ఈ చట్టం తల్లిదండ్రుల బాధ్యత వారి వారసులు లేదా దత్తపుత్రులదే అని చెబుతుంది. సీనియర్ సిటిజన్లు ఆరోగ్యకరమైన, సంతోషకరమైన, గౌరవప్రదమైన స్వావలంబన కోసం అటల్ వయో అభ్యుదయ్ యోజన పథకం ఉంది. దేశవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో 650కి పైగా వృద్ధుల గృహాలను కేంద్రప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇవి నిరుపేద వృద్ధులకు నివాసం, ఆహారం, వైద్య సంరక్షణ, వినోదం వంటి ప్రాథమిక సౌకర్యాలను అందించడం ద్వారా వారి జీవన నాణ్యతను మెరుగుపరచడానికి
కృషి చేస్తున్నాయి. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ పథకం ద్వారా 75 సంవత్సరాల స్వాతంత్య్రాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం 75 కొత్త సీనియర్ సిటిజన్ గృహాలను ప్రారంభించింది. ప్రభుత్వం సీనియర్ సిటిజన్ల కోసం జాతీయ ఎల్డర్‌లైన్ పేరుతో 14567 ఫోన్ నంబరును హెల్ప్‌లైన్‌గా ప్రారంభించింది. సీనియర్ ఏబుల్ సిటిజన్స్ ఫర్ రీ ఎంప్లాయ్‌మెంట్ ఇన్ డిగ్నిటీ పోర్టలును 1 అక్టోబర్ 2021న దేశ వ్యాప్తంగా ప్రారంభించబడింది. ఇంకా కేంద్రం ఆరోగ్య భీమా పదకాలు అమలు చేస్తుంది.
రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వృద్ధాప్య పింఛనులు ఇస్తున్నాయి. ఇవన్నీ ఒకెత్తయితే సామాజికంగా పిల్లల ఆలోచనాదృష్టి మారాలి. తల్లిదండ్రుల బాధ్యత పిల్లలు తీసుకోవాలి. వృద్ధుల పట్ల నిరాదరణ తగ్గించేందుకు, ఆదరణ పెంచేందుకు, వారి సమస్యల పరిష్కారాలపై తీసుకోవాల్సిన పనులపై, కుటుంబ సభ్యుల నుంచి ఎదుర్కొనే వేధింపుల నివారణకు యువత నడుమబిగించాలి. (అక్టోబర్ 1 అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం)
-జనక మోహన రావు దుంగ
ఫోన్ 8247045230