రాష్ట్ర వ్యాప్తంగా దావత్ ఏ ఇఫ్తార్ ఘనంగా నిర్వహించండి ….

ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు ఉండొద్దు
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

దావత్ ఏ ఇఫ్తార్ ను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధికారులను ఆదేశించారుశనివారం అసెంబ్లీ సమావేశ మందిరంలో ఇఫ్తార్ విందురంజాన్ పండుగ ఏర్పాట్లను ఆయన మంత్రి పొన్నం ప్రభాకర్ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతో కలిసి సమీక్షించారుప్రతి సంవత్సరం ఆనవాయితీగా నిర్వహించే ఈ కార్యక్రమాలకు ఎలాంటి నిధుల కొరత లేదని డిప్యూటీ సీఎం తెలిపారుఆహారంలో నాణ్యతప్రోటోకాల్సౌకర్యాల కల్పనలో అధికారులు ఎలాంటి రాజీ పడాల్సిన అవసరం లేదని డిప్యూటీ సీఎం తెలిపారుఏర్పాట్లలో అధికారులు ఏమాత్రం అశ్రద్ధ వహించొద్దని చిన్న పొరపాటుకు అవకాశం లేకుండా చూడాలని తెలిపారులా అండ్ ఆర్డర్ఎలక్ట్రిసిటీమంచినీరు వాటి అంశాలు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని కోరారుఏర్పాట్లలో ఎలాంటి అనుమానాలుఇబ్బందులు ఎదురైనా అధికారులు మొహమాటం లేకుండా జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ లేదా తన దృష్టికి తీసుకురావాలని ఆదేశించారుఏర్పాట్లకి సంబంధించి రోజువారి సమీక్షను ప్రభుత్వ సలహాదారుఏర్పాట్ల కమిటీ వైస్ చైర్మన్ షబ్బీర్ అలీ రోజువారి సమీక్ష చేస్తారని తెలిపారు.  
సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రంజాన్ పవిత్ర మాసంలో ముస్లింలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందనిదావత్ ఏ ఇఫ్తార్ కు కూడా ఘనంగా ఏర్పాట్లు చేస్తామని తెలిపారుప్రభుత్వ సలహాదారుమాజీ మంత్రి షబ్బీర్ అలీ మాట్లాడుతూ మా ప్రభుత్వం దావత్ ఏ ఇఫ్తార్ ను ఘనంగా నిర్వహిస్తుందని అన్నారుసమావేశంలో అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page