మానవత్వం చాటుక్ను మంత్రి పొన్నం..

  • రాజీవ్‌ రహదారి రామచంద్రాపూర్‌ వద్ద రోడ్డు ప్రమాదం
  • క్షతగాత్రులను అంబులెన్స్‌లో దవాఖానకు తరలించిన పొన్నం
  • మెరుగైన చికిత్స కోసం గజ్వేల్‌ కాంగ్రెస్‌ నాయకులకు, డాక్టర్లకు ఫోన్‌ చేసిన మంత్రి 
సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్‌ 10: రాష్ట్ర బిసి, రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్‌ మానవత్వాన్ని చాటుకున్నాడు. రోడ్డు ప్రమాదాన్ని చూసి చలించి క్షతగాత్రులను దగ్గర ఉండి అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం దవాఖానకు పంపించాడు. వివరాల్లోకి వెళ్లితే…ఆదివారం ఉదయం సిద్ధిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం(సిద్ధిపేట`హైదరాబాద్‌ రాజీవ్‌ రహదారి)రామచంద్రాపూర్‌ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది.  డిసిఎం వ్యాన్‌ను వెనక నుండి ఆటో ఢీకొట్టడంతో పలువురికి గాయాలయ్యాయి. అదే సమయంలో హైదరాబాద్‌ నుండి సిద్ధిపేట వైపు వొస్తున్న మంత్రి పొన్న ప్రభాకర్‌ ఈ రోడ్డు ప్రమాదాన్ని చూసి తన కాన్వాయ్‌ను ఆపాడు.  క్షతగాత్రులను చూసి అంబులెన్స్‌ను తెప్పించి  అంబులెన్స్‌లో గజ్వేల్‌ దవాఖానకు తరలించారు.
క్షతగాత్రులతో పాటు స్థానిక పోలీస్‌ సిబ్బందిని కూడా హాస్పిటల్‌కు పంపించడమే కాకుండా గజ్వేల్‌కు చెందిన కాంగ్రెస్‌ నాయకులకు ఫోన్‌ చేసి హాస్పిటల్‌కు వెళ్లి క్షతగాత్రులకు మైరుగైన వైద్యం అందేలా చూడాలని సూచించారు. అంతేకాకుండా, రోడ్డు ప్రమాదంలో గాయాలైన వారికి మంచి వైద్యం అందించాలని సంబంధిత డాక్టర్లతో ఫోన్‌లో మాట్లాడి సూచించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారికి మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్‌ ధైర్యంగా ఉండాలని సూచించారు. రోడ్డు ప్రమదాన్ని చూసి వెంటనే స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్‌ మానవత్వానికి స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. క్షతగాత్రులను గజ్వేల్‌ హాస్పిటల్‌కు అంబులెన్స్‌లో ఎక్కించి పంపించిన అనంతరం పొన్నం ప్రభాకర్‌గౌడ్‌ అక్కడి నుంచి తన నియోజకవర్గానికి బయలుదేరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *