కొత్త ఆర్ఓఆర్ చట్టంతో ధరణి సమస్యలు పరిష్కారం..

ఫ్యామిలీ డిజిటల్ కార్డు ద్వారానే పేదలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తాం..
తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 
ఆమనగల్లు, ప్రజాతంత్ర, అక్టోబర్ 7 : గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం చేసిన ధరణి తప్పుల వల్ల పేద రైతులు భూ సమస్యల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతూ కష్టాలు పడుతున్నారని వారి కష్టాలు తీర్చడం కోసం ఇందిరమ్మ ప్రజా పలన ప్రభుత్వం కొత్త ఆర్ఓఆర్ చట్టం ద్వారా ధరణి సమస్యలన్నిటిని పరిష్కారం చూపుతోందని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం కడ్తాల మండల కేంద్రంలో డి ఎం ఎఫ్ టి నిధుల ద్వారా రూ.118 కోట్లతో నిర్మించిన నూతన తాహసిల్దార్ కార్యాలయ భవనాన్ని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, జిల్లా కలెక్టర్ శశాంక, ఇబ్రహీంపట్నం ఇంచార్జ్ ఆర్డిఓ తహసిల్దార్ ముంతాజ్ బేగం, డిసిసిబి డైరెక్టర్,  ఆమనగల్ సింగల్ విండో చైర్మన్ గంప వెంకటేష్ గుప్తా తో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం గీతా కార్మికులకు మంజూరు చేసిన కాటమయ్య కిట్లను  ఆమనగల్లు, కడ్తాల మండలాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణ  లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే, మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అద్దె భవనాల్లో కొనసాగుతున్న ఆర్డీవో, తహసిల్దార్ ప్రభుత్వ కార్యాలయాలకు స్థల సేకరణ చేసి సొంత భవనాలు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.
గత పదేండ్ల బిఆర్ఎస్ పాలనలో ధనిక రాష్ట్రమంతా అప్పుల పాలు చేశారని మార్పు కోసమే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇందిరమ్మ రాజ్య ప్రజాపాలనను కోరుకున్నారని గుర్తు చేశారు. గత ప్రభుత్వ పాలకులు ఏడు లక్షల పంతొమ్మిది వేల కోట్ల రూపాయలను అప్పుచేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి తీరుతామన్నారు. అదేవిధంగా 6 గ్యారంటీ హామీలలో నాలుగు హామీలను అమలు చేసి చూపించామన్నారు. త్వరలో మిగతా హామీలు అమలు చేస్తామని తెలిపారు. రైతన్నలకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి సుమారు రూ .31 వేల కోట్ల ఖర్చు అవుతుందని గుర్తించి ఇప్పటివరకు 18 వేల కోట్ల రుణమాఫీ జరిగిందని గుర్తు చేశారు. ఇంకా రుణమాఫీ కానీ రైతులు ఎవరున్నా అధైర్య పడవొద్దని వారందరికీ 13 వేల కోట్లు ఆపైన ఐదు 6 కోట్ల పైన అదనంగా ఖర్చు చేసి రుణమాఫీ ఉన్న రైతులకు రుణమాఫీ ని చేసి తీరుతామని శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. కొత్త ఆర్ఓఆర్ చట్టం మార్పులు ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకుల సూచనలు పరిగణలోకి తీసుకొని ధరణి సమస్యలు అన్నిటిన పరిష్కరిస్తామన్నారు. గత వైయస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన ఘనత తమ పార్టీదే అన్నారు. ప్రతి నియోజకవర్గానికి 3500 తక్కువ కాకుండా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయిస్తామన్నారు.
ఇంటి స్థలం లేని వారికి కూడా ఇంటి స్థలం తో పాటు ఇందిరమ్మ పక్క గృహం నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. ఫ్యామిలీ డిజిటల్ స్మార్ట్ కార్డు ద్వారా రేషన్ కార్డు, హెల్త్ కార్డు, వివిధ సంక్షేమ అభివృద్ధి పథకాలకు స్మార్ట్ కార్డు ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి చెప్పారు. పైలెట్ ప్రాజెక్టు లో భాగంగా కొన్ని గ్రామాలను ఎంపిక చేసి స్మార్ట్ కార్డ్ సర్వే నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి బీద వారందరికీ స్మార్ట్ కార్డ్ అందించి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. కడ్తాల్ మండల కేంద్రంలో 30 పడకల ప్రభుత్వ దవాఖాన , ఆర్డిఓ, జూనియర్ కళాశాల ఏర్పాటు చేసేందుకు కృషి చేసి భవనాల ఏర్పాటుకు నిధులు మంజూరు చేస్తామన్నారు. ఈ సమావేశంలో  రంగారెడ్డి డిసిసి అధ్యక్షులు చల్ల నరహారెడ్డి, టిపిసిసి సభ్యులు ఆయిళ్ల శ్రీనివాస్ గౌడ్, డిసిసి ఉపాధ్యక్షుడు గూడూరు శ్రీనివాస్ రెడ్డి, గూడూరు భాస్కర్ రెడ్డి, యాట నరసింహ, బాలాజీ సింగ్, జక్కు అనంతరెడ్డి, శ్రీపాతి శ్రీనివాస్ రెడ్డి, బట్టు కిషన్ రెడ్డి, హనుమా నాయక్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బిచ్య నాయక్, తెల్గ మల్ల జగన్,   కృష్ణ నాయక్, ఫరీద్, తాహసిల్దార్ లలిత, సిఐలు శివప్రసాద్, ప్రమోద్ కుమార్, బద్య నాథ్ చౌహాన్, ఎస్సైలు వరప్రసాద్, వెంకట్, శ్రీకాంత్ తదితరు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *