భారత అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ లో “ మోనిహార”

 వారాల అన్వేష్ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ గా రూపొందించిన సినిమా  
హైదరాబాద్,ప్రజాతంత్ర,అక్టోబర్25: కరీంనగర్ కు చెందిన వారాల అన్వేష్ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ గా రూపొందించిన సినిమా “ మోనిహార” 55 వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి ఎంపికయింది. ప్రస్తుతం అన్వేష్ హైదరాబాద్లో సినిమా రంగంలో వున్నాడు. ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసారాల శాఖ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.  భారత కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ 55 వ ఇఫీ 2024 (IFFI IFFI 55 ) నవంబర్ 20 నుంచి 28 వరకు గోవా లో జరుగుతుంది. వివిధ భారతీయ భాషల్లోంచి వచ్చిన నాన్ ఫీచర్ సినిమాల్లోంచి ఎంపికయిన వాటిల్లో ‘మొనిహార’ వుంది. ఈ చిత్రం బెంగాలీ భాషలో నిర్మించారు.
కోల్ కత్తా లోని సత్యజిత్ రె ఫిలిం ఇన్స్టిట్యుట్ లో వారాల అన్వేష్ సినిమాతటోగ్రఫీలో పీజీ కోర్స్ పూర్తి చేసాడు. విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్ రాసిన ‘మొనిహార’ కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రానికి ఇన్స్టిట్యుట్ లోనే కోర్సు పూర్తి చేసుకున్న సుభాదీప్ బిస్వాస్ దర్శకత్వ బాధ్యతల్ని  నిర్వహించాడు. ఇక గతంలో వారాల అన్వేష సినిమాటోగ్రాఫర్ గా రూపొందిన ‘అపార్’ మరియు ‘నవాబి శౌక్’ చిత్రాలు ఇండో బంగ్లాదేశ్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ తో సహా అనేక అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్ లో ఎంపిక అయి ప్రదర్శించబడి ప్రశంసల్ని అందుకున్నాయి. ఇంకా అన్వేష్ తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబమయిన పట్నాల పైన పూర్తి నిడివి డాక్యుమెంటరీ తీసాడు. అది హైదరాబాద్ లో జరిగిన బతుకమ్మ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించబడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page