గాంధేయవాదం సమాధికి గాడ్సే అనుచరుల కుట్ర

హిందు రాష్ట్ర సాధన కోసం గాంధీజీ సిద్ధాంతాలపై దాడిని పెంచారు. తమ లక్ష్య సాధనకు గాంధీ భావజాలంపై దాడి మాత్రమే ద్వారా సాధ్యమవు తుందని కలలు కంటున్నారు. హిందూ రాష్ట్ర సాధన ద్వారా భారత్ చరిత్రను తిరిగి రాయాలని భావిస్తున్నారు. హిందుత్వ పిడివాదులు మహాత్మా గాంధీ హత్యను, గాడ్సే విధానాలను బాహాటంగానే సమర్థిస్తారు. అందులో మరో అనుమానానికి తావు లేదు. తమ శక్తిని పెంచుకుంటూ హిందుత్వ సిద్దాంతాల ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. తద్వారా మహాత్మాగాంధీ విధానాలపై బురద జల్లుతున్నారు. గాంధీ జీవితంపై కళంకాన్ని ఆపాదిస్తున్నారు.

భారతీయుల గుండెల్లో చిరస్థాయిగా ఉండే గాంధీ సిద్దాంతాలు

రాజకీయాలు సంక్లిష్టమైనవి, విచిత్రమైనవి, క్రూరమైనవి. ఎప్పుడూ ఒకే రకంగా ఉండవు. కాలప్రవాహంలో రాజకీయాలు తన స్వరూపాన్ని, గతిని మార్చుకుంటాయి. మన జాతిపిత మహాత్మాగాంధీ 155వ జయంతి దేశ వ్యాప్తంగా అక్టోబర్ 2వ తేదీన ఘనంగా జరుపుకున్నాం. ఒక్కోసారి మనం మంచిగా అనుకున్నవన్నీ కాలక్రమంలో రూటు మార్చుకుని అనేక అనూహ్యపరిణామాలకు దారితీస్తుంటాయి. గాంధీ హంతకులు నాథూరాం గాడ్సే, ఇంకా ఆయన ప్రవచించిన హిందుత్వ సిద్ధాంతం ఈ రోజు దేశ వ్యాప్తంగా ఒక బలమైన శక్తిగా అవతరించింది. ఇది జాతీయ విధానంగా ప్రకటించేందుకు తగిన ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. హిందుత్వ సిద్ధాంతానికి ప్రాముఖ్యత ఇచ్చే లక్ష్యంతో గాంధేయవాదాన్ని బలహీనపరిచేందుకు అగౌరవపరిచేందుకు శరవేగంగా ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. మతం అనేది భారత రాజకీయాల్లో విడదీయలేని భాగంగా మారింది. కాలక్రమంలో మహాత్మాగాంధీని మర్చిపోయే పరిస్థితి వొచ్చిందనుకుంటే, 1982లో గాంధీ పేరుతో వొచ్చిన సినిమా దేశంలో ఆలోచనాపరుల ఆలోచనా తీరును మార్చింది. అదే రీతిలో గాంధీ గురించి తప్పుడు సమాచారం, నీలాపనిందలు వేసే ప్రచారం జోరందుకుంది. ఈ రోజు దేశంలో ఆలోచన తీరు ఎలా ఉందో చూస్తే ఒళ్లు గగుర్పాటుకు గురవుతుంది. గాంధీ హంతకుడు గాడ్సే చెప్పిందే నిజం, హిందుత్వ విధానం సమంజసమైందనే వాదన విస్తృతమైంది. భారత్ కు గాంధీ ద్రోహం చేశారనే వాదనకు బలం చేకూర్చే విధంగా కొంత మంది నేతలు ప్రజలను నమ్మబలుకుతున్నారు. గాడ్సే దేశ భక్తుడు, జాతీయ వాది అని, దేశం కోసం ప్రాణాలర్పించిన మహానేతని, గాంధీ హత్యకు దారి తీసిన కారణాలు దేశ భక్తితో కూడినవనే విపరీతమైన ఆలోచనలు, ధోరణులను నమ్మడం ఫ్యాషన్ గా మారింది. మహాత్మాగాంధీ ప్రవచనాలు, సిద్ధాంతాల పట్ల విషం చిమ్ముతు న్నారు.

గాడ్సే వీరుడని, హీరో అనే ప్రచారం పెరిగింది. దేశంలో అనేక మంది హిందుత్వ జాతీయవాదుల తరహాలోనే గాంధీని గాడ్సే విశ్వసించారు. పాకిస్తాన్ ఆవిర్భావాన్ని కూడా అంగీకరించారు. ఈ రోజు అనేక మంది గాంధీ ముస్లిం మైనార్టీల పట్ల బుజ్జగింపు ధోరణితో వ్యవహరించారని విశ్వసిస్తారు. దేశ విభజన సమయంలో పాక్ ఏర్పాటును మహాత్మాగాంధీ సమర్థించారనే వారు చాలా మంది ఉన్నారు. దేశ విభజనకు మహాత్మాగాంధీ చర్యలే కారణమని, పాకిస్తాన్ ఏర్పాటైందంటే అందుకు గాంధీ కారణమని వాదించే వారున్నారు. గాంధీ జీవించి ఉన్న కాలంలో గాంధీ అప్పటి కాలానుగుణంగానే వ్యవహరించారు. మతసామరస్యం, అహింసావాదం అనే రెండు సిద్ధాంతాలకు కట్టుబడి జీవించి ఉన్నంత వరకు మహాత్మాగాంధీ కట్టుబడి ఉన్నారు. ఏ రోజు తన సిద్ధాంతాన్ని గాంధీజీ అతిక్రమించలేదు. మత సంఘర్షణలు వొద్దని, మత సామరస్యంతోనే, సోదరుల వలె కలిసిమెలిసి ఉండవొచ్చని మహాత్మాగాంధీ తాను ఆలోచించింది చెప్పారు. చెప్పిన అంశాలను గాంధీ అమలు చేసి చూపించారు. హిందుత్వ వాదుల్లో కొంత మందికి గాంధీ విధానాలు నచ్చవు. హిందువుల ఆకాంక్షలను గాంధీ గౌరవించలేదని వారి అభియోగం. దేశ విభజన జరిగిన సమయంలో జరిగిన హింస తెలిసిందే. తమ స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో చివరి వరకు మహాత్మాగాంధీ మత పరమైన మెజార్టీ ఉన్న వారిదే పై చేయి అనే వాదనను విశ్వసించలేదు. మతసామరస్యం, అహింసావాదం అనే వాటిని గట్టిగా నమ్ముకుని స్వాతంత్య్ర ఉద్యమంలో ముందుకెళ్లారు.

వీటిన్నింటి నేపథ్యంలో భారతీయులు 155వ గాంధీ జయంతిని జరుపుకున్నాం. ఈ రోజు గాంధేయవాదం ఎంత వరకు పాటిస్తున్నాం. నిజంగా జనం ఆయన సైద్ధాంతిక వాదాలను విశ్వసిస్తున్నారా ? మత సామరస్యం అనే నమ్మకాన్ని ఎంత వరకు పాటిస్తున్నామనే అంశంపై లోతైన చర్చ జర గాలి. తన జీవిత కాలంలో బ్రిటిష్ చెర నుంచి భారత్ కు విముక్తి కల్పించారు. చివరకు తాను నమ్ముకున్న సిద్ధాంతాల చేతిలోనే గాంధీ ప్రాణాలు వదిలారు. ఈ రోజు గాంధేయవాదానికి తూట్లు పొడుస్తున్నాం. భారతీయ సామాజిక, రాజకీయ, ఆర్థిక చిత్రపటం గతాన్ని, వర్తమానం, భవిష్యత్తును మహాత్మాగాంధీ సిద్ధాంతాలు శాసించాయి. మనం ఎప్పటికీ గాంధీ జీవిత లక్ష్యాలు, సిద్ధాంతాల శక్తి నుంచి తప్పించుకోలేం. ఆయన భావజాలం అజరామరమైనది.

హిందు రాష్ట్ర సాధన కోసం గాంధీజీ సిద్ధాంతాలపై దాడిని పెంచారు. తమ లక్ష్య సాధనకు గాంధీ భావజాలంపై దాడి మాత్రమే ద్వారా సాధ్యమవు తుందని కలలు కంటున్నారు. హిందూ రాష్ట్ర సాధన ద్వారా భారత్ చరిత్రను తిరిగి రాయాలని భావిస్తున్నారు. హిందుత్వ పిడివాదులు మహాత్మా గాంధీ హత్యను, గాడ్సే విధానాలను బాహాటంగానే సమర్థిస్తారు. అందులో మరో అనుమానానికి తావు లేదు. తమ శక్తిని పెంచుకుంటూ హిందుత్వ సిద్దాంతాల ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. తద్వారా మహాత్మాగాంధీ విధానాలపై బురద జల్లుతున్నారు. గాంధీ జీవితంపై కళంకాన్ని ఆపాదిస్తున్నారు. తమకు అనుకూలంగా స్వాతంత్య్ర ఉద్యమ చరిత్రను మలుచుకుంటున్నారు. గాంధీ విధానాలకు మరకలను అంటించేందుకు హిందుత్వ పిడి వాదులు అన్ని రకాలుగా దిగజారుతున్నారు. ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీకి జీవనాడి గాంధేయ సిద్ధాంతాలే. అందుకే కాంగ్రెస్ పార్టీపై ఉన్న అక్కసును తీర్చుకునేందుకు గాంధీని టార్గెట్ చేస్తున్నారు. మన జాతి పిత మహాత్మాగాంధీ గాంధేయవాదానికి భారతీయ ప్రజల్లో తిరుగు లేని శాశ్వత గౌరవ స్థానం ఉంది. నెహ్రూ విధానాలను, చరిత్రపై దాడిని పెంచారు. కాని నెహ్రూ విధానాల ఉన్నతతత్వాన్ని చెరిపివేయలేకపో తున్నారు.

గాంధీపై ఉన్న ద్వేషంతో క్రమ పద్ధతి ప్రకార నాథూరాం గాడ్సే ఆలోచనా భావాలు, సిద్ధాంతాల ప్రచారాన్ని చాప కింద నీరులా వ్యాపింప చేయడానికి హిందుత్వ వాదులు కంకణం కట్టుకున్నారు. గాంధేయవాదం సజీవమైనది. ముమ్మాటికీ సత్యం. ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానాన్ని పొందిన గాంధేయవాదాన్ని నిర్మూలించేందుకు గాడ్సే అనుచరులు చేస్తున్న ప్రయత్నాలు, ఎత్తుగడలు ఫలించవు. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. సామాన్య భారతీయుడి ఆలోచన విధానాలే గాంధేయ వాదం. ఈ వాదం ఎల్లప్పుడూ జీవించే ఉంటుంది. గాంధేయవాదంలో చలనం ఉంటుంది. స్వాతంత్య్ర సమర ఘట్టంలో మహాత్మాగాంధీ పోరాటం, ఘటనలను చరిత్ర నుంచి ఎవరూ వేరు చేయలేరు. గాంధేయవాదంలో మతసామరస్యం, వసుదైవ కుటుంబం అనే పవిత్ర సిద్ధాంతాలు సజీవంగా ఉంటాయి. వీటిని ఎవరూ సమాధి చేయలేరు. వీటి జోలికి వొచ్చిన వారు తీవ్రమైన పరిణా మాలను చవిచూడాల్సి ఉంటుంది. కాని దురదృష్టవశాత్తు గాంధేయవాదం పై దాడి తీవ్రమైంది. ప్రతి భారతీయులు గర్జించాల్సిన విషయమిది. ఈ సమయంలో మనం 155వ గాంధీ జయంతి జరుపుకున్నాం. గాంధీ సిద్ధాంతాలను భారతీయుల హృదయాల నుంచి వేరు చేసే ప్రయత్నాలు చిత్తుగా విఫలమవుతాయి.
-శామ్ సుందర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page