- నా ఫొటోలను మార్పింగ్ చేసి మానసిక వేదనకు గురిచేస్తున్నారు..
- మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 15 : సోషల్ మీడియా ద్వారా తనకు చాలా ఇబ్బంది ఏర్పడిందని, సోషల్ మీడియా ఎఫెక్ట్ ను సీఎం సభలో మాట్లాడడం మా అందరికీ చాలా రిలీఫ్ అనిపించిందని మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క (Minister Seethakka ) అన్నారు. అసెంబ్లీ లాబీలో ఆమె మీడియాతో చిట్ చాట్ చేస్తూ.. తన ఫోటోలను మార్ఫింగ్ చేసి మానసిక ఆవేదనకు గురి చేశారని అన్నారు.
సోషల్ మీడియా పోస్ట్ లు కొన్నిసార్లు నన్ను డీమోరల్ చేశాయి. మహిళలు రాజకీయాల్లో ఎదగడమే కష్టం.. అలాంటిది మేము ఈ స్థాయికి వొస్తే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. సోషల్ మీడియాను సోషల్ సర్వీస్ కు వాడుకున్న నేను.. అంతే ఇబ్బందులకు గురయ్యాను. సోషల్ మీడియాను బిఆర్ఎస్ అబద్దాలకు వాడుతుంది.. సోషల్ మీడియా కుటుంబాలను బజారుకీడుస్తుంది. బాడీ షేమింగ్, ఫోటో లు మార్ఫింగ్ , అనని మాటలను అన్నట్లుగా చూపిస్తున్నారు. గత సంవత్సరం నుంచి ఇది ఎక్కువైపోయింది. అన్నా చెల్లెల్లు చేతిలో చెయ్యి వేసుకున్నా.. మరోకరకంగా చూపుతున్నారు. సోషల్ మీడియాను మంచికి వాడాలి.. చెడుకు కాదు.. కొరోనా సమయంలో ఎంతో మందికి సేవలందించా. దాన్ని కూడా సోషల్ మీడియాలో నన్ను విమర్శించారు. అబద్దాల పైనే బిఆర్ఎస్ నడుస్తోంది. స్తుంది. అబద్దానికి అర్థం బిఆర్ఎస్. ఏ రోజుకైనా నిజమే గెలుస్తుది. సోషల్ మీడియాను కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. సోషల్ మీడియా వేదికగా మా పై బురద చల్లుతున్నారు….కడుక్కోవడం మా వంతు అవుతుంది అని మంత్రి సీతక్క వెల్లడించారు.