కొమురవెల్లి, ప్రజాతంత్ర, మార్చి 2 : మహాశివరాత్రి తర్వాత వొచ్చిన మొదటి ఆదివారం కావడంతో కొమురవెల్లి మల్లన్న దేవాలయానికి (Komuravelli Temple) భక్తులు పోటెత్తారు. శివసత్తుల నృత్యాలతో, గంగరేణి చెట్టు కింద పలువురు భక్తులు పట్నం వేశారు. దైవ దర్శనం కోసం క్యూ లైన్ లో భక్తులు గంటల తరబడి నిల్చొని మల్లన్న దేవుడిని దర్శించుకున్నారు. పోలీసులు ఎలాంటి సమస్యలు లేకుండా చర్యలు చేపట్టారు. మహాశివరాత్రికి ముందు మూడు ఆదివారాలు, మహాశివరాత్రి తర్వాత వచ్చే మూడు ఆదివారాలు కొమురవెల్లి మల్లికార్జున స్వామి దర్శనానికి అధిక భక్తులు వచ్చి స్వామివారి సన్నిధిలో పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకొని మల్లన్న స్వామివారి ఆశీస్సులు తీసుకుంటారు..
Komuravelli Temple | కొమురవెల్లికి పోటెత్తిన జనం
