన్ని విప్పి చెబు తుంది. ఆమెది శాంతి కాంక్ష. అందుకే వా క్యం వసంతాన్ని మోసుకు వస్తుంది అం టుంది. పట్నం బతుకుల్లో ఉండే కాలుష్యాన్ని, పంట నష్టపోతున్న తీరును ‘పట్నం రంగు’ అనే కవితలో దునుమాడతారు ఆమె. అక్కడక్కడ కాస్త అస్పష్టత ఉన్నా కవిత ప్రారంభం, ముగింపులో శ్రద్ధ పెట్టడం వల్ల అది ఏమంత పెద్ద లోటుగా అనిచదు. మరీ ఎక్కువ పొ డవైన వాక్యాలు, పేరా గ్రాఫ్‌ ‌లు ఉండకపోవడం ఒక రిలీఫ్‌.

‌కొన్ని సబ్జెక్టస్ ఇం‌కా కాస్త రాయొచ్చు కదా అనిపి ంచేలా ఉన్నా కవి సమ యాలని మనం నిర్ధా రించలేం కదా..! తానే ఒకచోట ‘ఉన్నది ఉన్నట్లు చెప్పడం, ఉన్నది ఉన్నట్లు రాయడం ఇప్పుడు గతం’ అంటుంది. ఏ వస్తువును ఎలా రాయాలో ఆమెకి స్పష్టత ఉంది. అందుకే శివారెడ్డి గారు ముందు మాటలో ‘‘రూపం లేని రూపంతో అలరారే కవిత్వం మన ముందు ఉంది. దానితో సహయాత్ర చేద్దాం’’ అంటారు. శివారెడ్డి గారు రాసిన అనేక ముందు మాటల్లో ఎన్నదగిన వాటిలో ఈ పుస్తకానికి రాసిన ముందుమాట కూడా ఉంటుంది. రెహానా ఆ మాట కోసమే ఈ పుస్తకాన్ని తీసుకురావడం లో కాస్త ఆలశ్యం అయింది. తొలి పుస్తకంలో కవిలో ఉండే నిజాయితీ తెలుస్తుంది. వాళ్ళ ఆశలు, ప్రభావం, భావజాలాలు అనుభవంలో నికి రానితనం, కవితా వాక్యంలో ఉండే తాజాదనం తెలుస్తాయి. అతి తక్కువ సం•  •ర్భాల్లో మాత్రమే కాస్త పరిణితి కూడా కనబ డుతుంది. ఈ ‘నది వాక్యం’లో ఆ పరిణితి ఉంది. రెహానా మరింత కవిత్వం రాయాలని కోరుకుందాం.
– అనిల్‌ ‌డ్యాని,970 333 6688

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page