జార్ఖండ్‌లో ఎన్‌డీఏకు పట్టం
పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ ఎగ్జిట్ పోల్ అంచనా
న్యూదిల్లీ, నవంబర్ 20 : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ‘మహాయుతి’ విజయం సాధించి మరోసారి అధికార పగ్గాలు చేపట్టే అవకాశాలున్నాయని పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ అంచనావేసింది. మరోవైపు జార్ఖండ్ లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారం చేపట్టే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని పీపుల్స్ సర్వే వెల్లడిరచింది. కాగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ‘మహా’సంగ్రామాన్ని తలపించాయి. ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జాతీయ పార్టీల్కెన బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రతిష్టాత్మకంగా మారాయి. 2019లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రాంతీయ పార్టీలు శివసేన, ఎన్సీపీలు చీలిపోయి చెరో వర్గం బీజేపీ, కాంగ్రెస్ పంచన చేరడంతో 2024 అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. బీజేపీ, శివసేన (ఏక్ నాథ్ శిందే), ఎన్సీపీ (అజిత్ పవార్) పార్టీలతో కూడిన మహాయుతి, కాంగ్రెస్, శివసేన (ఉద్దవ్ థాక్రే), ఎన్సీపీ (శరద్ పవార్) పార్టీలతో కూడిన మహా వికాస్ అఘాఢీ (ఎంవీఏ) కూటములు ఎన్నికల్లో నువ్వా నేనా అన్నట్టు తలపడ్డాయి. ‘మహా’సంగ్రామంపై క్షేత్రస్థాయిలో పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్‌లో పోటాపోటీగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ‘మహాయుతి’ విజయం సాధించి మరోసారి అధికార పగ్గాలు చేపట్టే అవకాశాలున్నాయని తేలింది. 288 స్థానాలున్న మహారాష్ట్రలో మెజార్టీకి కావాల్సిన మాజిక్ ఫిగర్ 145. పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం మహాయుతి కూటమికి 182 (175 -195) సీట్లు, ఎంవీఏ కూటమికి 97 (85 -112) సీట్లు, ఇతరులుకు 9 (7 -12) సీట్లు వొచ్చే అవకాశాలున్నాయి.
మహారాష్ట్రలో బీజేపీ అతిపెద్దగా అవతరించే అవకాశాలున్నాట్టు పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ లో వెల్లడ్కెంది. బీజేపీ 113(102 నుంచి 120) స్థానాలు, శివసేన (ఏక్నాథ్ శిందే) పార్టీ 52 (42 నుంచి 61) స్థానాలు, ఎన్సీపీ (అజిత్ పవార్) పార్టీ 17(14 నుంచి 25) స్థానాలు, కాంగ్రెస్ 35 (24 నుంచి 44) స్థానాలు, శివసేన (యూబీటీ) 27(21 నుంచి 36) స్థానాలు, ఎన్సీపీ (ఎస్పీ) 35 (28 నుంచి 41) స్థానాలు, ఇతరులు 9 (6 నుంచి 12) స్థానాలు గెలిచే అవకాశాలున్నాయి.
మహాయుతికి 49.8 శాతం, ఎమ్వీఏ 40.1 శాతం, ఇతరులకు 10.1 శాతం వోట్లు వొచ్చే అవకాశాలున్నాయి. బీజేపీ 31.3 శాతం, శివసేన (షిండే) 14.5 శాతం, ఎన్సీపీ (ఏపీ) 4 శాతం, కాంగ్రెస్ 13.7 శాతం, శివసేన (యూబీటీ) 13 శాతం, ఎన్సీపీ (ఎస్పీ) 10.1 శాతం, ఇతరులు 13.4 శాతం వోట్లు పొందే అవకాశాలున్నాయిని ఎగ్జిట్ పోల్ లో తేలింది. ముఖ్యమంత్రిగా ఎవరికి ప్రాధాన్యతిస్తారని వోటర్లను ప్రశ్నించగా ఏక్నాథ్ శిండేకు 35.8 శాతం, ఉద్దవ్ ఠాక్రేకు 21.7 శాతం, దేవంద్ర ఫడ్నవీస్ కు 11.7 శాతం, రాజ్థాక్రేకు 2.9 శాతం, అజిత్ పవార్ కు 2.3 శాతం, జయంత్ పాటిల్ కు 2.1 శాతం, నానా పాటోల్ కు 1.3 శాతం, ప్రకాశ్ అంబేద్కర్ కు 1.3 శాతం వోటర్లు మద్దతిచ్చారు.
రాష్ట్రంలో మహిళలు మద్దతు కూడామహాయుతికే లభించింది. మహాయుతికి పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా మద్దతు లభించింది. సామాజిక వర్గాల వారీగా పరిశీలిసే ్త ముస్లింలు ఎంవీఏకే మద్దతివ్వగా, ఓబీసీలు మహాయుతివైపు మొగ్గు చూపారు. ఎస్సీల్లో రెండు కూటములకు దాదాపు సమానంగా మద్దతు లభించింది. ఎస్టీలు మహాయుతికే మద్దతు ప్రకటించారు. బౌద్దుల మద్దతు రెండు కూటములకు సమానంగా వొచ్చే అవకాశాలున్నాయి. రంగాల వారీగా పరిశీలిస్తే రైతులు, ప్రయివేట్ ఉద్యోగులు, వ్యాపారస్తులు గృహిణులు మహాయుతి వైపు ఉండగా, ప్రభుత్వ ఉద్యోగులు ఎమ్వీఏ వైపు నిలిచారు. మరాఠా, మార్వాడీ, ఉత్తర భారతీయులు, గుజరాతీయులు, దక్షిణ భారత ప్రజలు ఇలా అందరూ మహాయుతికే మద్దతుగా నిలిచారు. ప్రాంతాల వారీగా పరిశీలిస్తే ఉత్తర మహారాష్ట్ర, మరఠ్వాడా, విదర్భ, పశ్చిమ మహారాష్ట్ర, కొంకణ్, ముంబాయి రీజియన్లలో మహాయుతి ఆధిపత్యం కనబరిచింది. లోక్ సభ ఎన్నికల్లో విదర్భ, ముంబాయి ప్రాంతాల్లో కాంగ్రెస్ ఆధిక్యత సాధించినా, అసెంబ్లీ ఎన్నికల నాటికి పరిస్థితులు పూర్తిగా మారడంతో మహాయుతికి అవకాశాలు మెరుగ్గయ్యాయి.
ఐదు నెలల క్రితం జరిగిన లోక్ సభ ఎన్నికలతో ప్రస్తుతం జరిగిన అసెంబ్లీ ఎన్నికలను పోలిస్తే మహారాష్ట్ర వోటర్లు వైవిధ్యమైన తీర్పు ఇవ్వబోతున్నారు. లోక్ సభ ఎన్నికల్లో మహాయుతి కూటమి 17 (43.55%) , ఎమ్వీఏ కూటమి 30 (43.71%) పార్లమెంట్ స్థానాలు సాధించాయి. రెండు పార్టీల మధ్య సీట్లపరంగా 13 స్థానాల వ్యత్యాసం ఉన్నా, వోట్ల శాతం పరంగా 0.16% మాత్రమే తేడా ఉంది. స్వల్ప వ్యత్యాసంతో భారీగా సీట్లు కోల్పోయిన మహాయుతి అసెంబ్లీ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించి మరోసారి అధికారాన్ని చేపట్టబోతోంది. మరోవైపు బీజేపీ మాతృసంస్థ ఆర్‌ఎస్‌ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి బాధ్యతలు స్వీకరించి క్షేత్రస్థాయిలో మహాయుతి విజయానికి తోడ్పడిరది. లోక్ సభ ఎన్నికల్లో మరాఠా రిజర్వేషన్ల అంశంతో పాటు, బీజేపీ నినాదం ‘అబ్ కీ బార్, చార్ సౌ పార్’ వాస్తవం దాలిస్తే రాజ్యాంగానికే ముప్పు అనే ఎమ్వీఏ ప్రచారం మహాయుతికి వ్యతిరేకంగా పనిచేయడంతో ఆ కూటమి నష్టపోయింది. దీంతో అసెంబ్లీ ఎన్నికల నాటికి ముందే జాగ్రత్తపడిన బీజేపీ పలు మరాఠాలు వ్యతిరేకంగా వోటు వేస్తారనే అంచనాతో ఓబీసీలను అనుకూలంగా మల్చుకుంది. మరోవైపు ముస్లింలు బీజేపీకి వ్యతిరేకంగా ‘ఓట్ జిహాద్’ చేస్తున్నారని ప్రచారం చేస్తూ ‘బాటేంగే తో కాటేంగే’ నినాదాన్ని ఎత్తుకొని భారీగా హిందువుల వోట్లను కూడగట్టగలిగింది. ఈ ఎన్నికల్లో దీనికి మించి మరో ముఖ్యాంశం మహిళా వోటర్లను ఆకర్షించడానికి మహాయుతి ప్రభుత్వం ‘మాజీ లడ్కీ బహిన్ యోజన’ పథకం కింద 2.34 కోట్ల మంది మహిళలకు నెలకు రూ.1500 అందించారు. భవిష్యత్తులో దీన్ని రూ.2100 కోట్లకు పెంచుతామని ప్రకటించారు. ఈ పథకం ఎన్నికల్లో మహాయుతికి సానుకూలంగా పనిచేసింది.
కాంగ్రెస్ నేతృత్వంలోని ఎమ్వీఏ లోక్ సభ ఎన్నికల తీరులోనే అసెంబ్లీ ఎన్నికల్లో రాజ్యాంగం పరిరక్షణ అంశాన్ని కీలక ప్రచారాంశంగా మల్చుకుంది.
మరోవైపు ఐదు గ్యారెంటీలతో పాటు కులగణన చేపడుతామని ప్రకటించి భారీ ఆశలు పెట్టుకుంది. అయితే దీనికి పోటీగా ‘ఏక్ రహేంగేతో సేఫ్’ అంటూ ప్రధాని మోదీ మొదలుకొని బీజేపీ నేతలంతా ప్రచారం చేశారు. మొత్తం మీద నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి ప్రధాన ప్రజా సమస్యల కంటే భావోద్వేగాల అంశాలే ఎన్నికల్లో కీలకాంశాలుగా మారాయి. ఎన్నికల ప్రచారంలో మహాయుతి తరఫున ప్రధానంగా బీజేపీ జాతీయ నేతలు, వివిధ రాష్ట్రాల బీజేపీ సీఎంలు సుడిగాలిలా పర్యటించగా, కాంగ్రెస్ మాత్రం కొంత వెనుకబడిరది. ఎంవీఏలో కాంగ్రెస్ తో పోలిస్తే శరద్ పవార్, ఉద్దవ్ ఠాక్రేల ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా సాగింది. మరోవైపు పార్టీల మధ్య సీట్ల పంపకాన్ని త్వరగా తేల్చుకోవడంలో మహాయుతితో పోలిస్తే ఎంవీఏ కొంచెం వెనుకబడిరది. బీజేపీ ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించి ప్రచారం ప్రారంభించగా, ఎంవీఏ మాత్రం చివరి నిమిషం వరకు సీట్ల సర్దుబాటు దోబుచులాడుతూ నష్టపోయింది.
అసెంబ్లీ ఎన్నికల్లో చిన్న పార్టీలు కీలక పాత్ర పోషించాయి. ప్రధానంగా ఎంఐఎం, వీబీఏ, బీవీఏ, ఎమ్‌ఎన్‌ఎస్ పార్టీలు సీట్లు సాధించడంలో వెనుకబడ్డా ఓట్లను చీల్చడంతో ఇతర పార్టీల గెలుపోటముల్లో ప్రధాన పాత్ర పోషించాయి. 2019 ఎన్నికల్లో 40 స్థానాలకు పైగా పోటీ చేసి రెండు సీట్లు సాధించిన ఎంఐఎం బీజేపీకి ‘బీ టీం అని అపవాదు ఎదుర్కోవడంతో ఈసారి 16 స్థానాల్లోనే పోటీ చేసిన ఆ పార్టీ ఒక్క స్థానంలో మాత్రమే గెలిచే అవకాశాలున్నాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పీపుల్స్ పల్స్ సంస్థ 21, 362 సాంపిల్స్ తో ఎగ్జిట్ పోల్ సర్వే నిర్వహించింది. సంస్థ డ్కెరెక్టర్ ఆర్. దిలీప్ రెడ్డి నేతృత్వంలో సీనియర్ రీసెర్చర్ జి.మురళీ కృష్ణ, ప్రదీప్, ఐ.వీ.మురళీ కృష్ణ శర్మ ఎగ్జిట్ పోల్ రిపోర్టును రూపొందించారు.
జార్ఖండ్‌లో ఎన్డీఏ జయకేతనం
ఖనిజ సంపదకు నిలయమైన జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఏన్డీఏ, ‘ఇండియా’ కూటములకు ప్రతిష్టాత్మకంగా మారాయి. 24 జిల్లాలు, ఐదు డివిజన్లు ఉన్న జార్ఖండ్ రాష్ట్రంలో 81 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఉత్తర భారత దేశంలోనే అధికంగా ఆదివాసీల ప్రాబల్యం ఉన్న రాష్ట్రం జార్ఖండ్. జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐఎమ్‌ఎల్ పార్టీలతో కూడిన ‘ఇండియా’ కూటమి, బీజేపీ, ఏజేఎస్ కు, జేడీ(యూ), ఎల్జీపీ పార్టీలతో కూడిన ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో పోటాపోటీగా తలపడ్డాయి. జార్ఖండ్ రాష్ట్రంలో ప్రస్తుతం జేఎమ్‌ఎమ్ నేతృత్వంలోని ‘ఇండియా’ కూటమి ప్రభుత్వం కొనసాగుతోంది. రాష్ట్ర శాసనసభ ఎన్నికలపై క్షేత్రస్థాయిలో పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ ఎగ్జిట్ పోల్ నిర్వహించింది.
ఎగ్జిట్ పోల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ జార్ఖండ్‌అధికారం చేపట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 81 శాసనసభ స్థానాలున్న జార్ఖండ్ ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ సీట్లు 41. బీజేపీ 42 నుంచి 48 స్థానాలు, ఏజేఎస్ కు 2 నుంచి 5 స్థానాలు, కాంగ్రెస్ 8 నుంచి 14, జేఎమ్‌ఎమ్16 నుండి 23 స్థానాలు, ఇతరులు 6 నుంచి 10 స్థానాలు పొందే అవకాశాలున్నాయని ఎగ్జిట్ పోల్ సర్వేలో తేలింది.
పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాల ప్రకారం బీజేపీ 42.1 శాతం, ఏజేఎస్యూ 4.6 శాతం, కాంగ్రెస్ 16.2 శాతం, జేఎమ్‌ఎమ్ 20.8 శాతం, ఇతరులు 16.3 శాతం ఓట్లు పొందనున్నాయి. ఈ సర్వే ఫలితాల్లో మూడు శాతం ప్లస్ ఆర్ మైనస్ ఉండే అవకాశాలున్నాయి.
రాష్ట్రంలో డివిజన్ల వారీగా పార్టీల బలాబలాలను అంచనా వేస్తే… కోల్హాన్ డివిజన్లో 2019 ఎన్నికల్లో జేఎమ్‌ఎమ్ ఆధిక్యత సాధించగా, ప్రస్తుతం బీజేపీ మెరుగ్గా కనిపిస్తున్నా ‘ఇండియా’ కూటమి ఇక్కడ గట్టి పోటీ ఇచ్చింది. బొగ్గు మైనింగ్ అధికంగా ఉండే నార్త్ చోటా నాగపూర్ లో ఎస్సీ జనాభా అధికం. ఇక్కడ వామపక్షాలకు కొంత బలమున్నా, పట్టణ ప్రాంతాల్లో బీజేపీకి సానుకూలంగా ఉంది. కుర్మి సామాజికవర్గం ఇక్కడ అధికంగా ఉండడంతో ఏజేఎస్ కూడా బలంగానే ఉంది. సీపీఐఎమ్‌ఎల్ ఇక్కడ కీలకం కావడంతో, ఈ ప్రాంతంలో రెండు కూటముల మధ్య గట్టి పోటీ ఉంది. సౌత్ చోటా నాగపూర్ రీజియన్లో రాజధాని రాంచీ కీలకం. ముండా, ఓరన్ లో ఎస్టీలు, లోహర్గడ్‌లో ముస్లింలు, సిండేగాలో క్రిస్టియన్ల ప్రభావం ఉంది. రాంచీ, గుమ్లా జిల్లాలో బీజేపీకి సానుకూలంగా ఉండగా, ఈ ప్రాంతంలోని ఇతర జిల్లాల్లో పోటాపోటీగా ఉంది. ఓబీసీలు అధికంగా ఉండే పాలాం ప్రాంతంలో గతంలో బీజేపీ మెరుగైన ఫలితాలు పొందింది. ఈ సారి కూడా అదే పునరావృత్తమయ్యే అవకాశాలున్నాయి. సంతాల పర్గాన ప్రాంతంలో గతంలో బీజేపీకి అనుకూల ఫలితాలు రాలేదు. ఈ సారి మెరుగైన ఫలితాలు వొచ్చే అవకాశాలున్నాయి.
ఎస్టీ సామాజికవర్గంలో సంతాల వర్గం కీలకం. సీఎం హేమంత్ సోరెన్, బీజేపీ సీనియర్ నేత బాబులాల్ మరాండీ సంతాల వర్గానికే చెందిన వారు. ప్రస్తుతం ఈ సామాజికవర్గంలో బీజేపీతో పోలిస్తే జేఎమ్‌ఎమ్ కు కొంత అనుకూలంగా ఉంది. ముండా సామాజికవర్గం బీజేపీ వైపు ఉండగా, ఓరన్ సామాజికవర్గం బీజేపీ, కాంగ్రెస్ మధ్య చీలిపోయి ఉంది. హో సామాజికవర్గం బీజేపీకి అనుకూలంగా ఉంది. ఎస్సీ సామాజికవర్గంలో పాశ్వాన్, బోక్తా వర్గాలు బీజేపీకి అనుకూలంగా ఉండగా, చమర్ వర్గం ‘ఇండియా’ కూటమి వైపు ఉంది. ఓబీసీలో కుర్మి సామాజికవర్గం కీలకం. గతంలో వీరు జేఎంఎంకు అనుకూలంగా ఉండగా, ప్రస్తుతం ఏజేఎస్యూ వైపు ఉన్నారు. మరో సామాజికవర్గం బనియా బీజేపీ వైపు ఉన్నారు. యాదవ్ లు ఎన్డీఏ, ‘ఇండియా’ కూటమి మధ్య చీలి ఉన్నారు. 14 శాతంపైగా ఉన్న ముస్లింలు, 4 శాతంపైగా ఉన్న క్రిస్టియన్లు ‘ఇండియా’ కూటమికి అనుకూలంగా ఉన్నారు. అగ్రవర్ణాల్లో బ్రాహ్మిన్స్, రాజ్ పుత్ లు, కాయస్తులు బీజేపీకి అనుకూలంగా ఉన్నారు.
‘ఇండియా’ కూటమి ప్రచారాంశాలు :
ఎన్నికల ముందే జేఎమ్‌ఎమ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రభుత్వం తరఫున పలు సంక్షేమ పథకాలు ప్రకటించారు. ప్రధానంగా మహిళలను ఆకట్టుకునేందుకు ‘మాయి యోజన’ పథకం కింద మహిళలకు ప్రతి నెల రూ.1500 ఇప్పటికే వారి ఖాతాల్లో చేరాయి. మరోసారి అధికారంలోకి వొస్తే ఈ పథకాన్ని రూ.2500కు పెంచుతామని ఆయన హామీ ఇచ్చారు. మరోవైపు ఆదివాసీలను ఆకట్టుకునేందుకు వారిని ప్రత్యేక మతంగా గుర్తించాలని కోరుతూ జేఎమ్‌ఎమ్ ప్రభుత్వం ‘సర్నా’ కోడ్ బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపింది. విద్యుత్ కు సంబంధించిన పాత బకాయిలను రద్దు చేయడంతో పాటు ప్రతి నెల 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ప్రవేశపెట్టారు. ఈ పథకాలు ‘ఇండియా’ కూటమికి అనుకూలంగా మారాయి.
ఎన్డీఏ కూటమి ప్రచారాంశాలు :
బీజేపీ బంగ్లాదేశీయుల అక్రమ వలసలను ప్రధాన ప్రచారాంశంగా ఎత్తుకుంది. ముస్లింలను లక్ష్యంగా చేసుకొని హిందూ, ఆదివాసీల వోట్లను ఆకట్టుకునేందుకు ‘బాటేంగే తో కాటేంగే’ నినాదాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. కొన్ని చోట్ల ఈ ప్రచారం బీజేపీకి అనుకూలంగా కూడా మారింది. యూనిఫామ్ సివిల్ కోడ్ తో పాటు ఆదివాసీల సంస్కృతి, గుర్తింపు కాపాడుతామని ఎన్డీఏ ప్రచారం చేసింది. రాష్ట్రంలో మహిళలకు ‘గోగో దీదీ యోజన’ పథకం కింద రూ.2100 అందజేస్తామని, దీపావళి, రక్షాబంధన్ పండుగ సందర్భంగా ఉచిత ఎల్పీజీ సిలిండర్లు ఇస్తామని ప్రకటించింది. యువతకు 5 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, 2.1 మిలియన్ల కుటుంబాలకు నీటి కనెక్షన్లు కల్పిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. కూటమిలో సీట్ల పంపంకంతో పాటు అభ్యర్థుల ప్రకటన, పోల్ మేనేజ్మెంట్లో కూడా బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో ‘ఇండియా’ కంటే ఎన్డీఏకు సానుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. బీజేపీ జాతీయ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ప్రధానంగా అస్సాం సీఎం హేమంత్ బిశ్వ శర్మ జార?ండ్లో అన్నీ తాన్కె వ్యవహరించారు. జార?ండ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పీపుల్ పల్స్ సంస్థ 8120 సాంపిల్స్‌తో ఎగ్జిట్ పోల్ సర్వే నిర్వహించింది. సంస్థ డ్కెరెక్టర్ ఆర్. దిలీప్ రెడ్డి నేతృత్వంలో సీనియర్ రీసెర్చర్లు జి.మురళీ కృష్ణ, ప్రదీప్, ఐ.వీ.మురళీ కృష్ణ శర్మ ఎగ్జిట్ పోల్ రిపోర్టును రూపొందించారు.