తెలంగాణలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు తమకు మూలాల నుంచి ముప్పు తెస్తున్న భారతీయ జనతాపార్టీ జైత్రయాత్రను నిరోధించడానికి, దీటైన సైద్ధాంతిక వైఖరులను ఆశ్రయించడమే మార్గం. సమాజంలో విద్వేషాలను తగ్గించి, సామరస్య భావాలను వ్యాపింప చేయడానికి ఉధృతంగా సాంస్కృతిక ప్రచారం, యువజనులను నిమగ్నం చేసే వివిధ కార్యక్రమాల రూపకల్పన, దక్షిణాదికి, ముఖ్యంగా తెలంగాణకు డీలిమిటేషన్ వల్ల కలిగే రాజకీయ నష్టం, ఆర్థిక నష్టం గురించిన చైతన్యవ్యాప్తి మొదలైనవి – ఇప్పడు తెలంగాణ ప్రభుత్వం చేపట్టవలసిన పనులు.
విధానాలు, సిద్ధాంతాలు మాట్లాడినప్పుడు నాయకులు ఉదాత్తంగా, గంభీరంగా కనిపిస్తారు. అప్పుడు నాయకుల మీద ప్రజలకు నమ్మకం, గౌరవం కలుగుతాయి. ప్రత్యర్థి పార్టీలతో బస్తీ మే సవాల్ అన్నట్టు అదుపు లేని భాషా వీరంగాలు వేస్తున్నప్పుడు, నాయకులు వస్తాదులవుతారేమో కానీ, వీరులుగా అనిపించరు. ఎవరైనా వాగ్ధాటి కలిగిన నేతలు జనాదరణ పొందితే, అది వారి దుర్భాష వల్ల కాదని, ఇతర అనుకూల లక్షణాల కారణంగా జనం వారి కించిత్ అల్పత్వాన్ని క్షమిస్తున్నారని అర్థం. ఈ సత్యం తెలుసుకోలేక, మాట తూలితేనే ప్రజలు వరిస్తారన్న పొరపాటుపాఠాన్ని తీసుకుని, కొత్తగా నోరుపారేసుకుంటున్న నాయకులను ఈ మధ్యకాలంలో చూస్తున్నాం.
ఇదంతా ఎందుకంటే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శుక్రవారం నాడు న్యూఢిల్లీలో ‘ఇండియా టుడే’ సదస్సులో మాట్లాడిన తీరు బాగుంది. ఒక రాష్ట్రానికి, ఒక ప్రాంతానికి, ఒక పార్టీకి, కొన్ని విలువలకు ప్రతినిధిగా ఆయన మాట్లాడారు. మాట్లాడిన విషయం మీద తనకు నిబద్ధత ఉన్నదని, ఆ మాటలను నమ్మి చెబుతున్నారని చూసినవారికి, విన్నవారికి అనిపించేటట్టుగా ఆయన మాట్లాడారు. రేవంత్ రెడ్డిని తరచుగా ఆ తరహాలో చూడము. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తరువాత మొదటి మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడినప్పుడు, రేవంత్ కు కొన్ని అంశాల మీద లోతైన అవగాహన ఉన్నదని, తెలియని విషయాలు తెలుసుకోవడానికి ఆయన కష్టపడతారని అర్థమయింది. కానీ, ఆయన ఆ గాంభీర్యాన్ని నిలకడగా కొనసాగించలేకపోతున్నారు. అప్పుడప్పుడు, విద్యావంతులు, మేధావులు పాల్గొన్నసభలలో, కొన్ని ప్రత్యేక సందర్భాలలో మాత్రం ఆయన ఏ ఉద్రేకాలకూ ఆస్కారం ఇవ్వకుండా ప్రసంగిస్తున్నారు. అందుకు అన్నివేళలా సమయసందర్భాలు అవకాశం ఇవ్వకపోయి ఉండవచ్చు. రాజకీయ సంవాదం మర్యాదగా జరిగితే పెద్దగా విలువలేని రోజులు వచ్చి ఉండవచ్చు. ఆ విలువల పతనానికి ఇటీవలి దశాబ్దంలోని రాజకీయ ప్రముఖులతో పాటు, తాను కూడా ఎంతో కొంత కారణం అయి ఉండవచ్చు.
ఇండియా టుడే సదస్సు వేదిక మీద తెలంగాణ ముఖ్యమంత్రి ఒక ముఖ్యమైన విధాన విషయం లో మోదీ ప్రభుత్వం మీద తన ప్రతిఘటనా వైఖరిని ప్రకటించారు. బిజెపి అగ్రనాయకత్వం విషయంలో మెతకగా ఉంటున్నారని, లోపాయికారీగా వారితో సత్సంబంధాలు పెట్టుకుంటున్నారని ప్రతిపక్షం ఆరోపిస్తున్నసమయంలో, తాజాగా, రెండు శాసనమండలి స్థానాలను అనాలోచితంగానో, అసమర్థత వల్లనో బిజెపికి కోల్పోయారని విమర్శలు వస్తున్న కాలంలో, రేవంత్ ఈ తీవ్రమయిన విమర్శలు చేయడం విశేషం. ఇంతకు మునుపు కూడా కాంగ్రెస్ అధికారిక జాతీయ వైఖరికి అనుగుణంగా బిజెపిని విమర్శించడం రేవంత్ అనేక సార్లుచేశారు. కానీ, ఇంతటి వేడి, స్పష్టత అప్పటి విమర్శల్లో లేదు. దక్షిణాదికి వ్యతిరేకంగా బిజెపి కుట్ర చేస్తున్నదని అనడం చిన్న ఆరోపణ కాదు. మోదీ గుజరాత్ దూత అయితే, తాను తెలంగాణ దూతనని అనడం పెద్దమాటే. అయితే, తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికో, కేంద్రంతో తనకు ఏ లాలూచీ లేదని ప్రదర్శించుకోవడానికో రేవంత్ ఈ ధాటి చూపించారని కూడా కొందరు అనుకోవచ్చు, అన్నా అనవచ్చు.
తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ కు చేసిన ప్రయాణంలో రేవంత్ రెడ్డికి కొంత సంశయదశ ఉండింది. ఏ పార్టీలో చేరాలో మిత్రులనుంచి, శ్రేయోభిలాషులనుంచి సలహాలు తీసుకున్నారాయన. ఒక దశలో బిజెపిలో చేరాలా అన్న ఊగిసలాటలో కూడా పడ్డారు. కాంగ్రెస్ లో చేరడమే అన్నివిధాలా తగినది అన్న నిర్ధారణకు రావడంలో, తన సొంత విచక్షణ పాత్రే ఎక్కువ. ఒకసారి నిర్ణయం తీసుకున్నతరువాత, వెనుకకు చూడగూడదు అనుకున్నారు కాబట్టి, కాంగ్రెస్ లో చేరాక, తన లక్ష్యాన్ని సాధించడం మీద గురి పెట్టారు. కెసిఆర్ ను ఢీకొనడానికి తీవ్రమైన విమర్శాధోరణిని, దూషణలభాషను ఆశ్రయించారు. కాంగ్రెస్‌వాదిగా మారిపోయి, ముఖ్యమంత్రి స్థానం సంపాదించుకున్నారు. వివిధ అంశాల మీద కాంగ్రెస్ విధానాలు వైఖరులను స్వీకరించే ప్రయత్నం చేస్తూ వచ్చారు.
ఈ దేశంలో ఎవరి మీదా ఏ భాషనూ రుద్దలేరు, డీలిమిటేషన్ జరగదు, జరిగినా మేం ఎన్ డిఎ మీటింగ్ లో మాట్లాడుకుంటాం- అని లోకేశ్ అంటున్న మాటలు, తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ న్యాయ సిద్ధాంతాన్ని, మాతృభాషాభిమానాన్ని విసర్జించినట్టు సూచిస్తాయి. ఎన్‌డిఎ లోకి తెలుగుదేశం, పిల్లిలో ఎలుక ఐక్యమైనంత గాఢంగా, కలిసిపోయిందని అర్థమవుతోంది. అందుకు భిన్నంగా, రేవంత్ రెడ్డి ప్రకటించిన వైఖరి, తెలంగాణ రాష్ట్రసమితి మొదటి దఫా పాలన తరువాత, దాదాపు ఏ సైద్ధాంతిక స్పర్శా లేకుండా నిస్సారంగా ఉండిపోయిన తెలంగాణకు తిరిగి కొత్త జీవాన్ని అద్దింది. కాంగ్రెస్ అంటే అరకొరగా నెరవేరుతున్న ఆరుగ్యారంటీలు మాత్రమే కాదు, కొన్ని సిద్ధాంతాలు విధానాలూ కూడా అన్న స్ఫురణను కలిగించింది.
ఇండియా టుడే సదస్సు వేదిక మీద తెలంగాణ ముఖ్యమంత్రి ఒక ముఖ్యమైన విధాన విషయం లో మోదీ ప్రభుత్వం మీద తన ప్రతిఘటనా వైఖరిని ప్రకటించారు. బిజెపి అగ్రనాయకత్వం విషయంలో మెతకగా ఉంటున్నారని, లోపాయికారీగా వారితో సత్సంబంధాలు పెట్టుకుంటున్నారని ప్రతిపక్షం ఆరోపిస్తున్నసమయంలో, తాజాగా, రెండు శాసనమండలి స్థానాలను అనాలోచితంగానో, అసమర్థత వల్లనో బిజెపికి కోల్పోయారని విమర్శలు వస్తున్న కాలంలో, రేవంత్ ఈ తీవ్రమయిన విమర్శలు చేయడం విశేషం. ఇంతకు మునుపు కూడా కాంగ్రెస్ అధికారిక జాతీయ వైఖరికి అనుగుణంగా బిజెపిని విమర్శించడం రేవంత్ అనేక సార్లుచేశారు. కానీ, ఇంతటి వేడి, స్పష్టత అప్పటి విమర్శల్లో లేదు. దక్షిణాదికి వ్యతిరేకంగా బిజెపి కుట్ర చేస్తున్నదని అనడం చిన్న ఆరోపణ కాదు. మోదీ గుజరాత్ దూత అయితే, తాను తెలంగాణ దూతనని అనడం పెద్దమాటే. అయితే, తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికో, కేంద్రంతో తనకు ఏ లాలూచీ లేదని ప్రదర్శించుకోవడానికో రేవంత్ ఈ ధాటి చూపించారని కూడా కొందరు అనుకోవచ్చు, అన్నా అనవచ్చు.
అనేక ఇతర విషయాలను కూడా రేవంత్ ఆ సదస్సులో చర్చించారు. కానీ, తమిళనాడు చొరవ కారణంగా దేశవ్యాప్తంగా చర్చలోకి వచ్చిన డీలిమిటేషన్ అంశంలో, హిందీ విధింపు విషయంలో తెలంగాణ గొంతు ను కూడా వినిపించడం విశేషం. ఎం.కె. స్టాలిన్ ఏర్పాటు చేసే దక్షిణాది రాష్ట్రాల అఖిలపక్షసమావేశానికి తాను హాజరవుతానని రేవంత్ చెప్పారు. భారత దేశ రాజకీయాలలో అనివార్యంగా రూపొందుతున్న ఉత్తర, దక్షిణ సమీకరణల్లో కాంగ్రెస్ పాలిత రాష్ట్రంగా తెలంగాణ పాలుపంచుకోక తప్పదు. డీలిమిటేషన్ విషయంలో తన వైఖరి ఏమిటో చెప్పడానికి రాష్ట్ర బిజెపికి అనేక పరిమితులున్నాయి. సమాధానం చెప్పలేని బలహీనతలో ఆ పార్టీ పడిపోయే అవకాశం ఉంది. మరి, బిఆర్‌ఎస్? డీలిమిటేషన్ తో దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని ఆ పార్టీ ఇంతకు మునుపు అభ్యంతరపెట్టింది కానీ ఆ అంశం మీద రాష్ట్ర అధికారపార్టీతో కలిసి, దక్షిణాది కూటమితో కలిసి పోరాడుతుందా? లేక తాను విడిగా వ్యతిరేకతను చెబుతానని అంటుందా? ఫెడరలిజాన్ని మరింతగా దెబ్బతీసే డీలిమిటేషన్ మీద గట్టి వైఖరి తీసుకుని ప్రతిఘటించకుండా ఉండడం ప్రాంతీయపార్టీ కి సాధ్యం కాదు.
ఇదే సదస్సులో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ కూడా పాల్గొన్నారు. డీలిమిటేషన్ వివాదం అంతా రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని డిఎంకె సృష్టిస్తున్నదన్నట్టుగా ఆయన మాట్లాడారు. జనాభా నియంత్రణ పాటించినందువల్ల రాజకీయ ప్రాతినిధ్యాన్ని కోల్పోవడం న్యాయం కాదన్నది అంగీకరిస్తూనే, ప్రస్తుత నిష్పత్తులకు ఏ భంగమూ రాదని అమిత్ షా చెప్పారు కదా అని అన్నారు లోకేశ్. నిజానికి, అమిత్ షా అటువంటి నిర్దిష్టమయిన వాగ్దానం ఏదీ ఇవ్వలేదు. దక్షిణాది రాష్ట్రాలకు ఒక్కసీటు కూడా తగ్గదని మాత్రమే అమిత్ షా అన్నారు. తగ్గుతుందని కాదు కదా, ఇప్పటి కలవరం? ఉత్తరాది రాష్ట్రాలకు పెరిగినంతగా పెరగకపోవడం వల్ల రెండు ప్రాంతాలకు మధ్య ఉన్న నిష్పత్తి చెదిరిపోతుందని, 24 శాతం ఉన్న దక్షిణాది లోక్ సభ ప్రాతినిధ్యం 19 కు, అంత కంటె దిగువకు పడిపోతుందని కదా ఆందోళన! 1971 జనాభా లెక్కల ప్రకారం పునర్విభజన చేయడమో, లేదా, ఇప్పటి లోక సభ లోని రాష్ట్రాల ప్రాతినిధ్యం నిష్పత్తిలోనే పెంచే సీట్లను నింపడమో, లేదా నిరవధికంగా డీలిమిటేషన్ ను వాయిదా వేయడమో, మరేదైనా ప్రత్యామ్నాయాన్ని అన్వేషించడమో జరిగితే తప్ప, అన్యాయాన్నినివారించలేము. హిందీ విధింపు కానీ, ప్రస్తుత జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ కానీ దక్షిణాదికి కీలకమయిన సమస్యలైనప్పుడు, ఒక రాష్ట్రంలో ఒక పార్టీ దాని ఆధారంగా ఎన్నికల పోరాటం చేస్తే తప్పేమిటి? ఆ పార్టీకి మిత్రపక్షమయిన తెలంగాణ కాంగ్రెస్ ఆ పోరాటంలో భాగస్వామి అయితే పొరపాటేమిటి?
ఈ దేశంలో ఎవరి మీదా ఏ భాషనూ రుద్దలేరు, డీలిమిటేషన్ జరగదు, జరిగినా మేం ఎన్ డిఎ మీటింగ్ లో మాట్లాడుకుంటాం- అని లోకేశ్ అంటున్న మాటలు, తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ న్యాయ సిద్ధాంతాన్ని, మాతృభాషాభిమానాన్ని విసర్జించినట్టు సూచిస్తాయి. ఎన్‌డిఎ లోకి తెలుగుదేశం, పిల్లిలో ఎలుక ఐక్యమైనంత గాఢంగా, కలిసిపోయిందని అర్థమవుతోంది. అందుకు భిన్నంగా, రేవంత్ రెడ్డి ప్రకటించిన వైఖరి, తెలంగాణ రాష్ట్రసమితి మొదటి దఫా పాలన తరువాత, దాదాపు ఏ సైద్ధాంతిక స్పర్శా లేకుండా నిస్సారంగా ఉండిపోయిన తెలంగాణకు తిరిగి కొత్త జీవాన్ని అద్దింది. కాంగ్రెస్ అంటే అరకొరగా నెరవేరుతున్న ఆరుగ్యారంటీలు మాత్రమే కాదు, కొన్ని సిద్ధాంతాలు విధానాలూ కూడా అన్న స్ఫురణను కలిగించింది.
తమిళనాడులో వచ్చే ఏడాది ఎన్నికలు జరగవలసిన మాట నిజమే. కానీ, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నాలుగేళ్లుగా స్టాలిన్ ప్రభుత్వం కేంద్రంతో సైద్ధాంతిక పోరాటం చేస్తూనే ఉన్నది. ఎన్నికలకు ముందు మాత్రమే ఘర్షణలోకి దిగుతోందనడం పొరపాటు. ఏదైనా పార్టీ తన సొంత విధానాలను, పాలనను, ఉనికిని కాపాడుకోవడం కోసం నిరంతరం రాజకీయ, సైద్ధాంతిక స్థాయిలలో తపన పడడం కంటె కావలసిందేముంది? తెలంగాణ లో కాంగ్రెస్, బిఆర్‌ఎస్ కూడా తాము ప్రాతినిధ్యం వహించేవిలువల కోసం అటువంటి నిలకడైన పోరాటం చేయాలి! బిజెపిని చూడండి, గెలుపు ఓటములతో నిమిత్తం లేకుండా, నిరంతరం క్షేత్రస్థాయిలో తాము చేయవలసింది చేస్తూ, పార్టీని నిర్మించుకుంటూ వస్తున్నది. అధికారంలో ఉన్నప్పుడు తమను తాము స్థిరపరచుకోవడమూ, ఆదాయాలను సమకూర్చుకోవడమూ ప్రతిపార్టీకి ఆనవాయితీ అయిపోయింది, ఆ చేత్తోనే, పార్టీల, పార్టీ విధానాల భవిష్యత్తును కూడా కాస్త పదిలపరచుకోవడం చేయాలి కదా!
తెలంగాణలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు తమకు మూలాల నుంచి ముప్పు తెస్తున్న భారతీయ జనతాపార్టీ జైత్రయాత్రను నిరోధించడానికి, దీటైన సైద్ధాంతిక వైఖరులను ఆశ్రయించడమే మార్గం. సమాజంలో విద్వేషాలను తగ్గించి, సామరస్య భావాలను వ్యాపింప చేయడానికి ఉధృతంగా సాంస్కృతిక ప్రచారం, యువజనులను నిమగ్నం చేసే వివిధ కార్యక్రమాల రూపకల్పన, దక్షిణాదికి, ముఖ్యంగా తెలంగాణకు డీలిమిటేషన్ వల్ల కలిగే రాజకీయ నష్టం, ఆర్థిక నష్టం గురించిన చైతన్యవ్యాప్తి మొదలైనవి – ఇప్పడు తెలంగాణ ప్రభుత్వం చేపట్టవలసిన పనులు. ఒకరినొకరు దెబ్బతీయడానికి అనుసరించే మార్గాలు ఇద్దరికీ నష్టం కలిగిస్తాయని కాంగ్రెస్, బిఆర్‌ఎస్ ఇకనైనా గుర్తించాలి. దుర్భాషల సంస్కృతిని రెండు పక్షాలూ విడనాడాలి. వైఖరుల ఆధారంగా రాజకీయ పోరాటం చేయడం అన్నది పార్టీలను ఆంతరంగికంగా కూడా బలంగా ఉంచుతుంది. చిన్నచిన్న ఒత్తిడి బృందాల బెదిరింపులకు లొంగకుండా పార్టీని కాపాడుతుంది.
రేవంత్!
జాతీయస్థాయిలో గర్జనలు చేయడం మాత్రమే కాకుండా, రాష్ట్రంలో కూడా పార్టీ విధానాల ప్రచారాన్ని చేయండి!
నిరంతరం కెసిఆర్‌ను, కెటిఆర్‌ను మాత్రమే కాకుండా, అప్పుడప్పుడు ఇట్లా మోదీని కూడా ఓ చూపు చూడండి!