Take a fresh look at your lifestyle.

మన ఆరోగ్యం ..మన చేతుల్లో ..

‘‘ఎక్కడో కర్ణాటకలో ఇద్దరికి వచ్చిందని నిర్లక్షంగా  ఉంటే అది మన నట్టింట్లో వొచ్చి కూర్చుంటుంది. కొరోనా ఏ రూపంలో ఉన్నా డేంజర్‌ అని ప్రజలు గుర్తించాలి. ఎవరికి వారు వ్యక్తిగత భద్రత లేదా స్వీయ రక్షణ చర్యలు తీసుకోనంత కాలం అది ఏదో  రూపంలో వెన్నాడుతూనే ఉంటుంది. ప్రజల్లో ఇమ్యూనిటి వచ్చే వరకు కొరోనా భయాలు తొలగిపోదని గుర్తించాల్సిందే. నాకేం కాదు అన్న నిర్లక్ష్యం వల్ల అనేకులు మృత్యువాతపడ్డారు. చనిపోతే కూడా ఎవరూ మనలను తాకరని గుర్తించాలి. ఇప్పటికే వేలాది కుటుంబాలు లక్షలు పోసినా తమవారి ప్రాణాలు నిలబెట్టుకోలేదు. అలాగే కొరోనా సోకితే దోచుకు నేందుకు ప్రైవేట్‌ ‌హాస్పిటల్స్  ‌సిద్దంగా ఉన్నాయి .. ’’

సెకండ్‌ ‌వేవ్‌ ‌నిర్లక్ష్యంతో దేశంలో వేలాదిమంది మృత్యువాత పడ్డారు. ప్రభుత్వ, వైద్యుల హెచ్చరికలను నిర్లక్ష్యం చేసిన పాపానికి మూల్యం చెల్లించుకున్నాం. వ్యాక్సిన్‌ ‌వేస్తామన్నా నిర్లక్ష్యం ప్రదర్శించాం. థర్డ్‌వేవ్‌ ‌వొస్తుందని పదేపదే మెచ్చరికలు చేస్తున్నా..మాస్కులు ధరించడం..భౌతిక దూరం పాటించక పోవడం.. గుంపులుగా తిరగడం వంటి చర్యలు ఇప్పుడు మళ్ళీ కలవరం కలిగిస్తున్న వేళ ఒమైక్రాన్‌ ‌మనదేశంలోనూ పాదం మోపింది. ఎక్కడో కర్ణాటకలో ఇద్దరికి వచ్చిందని నిర్లక్షంగా ఉంటే అది మన నట్టింట్లో వొచ్చి కూర్చుంటుంది. కరోనా ఏ రూపంలో ఉన్నా డేంజర్‌ అని ప్రజలు గుర్తించాలి. ఎవరికి వారు వ్యక్తిగత భద్రత లేదా స్వీయ రక్షణ చర్యలు తీసుకోనంత కాలం అది ఏదో రూపంలో వెన్నాడుతూనే ఉంటుంది. ప్రజల్లో ఇమ్యూనిటి వచ్చే వరకు కొరోనా భయాలు తొలగిపోదని గుర్తించాల్సిందే. నాకేం కాదు అన్న నిర్లక్ష్యం వల్ల అనేకులు మృత్యువాతపడ్డారు. చనిపోతే కూడా ఎవరూ మనలను తాకరని గుర్తించాలి. ఇప్పటికే వేలాది కుటుంబాలు లక్షలు పోసినా తమవారి ప్రాణాలు నిలబెట్టుకోలేదు. అలాగే కొరోనా సోకితే దోచుకు నేందుకు ప్రైవేట్‌ ‌హాస్పిటల్స్ ‌సిద్దంగా ఉన్నాయి.

ఇప్పటికే చేతులెత్తేసిన ప్రభుత్వాలు ఇప్పుడు కూడా అదే పనిచేస్తాయి. కనీసం చనిపోయిన కుటుంబాలకు పరిహారం చెల్లించాలన్న బాధ్యతను కూడా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. సుప్రీంకోర్టు అదేపనిగా చివాట్లు పెడితే 50వేల పరిహారాని కి కేంద్రం అంగీకరించింది. ఈ దశలో మనలను కాపాడేందుకు దేవుడు కూడా రాడని గుర్తించాలి. ఎందుకంటే దేవుడున్నాడని తిరుపతి వెంకన్న సందర్శనకు వెళ్లిన వారినీ కొరోనా వెంటాడింది. ఇక ప్రజలుగా మనమంతా మనకు మనం జాగ్రత్తలు తీసుకుంటూ నిత్య జీవితం గడపాలి. కొత్తవేరియంట్‌ ఒమైక్రాన్‌ ‌వచ్చిన వేళ చేస్తున్న హెచ్చరికలు శిరోధార్యం కావలి. తాజాగా దేశంలో రెండు ఒమైక్రాన్‌ ‌కేసులు నమోదయ్యాయి. కర్ణాటక నుంచి సేకరించిన నమూనాల జన్యు విశ్లేషణలో కొత్త వేరియంట్‌ ‌నిర్దారణ అయింది. వీరిలో ఒక వ్యక్తి దక్షిణాఫ్రికా జాతీయుడు (66) కాగా, మరొకరు ఎటువంటి ప్రయాణ చరిత్ర లేని బెంగళూరు వైద్యుడు (44). దక్షిణాఫ్రికా దేశస్థుడు నవంబరు 20న దుబాయ్‌ ‌మీదుగా భారత్‌కు వచ్చాడు. ఇద్దరిలోనూ లక్షణాలు స్వల్పమేనని ప్రకటించింది. కాంటాక్టులందరినీ గుర్తించామని, పరీక్షలు చేస్తున్నామని స్పష్టం చేసింది. ఒమైక్రాన్‌ ‌కేసులు బయటపడినంత మాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరమేనీ లేదని, జాగ్రత్తలు మాత్రం విస్మరించొద్దని ప్రజలకు సూచించారు. ఇతర వేరియంట్లతో పోలిస్తే ఇది సంక్రమించే అవకాశాలు చాలా ఎక్కువని తెలిపారు. డెల్టా వేరియంట్‌తో పోలిస్తే దీనిలో రెండు రెట్లు బ్యాడ్‌ ‌స్పైక్‌ ‌మ్యుటేషన్లు ఉన్నాయని తెలిపారు. వివిధ దేశాలతో పాటు మన దేశంలో నమోదైన కేసుల్లో వ్యాధి లక్షణాలు స్వల్పమేనని పేర్కొన్నా ..మన జాగ్రత్తలు మనకు శ్రీరామరక్ష అని గుర్తించాలి. ఈ వేరియంట్‌లో 45-52కు పైగా మ్యుటేషన్లు, దీని స్పైక్‌లో 26-32 మార్పులు గుర్తించారు. ఇతర వేరియంట్లతో పోలిస్తే మన శరీర కణాలకు అంటుకునే తత్వం దీనికి ఎక్కువగా ఉందని స్పష్టం చేశారు. రెండు డోసులు వ్యాక్సిన్‌ ‌తీసుకున్నా ఒమైక్రాన్‌ ‌వొచ్చింది.

అంటే మనం మాస్కులు దరించి జాగ్రుత్తగా లేకుంటే అంతే సంగతులని గుర్తించాలి. ఇకపోతే బూస్టర్‌ అవసరంపై శాస్త్రీయ పరిశోధన చేస్తున్నామని కేంద్రం వెల్లడించింది. అయితే వ్యాక్సిన్‌ ‌వేసుకుని ఉన్నా సోకిందంటే దానిని తట్టుకునే అవకాశం వొచ్చిందని గుర్తించాలి. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ రెండు డోసుల వ్యాక్సిన్‌ ‌పూర్తి చేసుకోవాలి. అనుమానాలు ఉంటే పరీక్షలు చేయించుకోవాలి. ఏ మాత్రం లక్షణాలు ఉన్నా నిర్లక్ష్యం చేయకూడదని వైద్య ఆరోగ్యశాఖ హెచ్చరిస్తోంది. మాస్కులు ధరించడం బూస్టర్‌ ‌డోసును మించి ఎక్కువ రక్షణ సందేశం ఇచ్చారు. ఒమైక్రాన్‌ ఆం‌దోళనల నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ ‌మాండవీయ గురువారం విమానాశ్రయ, నౌకాశ్రయ అధికారులతో సమావేశం నిర్వహించారు. విదేశాల నుంచి వొచ్చేవారికి కొరోనా టెస్టులు, పర్యవేక్షణపై సమీక్షించారు. కాగా, కొవిడ్‌ ‌చికిత్స కోసం అభివృద్ధి చేసిన సాట్రోవిమాబ్‌ ‌మందుకు బ్రిటన్‌ ‌ప్రభుత్వం గురువారం ఆమోదం తెలిపింది. ఈ కొత్త చికిత్సా విధానం ఒమైక్రాన్‌ ‌వంటి కొత్త వేరియంట్లపై కూడా సమర్థంగా పనిచేస్తుందని ఆ దేశ ఔషధ నియంత్రణ ప్రాధికార సంస్థ భావిస్తోంది. ఇకపోతే అబద్దాలతో ఇప్పుడు బెంగుళూరుకు వొచ్చిన వారు ఓ రకంగా మోసం చేశారని గుర్తించాలి. కొవిడ్‌ ‌నెగెటివ్‌ ‌ధ్రువపత్రంతో బెంగళూరు చేరుకున్న అతడికి అదే రోజు పరీక్ష చేయగా పాజిటివ్‌ ‌వొచ్చింది. ఐసొలేట్‌ ‌కావాలని ప్రభుత్వ వైద్యుడు సూచించారు. గత నెల 22న నమూనాను జన్యు విశ్లేషణకు పంపారు. అయితే, నవంబరు 27 అర్థరాత్రి అతడు క్యాబ్‌ ‌బుక్‌ ‌చేసుకుని హోటల్‌ ‌నుంచి దుబాయ్‌ ‌వెళ్లిపోయాడు.

ప్రయాణానికి అడ్డంకి లేకుండా ప్రైవేటు ల్యాబ్‌ ‌నుంచి కొవిడ్‌ ‌నెగెటివ్‌ ‌ధ్రువపత్రం పొందాడు. మరోవైపు ఇతడు టీకా రెండు డోసులూ పొందాడు. తన కాంటాక్టులందరికీ పరీక్షలు చేయగా నెగెటివ్‌ ‌వొచ్చింది. ఇక బెంగళూరు వైద్యుడికి నవంబరు 22న కొరోనా నిర్దారణ అయింది. మూడు రోజుల అనంతరం హాస్పిటల్‌ ‌నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈయన 13 మంది ప్రత్యక్ష, 250 ద్వితీయ కాంటాక్టులను ట్రేస్‌ ‌చేయగా ఐదుగురికి పాజిటివ్‌గా తేలింది. వీరి నమూనాలను జన్యు విశ్లేషణకు పంపారు. మరోవైపు దిల్లీ వొచ్చిన నలుగురికి కొరోనా పాజిటివ్‌ ‌వొచ్చింది. ఒమైక్రాన్‌ ‌వెలుగుచూసిన నేపథ్యంలో కేంద్రం హుటాహుటిన కర్ణాటక సీఎం బసవరాజ్‌ ‌బొమ్మైను దిల్లీకి పిలిపించింది. బూస్టర్‌ ‌డోస్‌పై కేంద్రంతో చర్చించేందుకు దిల్లీకి వెళుతున్నట్లు సీఎం పేర్కొన్నప్పటికీ ఆయన దిల్లీలో ఉన్న సమయంలోనే బెంగళూరులో రెండు ఒమైక్రాన్‌ ‌కేసులు వెలుగు చూసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.

మరోవైపు దిల్లీలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ ‌మాండవీయతో సీఎం ప్రత్యేకంగా సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. గత అనుభవాల రీత్యా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని సీఎంకు సూచించినట్లు తెలుస్తోంది. బెంగళూరులో ప్రస్తుతం కొరోనా కేసులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో తీవ్ర ఆంక్షలు విధించే అంశాలను కూడా పరిశీలిస్తున్నారు. పరిస్ధితులు మళ్లీ లాక్‌డౌన్‌ ‌దిశలో సాగుతున్నట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితులు వొస్తే మళ్లీ ప్రజలపైనే ప్రభావం, భారం పడుతుంది. అందువల్ల అటువంటి అవకాశాలు లేకుండా ఎవరికి వారు స్వీయ రక్షణ చర్యలకు సిద్దం కావాలి. అప్పుడే మనకు.. మన సమాజానికి, దేశానికి మేలు చేసిన వారం అవుతాం. మన ఆరోగ్యం మనచేతుల్లోనే ఉందని గుర్తించి మసులుకోవాలి.
– ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్

Leave a Reply