పాట ఉన్నంత కాలం గద్దర్‌ సజీవంగా ఉంటారు..

  • త‌న పాట‌ల‌తో సమాజాన్ని ఉర్రుతలూగించి గొప్ప ప్ర‌జా గాయ‌కుడు
  • ప్రతీ పోరాటంలో న్యాయం వైపున నిలిచి అన్యాయాన్ని ప్రశ్నించారు.
  • గద్దర్‌ సాహిత్యం పుస్తకావిష్కరణలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 15 : ఐదు దశాబ్దాల‌లో జరిగిన ప్రతీ పోరాటంలో ప్ర‌జా గాయ‌కుడు గద్దరన్న ఉన్నాడ‌ని, విప్లవ ఉద్యమం, తెలంగాణ ఉద్యమం, దళిత ఉద్యమం ప్రతీ దాంట్లో న్యాయం వైపున నిలిచి అన్యాయాన్ని ప్రశ్నించాడని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్ రావు అన్నారు. గద్దరన్న(Gaddar)  అర్ధ శాతాబ్దపు పోరాటం.. పదవులకోసం ఆశపడకుండా తన తండ్రి పోరాటాన్ని, చరిత్రను రేపటి భావితరానికి అందించడానికి మంచి ప్రయత్నాన్ని సూర్యం తీసుకున్నారని కొనియాడారు. గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సిద్దిపేటలో గద్దర్‌ రచనల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి హరీశ్‌రావు హాజరై మాట్లాడుతూ..
మలిదశ ఉద్యమంలో గద్దర్ అన్నను కలిసే అదృష్టం కలిగింది. 100 ఉపన్యాసాల సారం గద్దరన్న ఒక్క పాట. చాల సామాన్య పదాలతో ప్రజల హృదయాలల్లోకి చేరే విధంగా గద్దర్ పాటలు ఉంటాయి. గద్దర్‌ భౌతికంగా మన మధ్య లేకపోయినా పాట ఉన్నన్ని రోజులు ఆయ‌న సజీవంగానే ఉంటాడని అన్నారు.

పొడుస్తున్న పొద్దుమీద పాట తెలంగాణ ఉద్యమాన్ని, సమాజాన్ని ఉర్రుతలూగించి ప్రజల్లో ఛైతన్యన్ని నింపిందని హరీష్ రావు తెలిపారు. 2008లో తెలంగాణ కోసం రాజీనామా చేసిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను, ఎంపిలపై తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి అభ్యర్థులను పెట్టాలని నిర్ణయిస్తే అది తప్పని వాదించిన వ్యక్తి గద్దర్. తెలంగాణ ఉద్యమానికి, కెసిఆర్ కి అండగా కూడా గద్దర్ నిలబడ్డారు. తూప్రాన్ లో నీళ్లులేవు హల్దీ వాగులో నుంచి వాటిక చెరువు కి లిఫ్ట్ పెట్టాలని గద్దర్ కోరితే..8 నెలల్లో పూర్తి చేసి ఆయనతోనే ప్రారంభించాం. తెలంగాణ వచ్చాక జీహెచ్ఎంసీ మున్సిపల్ కార్మికులకు కనీస వెతలు అమలు కావడం లేదని గద్దర్ లెటర్ రాస్తే కెసిఆర్ వారికి వెంట‌నే ఒక్క సంతకంతో జీతాలు పెంచారు. అది గద్దర్ కి కెసిఆర్ ఇచ్చిన గౌరవం. సిద్దిపేటలో గద్దరన్న విగ్రహం పెట్టడం మాకు చాల గౌరవం. పెట్టించే బాధ్యత నాది. గద్దరన్న జీవిత చరిత్రపైన ఒక డాక్యుమెంటరీ చేయండి.. నేను సహకారం అందిస్తా. స్వతంత్రం వొచ్చి ఇన్ని ఏళ్ళు అవుతున్నా ఇంకా సమాజంలో అసమానతలు ఉన్నాయి అవి చెగిరిపోవాలంటే గద్దరన్న ఆలోచలు ముందుకు తీసుకోవాలని పిలుపునిచ్చారు.

. ఎక్క‌డ‌ ప్రభుత్వం అణిచివేత ఉంటుందోదో అక్కడ ప్రభుత్వ అవార్డులకు అర్థం లేదు అనే మాట ఆనాడే గద్దర్ చెప్పారుజ.. నేడు నందిని సిద్ద రెడ్డి తిరస్కరించి చూపించారు. తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి తెలంగాణ తల్లి చేతిలో బతుక‌మ్మను మాయం చేసిన రేవంత్ రెడ్డి అవార్డు ఇస్తే తృణప్రాయంగా తిరస్కరించిన నందిని సిద్దారెడ్డి మన సిద్ధిపేట బిడ్డ కావడం నిజంగా గర్వకారణం. త్వరలోనే గద్దర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని ఒక భారీ బహిరంగ సభను సిద్దిపేటలో నిర్వహించుకుందాం అని హ‌రీష్ రావు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *