సామాజిక న్యాయ స్థాపన నిరంతర ప్రక్రియ

నేడు ప్రపంచ సామాజిక న్యాయ  దినోత్సవం

ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ 2009 నుంచి ఫిబ్రవరి 20న ఏటా ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించింది. ఇదిసమాజాల మధ్య సంఘీభావం, సామరస్యం, సమాన అవకాశాలను ప్రోత్సహిం చడానికి, పేదరికం, నిరుద్యోగాన్ని తొలగించడం  ప్రాముఖ్యతను గుర్తిం చడంపై దృష్టి పెడుతుంది. ఐక్యరాజ్యసమితి, అమెరికన్‌ ‌లైబ్రరీ అసోసియేషన్‌, అం‌తర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ ‌సహా అనేక సంస్థలు  సామాజిక పేదరికం, నిరుద్యోగాన్ని తొలగించడం ద్వారా అవసరమైన ప్రణాళికల ప్రాముఖ్యతపై విధానాలు రూపొం దిస్తున్నాయి.

ఈ 2025 సంవత్సరం   ప్రపంచసా మాజిక న్యాయదినోత్సవం  పిలుపు‘‘క్రమబద్ధమైన  అసమా నతలను నిర్వహించడంలో సమగ్ర విధానాలు సామాజిక రక్షణ ప్రాముఖ్యతను నొక్కి చెప్పడం’’ (ఎంపవర్‌ ఇం‌క్లూజన్‌: ‌బ్రిడ్జింగ్‌ ‌గ్యాప్స్ ‌ఫర్‌ ‌సోషల్‌ ‌జస్టిస్‌). ఈ ‌సందర్భంగా విద్యార్థులకు బాల్య పేదరికం, ప్రపంచ పౌరసత్వం, మానవ హక్కులు, స్థిరమైన అభివృద్ధి  వంటి సామాజిక న్యాయం  ఆవశ్యకత గురించి బోధించడానికి అనువైన అంశాలు. ఐక్యరాజ్యసమితి ఇతర కార్యక్రమాలతో దేశాల వారీగా అందుబాటులో ఉంది. తద్వారా విద్యార్థులు తమ ఆలోచనలు మరియు అనుభవాలను పంచుకునే అవకాశం ఉంటుంది. సామాజిక న్యాయం కోసం ఎన్నికైన అధికారులను సంప్రదించడం, సామాజిక న్యాయాన్ని  ప్రోత్సహించే సంస్థలకు, విధానాలకు మద్దతు సమయం, నైపుణ్యాలు  లేదా వనరులను విరాళంగా అందించడం వంటి కార్యకలాపాలు జరపాలి.

సామాజిక న్యాయ సమస్యలు అనేక ప్రాంతాలలో ఉన్నాయి. సామాజిక న్యాయ సమస్య లైన జాతి, లింగం, వయస్సు, లైంగిక ధోరణి, మతం, జాతీయత, విద్య, మానసిక లేదా శారీరక సామర్థ్యం వంటి అంశాలలో పక్షపాతాల నుండి ఉత్పన్నమవుతాయి. సామాజిక న్యాయం లేకపోవ డానికి గల కారణాలలో వలసవాదం, బానిసత్వం, లేదా అణచివేత ప్రభుత్వాలకు  మద్దతు, ఆర్థిక అధికార దుర్వినియోగం, జాత్యహంకారం, ఆర్థిక అసమానత, వర్గ వివక్ష ఉన్నాయి.  దేశాలలో సామాజిక న్యాయాన్ని అంచనా వేయడం అనేది సమానత్వం, వనరులకు ప్రాముఖ్యత, హక్కుల రక్షణ వంటి అంశాలను, వ్యక్తిగత, పౌర స్వేచ్ఛల స్థాయిని మూల్యాంకనం చేసే వివిధ సూచికలను పరిశీలించడం. అనేక దేశాల్లో, అధిక శిక్షలు, మానవ హక్కుల ఉల్లంఘనలు సామాజిక న్యాయం  అవసరాన్నిమరింత పెంచుతున్నాయి.. 2024 నాటికి, సామాజిక న్యాయం కలిగిన మొదటి ఐదు దేశాలు స్విట్జర్లాండ్‌,‌న్యూజిలాండ్‌, ‌డెన్మార్క్, ‌లక్సెంబర్గ్, ఐర్లాండ్‌. ‌ప్రపంచంలో మానవ హక్కులు, న్యాయం పొందడం అవినీతి వంటి అంశాల ఆధారంగా అట్టడుగు స్థానంలో ఉన్న దేశాలు వెనిజులా, కంబోడియా, ఆఫ్ఘనిస్తాన్‌, ‌హైతీ, మయన్మార్‌. ‌భారతదేశంలో సామాజిక న్యాయాన్నినెలకొల్పడంలో డాక్టర్‌ ‌బి.ఆర్‌. అం‌బేడ్కర్‌  ‌కృషి అపారమైనది. అందుకే భారత సామాజిక న్యాయ పితామహుడు గా.ఆయనను గౌరవిస్తున్నాం .

భారతదేశంలో రాజ్యాంగం పీఠిక సామాజిక న్యాయం కోసం దోహదపడే తత్వశాస్త్రాన్ని కలిగి ఉంది. భారతదేశ ప్రజలు రాజ్యాంగంలోని 42వ సవరణ ద్వారా పొందుపరచబడిన సామ్యవాద, లౌకిక రాజ్యంగా సార్వభౌమాధికార , ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాన్ని ఏర్పరచుకున్నారు. తద్వారా పౌరులకు న్యాయం, సామాజిక, ఆర్థిక రాజకీయ స్వేచ్ఛ, సమానత్వం సౌభ్రాతృత్వంతో పాటు రాజకీయ న్యాయం, సామాజిక ఆర్థిక అంశాలకు ప్రాధాన్యత సూచిం• •బడుతున్నది. భారతదేశంలో సామాజిక న్యాయాన్ని నెలకొల్పడంలో మూడు అంశాలు ఉన్నాయి, ఒకటి ప్రాథమిక హక్కులు, నిర్దేశక సూత్రాల రూపంలో రాజకీయ సామాజిక-ఆర్థిక హక్కులను కల్పించడం. ఇది సమాన స్వేచ్ఛ సూత్రం పెంపొందించడానికి ప్రయ త్నిస్తుంది, రెండవది సామాజిక-ఆర్థిక అభివృద్ధి మధ్య విరుద్ధమైన సామాజిక-ఆర్థిక లక్ష్యాల మధ్య సమాన నమూనాను అవలంబించడం. ఇది అవకాశాల  న్యాయమైన సమానత్వ సూత్రాన్ని స్థాపించడానికి ప్రయత్నిస్తుంది. మూడవది, భారతీయ సమాజంలోని వెనుక బడినవర్గాలకు ప్రత్యేక రక్షణలు , నిశ్చయాత్మక చర్యలను అందించడం. ఇందుకోసం దేశంలో ఎప్ప• •కప్పుడు అనేక కార్యక్రమాలు, పథకాలు, చట్టాలు రూపొందించి అమలు చేస్తున్నారు.

ప్రాథమిక స్థాయిలో సామాజిక న్యాయం  అనేది ప్రజలందరిది. అంతర్జాతీయ సమాజం, ముఖ్యంగా అత్యంత సంపన్నులు ఆ అన్యాయాలను పరిష్కరి ంచాలి. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్నదేశాలు వెనుకబడిన, అట్టడుగు జనాభాకు సామాజిక న్యాయాన్ని నెలకొల్పడం కోసం సంపద, అవకాశాలు,అధికారాల సమాన పంపిణీ, వోటింగ్‌ ‌హక్కులు, క్రిమినల్జస్టిస్‌ / ‌జువెనైల్‌ ‌జస్టిస్‌, ‌పర్యావరణ న్యాయం, ఇమ్మిగ్రేషన్‌, ఆర్థిక న్యాయం వంటి సూత్రాలు ఖచ్చితంగా పాటించాలి. సామాజిక న్యాయం కోసం దేశాల మధ్య సహకారం చాలా కీలకం. ప్రతి దేశంలోనూ, కొన్నిసార్లు గ్రామాలవారీగానూ వేర్వేరుగా అన్యాయంపై పోరాడడం చాలా కీలకం. ఇంకా, ప్రధానంగా ఆర్థిక విధానాన్ని నిర్ణయించడం దాని అమలుకు హామీ ఇవ్వడం, ముఖ్యంగా సామాజిక, ఆర్థిక ప్రణాళిక, ద్రవ్య, ఆర్థిక చర్యలు, ప్రజా అధికారాన్ని ఉపయోగించడం మొద లయినవి చాలా ముఖ్యం. చారిత్రాత్మక అన్యాయాలను పరిష్కరించడం ద్వారా, తక్కువ వర్గాలకు వనరులను అందించడం ద్వారా, సామాజిక న్యాయ సమాజాన్ని స్థాపించాలని  ఆశిద్దాం.
– డాక్టర్‌. ‌పి.ఎస్‌. ‌చారి
కరకంబాడి,తిరుపతి, 8309082823

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page