మహారాష్ట్రలో తెలుగు సాహిత్య అకాడెమీ ఏర్పాటు

దేశ వ్యాప్తంగా ప్రాంతీయ భాషలు రోజు రోజుకు క్షీణించిపోతున్న నేపథ్యంలో, పర భాషా రాష్ట్రమైన మహారాష్ట్ర ప్రభుత్వం తెలుగు భాషా, సాహితీ పరిరక్షణకు, వికాసానికి పూనుకోవడం ఎంత్కెనా అభినందనీయం. తెలుగేతర ఏ రాష్ట్రం కూడా తలపెట్టని విధంగా, మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రాంతీయ భాషల పరిరక్షణలో భాగంగా, రాష్ట్రంలో ముంబ్కె కేంద్రంగా తెలుగు సాహిత్య అకాడెమీని ఏర్పాటు చేసింది. 2023లో అప్పటి మహారాష్ట్ర సాంస్కృతిక శాఖామాత్యులు సుధీర్‌ ‌మునిగంటివార్‌ ‌శాసన సభలో ప్రకటించిన తెలుగు సాహిత్య అకాడెమీ 2025 లో  అమలులోకి వచ్చింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు  భాషాభిమానులందరికీ ఎంతో గర్వకారణంగా చెప్పుకోవచ్చు. సుధీర్‌ ‌మునిగంటివార్‌కు తెలుగు మూలాలు ఉన్నట్టే, మహారాష్ట్రలో తెలుగువారికి దాదాపు మూడు శతాబ్దాలకు మించిన చరిత్ర ఉంది. మహారాష్ట్ర అభివృద్ధిలో తెలుగు వారి క్రియాశీలక పాత్ర విస్మరణీయం. అదే విధంగా తెలుగు, మరాఠీ భాషల మధ్య, సంస్కృతి మధ్య, ఆచార వ్యవహారాల మధ్య కూడా ఎన్నో స్వామ్యాలున్నాయి.

ప్రసిద్ధ మరాఠీ రచయిత డా.బొల్లి లక్ష్మీనారాయణ అన్నట్లుగా మహారాష్ట్రలోని తెలుగువారంతా ‘తెలుగును తల్లిగా, మరాఠీని పిన్నిగా’ (తెలుగు ఆయీ, మరాఠీ మౌసీ) భావిస్తారు. మహారాష్ట్రతో ఉన్న సుదీర్ఘ సరిహద్దు కారణంగా తెలుగు, మరాఠీల మధ్య అవినాభావ సంబంధం ఏర్పడిరది. అది ఆనాటి నుండి నేటి వరకు కొనసాగుతూనే ఉంది. మహారాష్ట్ర ప్రగతిలో తెలుగువారు పాలు పంచుకోవడమే కాకుండా, సంయుక్త మహారాష్ట్ర ఉద్యమంలో పాల్గొని తమ ప్రాణాల్ని కూడా త్యాగం చేశారు. మహారాష్ట్ర తెలుగువారి కర్మభూమిగా, అన్నపూర్ణగా నిలుస్తోంది. సామాజికంగా, రాజకీయంగానే కాకుండా తెలుగువారు పలు రంగాల్లో ముందంజలో ఉన్నారు. వంద సంవత్సరాల క్రితమే మహారాష్ట్రలో తెలుగు పత్రికలు వెలువరించి, తమ మాతృభాషను కాపాడుకునే ప్రయత్నం చేశారు. తెలుగుతో పాటు మరాఠీని కూడా గుండెకు హత్తుకున్నారు. మరాఠీ సంస్కృతితో మమేకమయ్యారు. తెలుగువారిని, తెలుగు భాషను మరాఠీయులు ఎంతో ఆదరించారు. అభిమానించారు కూడా..! 25 సెప్టెంబర్‌, 1928 ‌రోజున కళ్యాణ్‌లో ముంబ్కె ప్రాంతీయ ఆంధ్ర సామాజిక పరిషద్‌ను నిర్వహించారు. ఈ పరిషత్‌కు అధ్యక్షత వహించిన వి.రాందాస్‌ ‌పంతులు తెలుగు భాషా వికాసానికై ప్రభుత్వం చర్యలు చేపట్టాలనీ, ముంబ్కె విశ్వవిద్యాలయంలో తెలుగు విభాగం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ ‌చేశారు. అంతేగాకుండా, ఆ రోజు ఆమోదించిన 14 తీర్మానాల్లో 13వ తీర్మానం భాషా వికాసం.  పరిరక్షణకు సంబంధించిందే కావడం విశేషం.

ఆ తర్వాత కాలంలో, ముంబ్కెలో ఆంధ్ర మహాసభ వారు నిర్వహించిన పలు తెలుగు సభల్లో, శిరిడిలో నిర్వహించిన తెలుగు సదస్సుల్లో, చెన్న్కెలో నిర్వహించిన ప్రపంచ తెలుగు రచయితల సభల్లో, హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల్లో, మహారాష్ట్రలో తెలుగు భాషా వికాసానికి, పరిరక్షణకు తెలుగు ప్రభుత్వాలు మహారాష్ట్ర ప్రభుత్వంతో కలిసి తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్‌ ‌చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా గత దశాబ్దాల్లో రాష్ట్రవ్యాప్తంగా తెలుగు పాఠశాలలు నిర్వహించి తెలుగు భాషను పరిరక్షించడమే కాకుండా తెలుగు విద్యార్థులకు మాతృభాషలో విద్యాబోధనను పొందేఅవకాశం కల్పించారు. కానీ, ముంబ్కె విశ్వవిద్యాలయంలో ఇంత వరకు తెలుగు విభాగం మాత్రం ఏర్పాటు చేయలేదు.కానీ, పలు వినతిపత్రాల ప్రభావమో, పర భాషల పట్ల ప్రభుత్వ విధానమో తెలియదు కానీ, 2023 శాసన సభ సమావేశాల్లో మంత్రి సుధీర్‌ ‌మునిగంటివార్‌ ‌తెలుగు సాహిత్య అకాడెమీ ఏర్పాటు చేస్తామనీ ప్రకటించడంతో తెలుగు భాషాభిమానుల్లో ఒక్కసారిగా ఆనందం వెల్లివిరిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘మహారాష్ట్రలో తెలుగు భాషా, సాహిత్య వికాసం కోసం, తెలుగు మరాఠీ భాష మధ్య ఆదాన ప్రదానాల కోసం తెలుగు సాహిత్య అకాడెమీని ఏర్పాటు చేస్తున్నామనీ..’ ప్రకటించడం విశేషం.

ప్రభుత్వ ప్రకటనల్ని అందిపుచ్చుకుని సరిగ్గా ఫాలోఅప్‌ ‌చేస్తేనే ఆ ప్రకటనలు అమలులోకి వస్తాయనే విషయం ప్రభుత్వ రంగ పనితీరును పరిశీలించే ప్రతి ఒక్కరికి తెలుసు. మంత్రిగారి ప్రకటన వెలువడిన వెంటనే తెలుగు రైటర్స్ అసోసియేషన్‌, ‌మహారాష్ట్ర (త్వమ్‌) ‌ప్రధాన కార్యదర్శి సంగెవేని రవీంద్ర, ఫెడరేషన్‌ ఆఫ్‌ ‌తెలుగు అసోసియేషన్స్ అఫ్‌ ‌మహారాష్ట్ర (ఎఫ్‌%-%‌టామ్‌) అధ్యక్షులు గంజి జగన్‌బాబు, ప్రముఖ పాత్రికేయులు గుండారి శ్రీనివాస్‌, ఎ.‌కె.తెలుగు మీడియా అధినేత కంటె అశోక్‌, ‌తెలుగు డాక్టర్స్ అసోసియేషన్‌ అధ్యక్షుడు డా?తాటి నరహరి, ఆంధ్ర మహాసభ ధర్మకర్త గాలి మురళీధర్‌, ‌తెలుగు సేన బాధ్యులు వాసాల శ్రీహరి (వంశీ) తదితరుల సంతకాలతో, ఒక ప్రతినిధి బృందం మంత్రి సుధీర్‌ ‌మునిగంటివార్‌ను కలిసి, అకాడెమీ సత్వర ఏర్పాటుకై వినతిపత్రం సమర్పించారు. మార్చ్ 2024 ‌లో నిర్వహించిన సుధీర్గమైన మంత్రిమండలి సమావేశంలో ఈ అకాడెమీ ఏర్పాటును అయిదవ ఎజెండాగా చేర్చి అమోదించారు.

కాగా, పలు అనివార్య కారణాల వల్ల కొంత, ప్రభత్వపరమైన జాప్యాల వల్ల కొంత, అకాడెమీ అమలులోకి రావడం కాస్త ఆలస్యం అయింది. అయినప్పటికీ, మహారాష్ట్ర శాసన సభ ఎన్నికలకు ముందే రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో జారీ చేసి, మహారాష్ట్ర స్టేట్‌ ‌తెలుగు సాహిత్య అకాడెమీ నిర్వహణ కోసం పదకొండు మందితో కూడిన ఒక కార్యవర్గాన్ని నియమించింది.మహారాష్ట్రలో పలు విద్యాసంస్థలు నిర్వహిస్తున్న డా.పి.వి.రమణను కార్యాధ్యక్షుడిగా, సంగెవేని రవీంద్ర, గుండారి శ్రీనివాస్‌, ‌గంజి జగన్‌బాబు, కంటె అశోక్‌, ‌కెంచి హరీశ్‌, ‌బుధారపు రేణుక, రవీణా చవాన్‌, ‌బెజ్జంకివార్‌ ‌గజానన్‌, ‌కనకం సతీష్‌, ‌కందుకూరి శ్రీనివాస్‌ ‌తదితరుల్నికార్యవర్గ సభ్యులిగా ప్రకటించి, నియామక పత్రాలు అందచేశారు. వీరి పదవీకాలం మూడు సంవత్సరాలు ఉంటుంది.

మహారాష్ట్ర తెలుగు సాహిత్య అకాడెమీ బాధ్యతలు:
ప్రతి సంవత్సరం మహారాష్ట్రకు చెందిన ఒక ప్రముఖ తెలుగు సాహితీవేత్తకు లక్ష రూపాయల గౌరవ పారితోషికంతో పాటు జీవన సాఫల్య పురస్కారం, మరో ముగ్గురికి 51 వేల నగదు పారితోషికంతో పాటు ప్రతిభా పురస్కారాలు, మరాఠీ నుండి తెలుగులోకి అనువాదం చేసిన రచయితకు అవార్డు, వర్ధమాన తెలుగు రచయితలకు పురస్కారాలు అందించడం చేస్తారు. అంతేగాకుండా, తన మొదటి పుస్తకం వెలువరిస్తున్న రచయితకు ఆర్థిక సహాయం కూడా అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా సాహితీ కార్యశాలలు, సాహితీ గోష్టులు, కవి సమ్మేళనాలు నిర్వహి స్తారు. జాతీయ పర్వదినాలను అనివార్యంగా నిర్వహిస్తారు. తెలుగు భాషా వికాసానికి కాలాను గుణంగా పలు కార్యక్రమాలు రూపొందిస్తారు. తెలుగు సాహితీ శిఖరాల వర్ధంతి, జయంతుల్ని ఘనంగా నిర్వహిస్తారు.

ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని సాహితీ ప్రముఖుల్ని ఆహ్వానించి, సన్మానించడం, మార్గదర్శనం పొందడం లాంటి పలు కార్యక్రమాలు రూపొం దిస్తారు. విద్యార్థుల్లో, యువతలో సాహిత్యం పట్ల అభిమానం, ఆసక్తి పెంచే కార్యక్రమాల్ని నిర్వహిస్తారు. మరాఠీ, తెలుగు భాషల మధ్య ఉన్న స్వామ్యాన్ని తెలిపే రచనలకు ప్రోత్సాహం అందిస్తారు. ఎప్రిల్‌ 2025 ‌తర్వాత తెలుగు మరాఠీ భాషల్లో ఒక ఆన్‌ల్కెన్‌ ‌పత్రికను వెలువరించే అవకాశాలను పరిశీలిస్తున్నారు. వీటన్నింటి కోసం మహారాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి కోటి రూపాయలు తెలుగు సాహిత్య అకాడెమీకి కెటాయిస్తోంది. కార్యక్రమాల సాంద్రతను అనుసరించి ఈ నిధి ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.పరభాషా ప్రభుత్వం తెలుగు భాషా కోసం చేస్తున్న ఈ కృషి ఎంతో అభినందనీయం. మహారాష్ట్ర ప్రభుత్వానికి మహారాష్ట్రలో ఉంటున్న తెలుగు సమాజం కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన సందర్భం ఇది. ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న తెలుగు వారందరి తరఫున మహారాష్ట్ర ప్రభుత్వానికి జేజేలు..!
image.png
సంగెవేని రవీంద్ర,
9987145310
సభ్యులు: మహారాష్ట్ర తెలుగు సాహిత్య అకాడెమీ,
ప్రధాన కార్యదర్శి : తెలుగు రైటర్స్ అసోసియేషన్‌, ‌మహారాష్ట్ర (త్వమ్‌)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page