దేశ అభ్యున్న‌తికి ఇందిరాగాంధీ ఎన‌లేని కృషి

దివంగ‌త ప్ర‌ధానికి సీఎం రేవంత్ నివాళి

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 30 :  ప్ర‌తి ర‌క్త‌పు బొట్టు దేశ ప‌టిష్ట‌త‌కు తోడ్ప‌డుతుంద‌ని ప్ర‌క‌టించిన మ‌హ‌నీయురాలు మాజీ ప్ర‌ధాన‌మంత్రి ఇందిరా గాంధీ అని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. మాజీ ప్ర‌ధాని ఇందిరా వ‌ర్ధంతిని పుర‌స్క‌రించుకొని ఆమె సేవ‌ల‌ను ముఖ్య‌మంత్రి స్మ‌రించుకున్నారు. త‌న ప్రాణాల‌కు ముప్పు పొంచి ఉంద‌ని తెలిసిన‌ప్ప‌టికీ దేశ స‌మ‌గ్ర‌త‌, స‌మైక‌త్య, ప‌టిష్ట‌త‌ కోసం క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకొని ముందుకు సాగార‌ని తెలిపారు.

రాజ‌భ‌ర‌ణాల ర‌ద్దు… బ్యాంకుల జాతీయీక‌ర‌ణ, 20 సూత్రాల కార్య‌క్రమం వంటి విప్ల‌వాత్మ‌క నిర్ణ‌యాల‌తో దేశ ప్ర‌గ‌తికి, పేద‌ల అభ్యున్న‌తికి ఇందిరా గాంధీ ఎంత‌గానో కృషి చేశార‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ‌లోని ప్ర‌జా ప్ర‌భుత్వం ఇందిర‌మ్మ పాల‌న‌ను ఆద‌ర్శంగా తీసుకుంద‌ని.. ఆ మ‌హ‌నీయురాలి స్ఫూర్తితోనే పేద‌ల అభ్యున్న‌తే ల‌క్ష్యంగా ఇందిర‌మ్మ ఇళ్లు కార్య‌క్ర‌మాన్ని చేప‌డుతున్నామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *