డ్రోన్స్ సహాయంతో వ్యవసాయం వల్ల రైతులకు పెట్టుబడులు తగ్గి లాభదాయకంగా మారుతుంది. డ్రోన్స్ వినియోగం వల్ల రైతులకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.శక్తివంతమైన సెన్సార్లు,హై రిసొల్యూషన్ కెమెరాలతో డ్రోన్లు రైతులు పండించే పంటలకు పట్టిన చీడపీడలు, పోషకాహార లోపాలు, నీటికొరత వంటి సమస్యలను గుర్తించవచ్చు.పంటలకు ఎరువులు,పురుగుమందులు పిచికారీ చేయడం,పంటల పెరుగుదలను పర్యవేక్షించడం,పంటల ఆరోగ్యం, నేల వైవిధ్యం, దిగుబడి అంచనాలపై సమాచారం సేకరించడం, పం టలకు నీళ్ళలో కరిగిపోగల ఎరువులు పిచికారీ చేయడం,పంటలకు కలుపు మందులు పిచికారీ చేయడం పంట పరిస్థితులను బట్టి రసాయనాల పరిమాణాన్ని సర్దుబాటు చేయడం వంటి వాటిని డ్రోన్ల ద్వారా చేయొచ్చు.ఇదేకాక డ్రోన్ సీడర్ల ద్వారా విత్తనాలను నాటడం కూడా చేయవచ్చు.ఆధునిక వ్యవసాయ డ్రోన్‌లు ఖచ్చితమైన నావిగేషన్ మరియు మ్యాపింగ్‌ను అనుమతించే అధునాతన జి పి ఎస్ వ్యవస్థలతో అమర్చబడి ఉంటాయి.ఈ సాంకే తికత అత్యంత ఖచ్చితమైన ఫీల్డ్ మ్యాప్‌లను రూపొందించడానికి అనుమ తిస్తుంది.
ఇవి ఇన్‌పుట్‌ల వేరియబుల్ రేట్ అప్లికేషన్‌లను అమలు చేయడానికి చాలా అవసరం.ప్రతి జోన్ యొక్క ప్రత్యేక అవసరాల ఆధారంగా రైతులు తమ పొలాలలోని నిర్దిష్ట ప్రాంతాలకు వివిధ మొత్తాలలో ఎరువులు లేదా పురుగుమందులను వేయడానికి ఈ మ్యాప్‌లను ఉపయోగించవచ్చు.దీనివల్ల లేబర్ అవసరాలు చాలా మట్టుకు తీరి, ఖర్చులు తగ్గించుకోవచ్చు.ఆర్థిక వ్యవస్థలోని దాదాపు ప్రతి రంగంలో డ్రోన్‌ల వాడకం వేగంగా పెరిగినప్పటికీ వ్యవసాయ రంగంలో డ్రోన్ వినియోగం జోరుగా పెరుగుతోంది.కొన్ని నివేదికల ప్రకారం ,వ్యవసాయ డ్రోన్ మార్కెట్ 2019లో రూ.1.2 బిలియన్ (యూ ఎస్ డి) పరిశ్రమ నుండి 2024లో రూ.4.8 బిలియన్లకు పెరిగిందని నివేదికలు చెబుతున్నాయి. డ్రోన్ ఇమేజరీ ఉపయోగాలలో మొక్కల ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం. నార్మలైజ్డ్ డిఫరెన్స్ వెజిటేషన్ ఇండెక్స్ (ఎన్‌డివిఐ) అని పిలువబడే ప్రత్యేక ఇమేజింగ్ పరికరాలతో కూడిన డ్రోన్‌లు మొక్కల ఆరోగ్యాన్ని సూచించడానికి వివరణాత్మక రంగు సమాచారాన్ని ఉపయో గిస్తాయి. ఇది రైతులు పంటలు పెరిగేకొద్దీ వాటిని పర్యవేక్షించడానికి ఉపయోగపడి, తద్వారా ఏవైనా సమస్యలు ఉంటే మొక్కలను కాపాడేంత త్వరగా పరిష్కరించవచ్చు.
ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి ‘రెగ్యులర్’ కెమెరాలను ఉపయోగించే డ్రోన్‌లను కూడా ఉపయోగిస్తారు.చాలా మంది రైతులు పంట పెరుగుదల,సాంద్రత మరియు రంగును పర్యవేక్షించడానికి ఉపయోగిస్తున్నారు.లేటెస్ట్‌గా ఉపగ్రహ చిత్రాల ద్వారా కూడా పరిశీలించవచ్చు కానీ ఇది అత్యంత ఖరీదైనది.పంట పర్యవేక్షణ, నీటిపారుదల నిర్వహణ, పంట ఆరోగ్య అంచనా,పశువుల పర్యవేక్షణ మరియు విపత్తు నిర్వహణ,జియో-ఫెన్సింగ్, పంట బయోమాస్ మరియు నష్టం వంటి అనేక మార్గాల్లో డ్రోన్‌లు ఉపయోగపడతాయి. వ్యవసాయంలో అంచనా, మిడుతల నియంత్రణ మరియు వస్తువుల రవాణా డ్రోన్ టెక్నాలజీని ప్రోత్సహించే దిశగా భారత ప్రభుత్వం ఎంత గానో కృషి చేస్తుంది.డ్రోన్ టెక్నాలజీ వినియోగంలో కొన్ని సవాళ్లను ఎదుర్కోవలిసి ఉంటుంది.
డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించడం వల్ల సమయం,శ్రమ,నీరు ఆదా అవుతుందని, రసాయనాలపై ఖర్చు తగ్గుతుందని వివిధ అధ్యాయానలు తెలుపుతున్నాయి.ఇది రసాయనాల వినియోగాన్ని తగ్గిస్తుంది మరియు మానవులకు రసాయనాలు బహిర్గతం కాకుండా చూస్తుంది. భారతదేశంలోని లక్షలాది మంది రైతుల వ్యవసాయ రంగాన్ని మరియు జీవితాన్ని మార్చడానికి డ్రోన్ సాంకేతికత యొక్క సామర్థ్యాన్ని ప్రభుత్వం సమర్థవంతంగా స్వీకరించి, ప్రతి ప్రభుత్వం ఉపయోగించుకోవాలని ఆశిద్దాం. రైతులకు సమర్థవంతమైన ఉత్పాదక,స్థిరమైన వ్యవసాయాన్ని చేయడానికి డ్రోన్లు రానున్న రోజుల్లో కీలకము కానున్నాయి.
డా. మోటె చిరంజీవి
సామాజిక వేత్త విశ్లేషకులు
9949194327