ఈ పథకం విజయవంతానికి అంకితభావంతో పనిచేయాలి
స్కీం అమలుకు నిధుల సమస్య లేదు
దళారీల పైరవీలను కట్టడి చేయండి
పథకం అమలుపై ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష
హాజరైన బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రాజీవ్ యువ వికాస పథకం ద్వారా యువత జీవితాల్లో మార్పు తీసుకురావడం కోసం అధికారులు అంకితభావంతో పని చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నిర్దేశించారు. శనివారం అసెంబ్లీ కమిటీ హాల్ లో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి రాజీవ్ యువ వికాస పథకం అమలు గురించి సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వొచ్చిన తర్వాత సుమారు 59 వేల మంది పైగా ఉద్యోగ నియామక పత్రాలు అందించామని, ఉద్యోగాలు రానటువంటి యువత వారి కాళ్ళ మీద వారు ఆర్థికంగా నిలబడటానికి రాజీవ్ యువ వికాస పథకం ద్వారా స్వయం ఉపాధి పథకాలు అందించాలని తీసుకున్న నిర్ణయాన్ని క్షేత్రస్థాయిలో విజయవంతంగా అమలు చేయడానికి అధికారులు చాలా నిబద్ధతతో, పవిత్ర యజ్ఞంలా పనిచేయాలని సూచించారు.
రాజీవ్ యువ వికాస పథకం ప్రారంభించడానికి ముందే వనరుల సమీకరణకు సంబంధించి ముందస్తు ప్రణాళికలు తయారు చేసుకున్నామని, ఈ పథకానికి నిధుల సమస్య కూడా లేదని ఈ సందర్భంగా వివరించారు. రాజీవ్ యువ వికాస పథకంలో లబ్ధిదారుడికి మంజూరు పత్రం అందజేసినప్పటి నుంచి ఎంపిక చేసుకున్న యూనిట్ ఏర్పాటు చేసుకొని వ్యాపారంలో స్థిర పడేంత వరకు కావలసిన సహకారాన్ని అందిస్తూ యువత జీవన ప్రమాణాలు పెంచే విధంగా అధికారులు కృషి చేయాలని పేర్కొన్నారు.
ప్రభుత్వ ఆలోచన విధానాన్ని వంద శాతం అమలు చేయాలి
బ్యాంకు మార్జిన్ తో కలిపి రాష్ట్ర ప్రభుత్వం యువత కోసం 9వేల కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెడుతున్నదని, ఈ డబ్బులతో యువత వారి కాళ్ళ మీద వారు నిలబడి తమదైన శైలిలో వ్యాపారంలో రాణించి అభివృద్ధి చెందాలన్న ప్రభుత్వ ఆలోచన విధానాన్ని వంద శాతం అమలు చేసే విధంగా అధికారుల పనితీరు ఉండాలని సూచించారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈడబ్ల్యూఎస్ శాఖలను సమన్వయం చేస్తూ ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయడానికి రాజీవ్ యువ వికాస్ మిషన్ ఏర్పాటు చేస్తున్నామని, ఈ మిషన్ బాధ్యతలు సీనియర్ ఐఏఎస్ అధికారికి అప్పగిస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా శాఖల వారీగా ఈ పథకాన్ని పూర్తిస్థాయిలో పర్యవేక్షించడానికి ఒక అధికారిని ప్రత్యేకంగా నియామకం చేయాలని ఆదేశించారు.
ఏప్రిల్ 5లోగా దరఖాస్తుల స్వీకరణ