•రోడ్డుపై బైఠాయించి బిఆర్‌ఎస్ కార్యకర్తల నిరసన
మహబూబ్‌నగర్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 27 : ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు వద్దకు మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీశ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్‌తో పాటు మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్ రెడ్డితో పాటు పలువురు నేతలు చేరుకున్నారు. అయితే సొరం గంలోకి వెళ్లనీయకుండా హరీష్ రావు బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో హరీష్ రావు, ఇతర నాయకులు రోడ్డుపైనే బైఠాయించిన నిరసన తెలిపారు. పోలీసుల తీరుపై హరీష్ రావు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
ఎస్‌ఎల్‌బీసీ ప్రమాద ఘటనను పరిశీలించేందుకు మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలకు చెందిన బీఆర్‌ఎస్ నేతలు హైదరాబాద్ నుంచి గురువారం బయల్దేరిన సంగతి తెలిసిందే. కల్వకుర్తిలో బీఆర్‌ఎస్ నేతలతో కలిసి హరీశ్‌రావు టీ తాగారు. అనంతరం అక్కడ్నుంచి నేరుగా ఎస్‌ఎల్బీసీ సొరంగం వద్దకు చేరుకున్నప్పటికీ.. లోపలికి పోలీసులు అనుమతించడం లేదు. భారీగా పోలీసులు మోహరించారు. మీడియాపై కూడా పోలీసులు ఆంక్షలు విధించారు.