నేడు లక్షమంది మహిళలతో భారీ బహిరంగ సభ

•పరేడ్‌ ‌గ్రౌండ్‌ ‌లో మహిళా దినోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు
•మంత్రి సీతక్క అధ్యక్షతన సభ నిర్వహణ
•ముఖ్య అతిథిగా హాజరు కానున్న సీఎం రేవంత్‌ ‌రెడ్డి
•డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఇతర మంత్రులు
•ఇందిరా మహిళా శక్తి మిషన్‌-2025 ఆవిష్కరణ

హైదరాబాద్‌, ‌ప్రజతంత్ర, మార్చి 7 : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం పరేడ్‌ ‌గ్రౌండ్‌ ‌వేదికగా మహిళా సదస్సును తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తోంది. సభకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. పంచాయతీ రాజ్‌, ‌గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి సీతక్క ఆధ్యక్షతన సభ జరగనుంది. సభా వేదికగా లక్ష మంది మహిళల సమక్షంలో ఇందిరా మహిళా శక్తి మిషన్‌-2025 ‌ను సీఎం రేవంత్‌ ‌రెడ్డి ఆవిష్కరిస్తారు. మహిళా సంఘాలు ఈ ఏడాది సాధించిన విజయాలతో పాటు, మహిళా సాధికారత బలోపేతం కోసం ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమాలను ఇందిరా మహిళా శక్తి మిషన్‌-2025 ‌లో పొందుపరిచారు. అయితే ఇందిరా మహిళా శక్తి మిషన్‌-2025 ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు 32 జిల్లాల నుంచి మహిళా సంఘాల సభ్యులు పెద్దఎత్తున వొచ్చే వకాశాలుండటంతో.. పంచాయతీ రాజ్‌, ‌గ్రామీణాభివృద్ది శాఖ అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. మహిళా సభ్యులను సభకు ఆహ్వానిస్తూ మంత్రి సీతక్క స్వయంగా జిల్లా మహిళా సమాఖ్యలకు ఆహ్వానాలు పంపారు. గౌరవ అతిథులుగా హాజరై సభను సక్సెస్‌ ‌చేసి మహిళా సంక్షేమం కోసం పెద్ద పీట వేస్తున్నప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు.

600లకు పైగా ఆర్టీసీ బస్సులు
జిల్లాల నుంచి వొచ్చే మహిళల కోసం 600 కు పైగా ఆర్టీసీ బస్సులను సెర్ప్ అం‌దుబాటులో ఉంచింది. దీంతో పాటు జిల్లాకొక అధికారిని నియమించి బాధ్యతలు అప్పగించింది. మహిళలు ఇంటి నుంచి బయలుదేరినప్పటి నుంచి ఇంటికి సురక్షితంగా చేరుకునే వరకు ఈ అధికారులు సమన్వయం చేస్తారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల సదుపాయాలను కల్పించారు. సాయంత్రం ఐదు గంటలకు సభ ప్రారంభం కానున్న నేపథ్యంలో మహిళలంతా అరగంట ముందే సభా స్థలికి చేరుకునేలా ప్లాన్‌ ‌చేస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి మహిళలు వొచ్చే అవకాశాలుండటంతో ఏడున్నర గంటల లోపు సభను ముగించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

అధికారులకు మంత్రి సీతక్క సూచనలు
సభ ఏర్పాట్లపై మంత్రి సీతక్క శుక్రవారం పరేడ్‌ ‌గ్రౌండ్‌ ‌ను సందర్శించి అధికారులకు సూచనలు చేశారు. సభకు వొచ్చే మహిళలకు ఎలాంటి అసౌకర్యం జరక్కుండా ఏర్పాటు చేయాలని సూచించారు. తాగునీరు, విద్యుత్‌ ‌నిరంతరాయంగా అందేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సచివాలయంలో జిల్లా డీఆర్డీఏ, జిల్లా మహిళా సమాఖ్య సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ ‌నిర్వహించారు. వేసవి కాలమైనందున జాగ్రత్తలు పాటించాలని కోరారు. వాటర్‌ ‌బాటిల్స్, ‌టవల్స్ ‌ప్రతి ఒక్కరి వద్ద ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
కార్యక్రమ వివరాలు ఇవీ
మహిళా సాధికారత, ప్రభుత్వ కృషి, మహిళా సంఘాల విజయాలపై కల్చరల్‌ ‌ప్రోగ్రాంలు, పాటలు, మండల మహిళా సమైక్య సంఘాలచే నడిచే 150 ఆర్టీసీ అద్దె బస్సులను పచ్చజెండా ఊపి సీఎం, మంత్రులు ప్రారంభిస్తారు. మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శిస్తారు. అనంతరం  సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రుల ప్రసంగాలు ఉంటాయి.  వేదికపై 31 జిల్లా సమాఖ్యలచే 31 జిల్లాల్లో పెట్రోల్‌ ‌బంకుల ఏర్పాటు కోసం అయిల్‌ ‌కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటారు.  మహిళా సంఘ సభ్యులకు లోన్‌ ‌బీమా, ప్రమాద బీమా చెక్కులను అందజేస్తారు. మహిళా సంఘాలకు రుణ సదుపాయిన్ని కల్పిస్తూ చెక్కును జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షులకు అందిస్తారు. జిల్లా మహిళా సమాఖ్య సభ్యులకు యునిఫాం చీరల పంపిణీ కార్యక్రమం ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page