తదుపరి ఆర్మీ చీఫ్‌గా జనరల్‌ ‌ధీరజ్‌ ‌సేథ్‌

-‌కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

న్యూదిల్లీ, జూన్‌ 13:‌ ప్రస్తుతం వైస్‌ ‌చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న లెప్టినెంట్‌ ‌జనరల్‌ ‌ధీరజ్‌ ‌సేథ్‌ ‌ను తదుపరి చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌గా నియమిస్తూ భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఆర్మీ చీఫ్‌ ‌జనరల్‌ ఉపేంద్ర ద్వివేది ఈ ఏడాది జూన్‌ 30‌న పదవీ విరమణ చేయబోతున్నారు. ధీరజ్‌ ‌సేథ్‌ ‌జూన్‌ 30 ‌మధ్యాహ్నం నుంచి ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు. ఆయన పదవీకాలం 2028 ఆగస్టు 31 వరకు కొనసాగనుంది. నేషనల్‌ ‌డిఫెన్స్ అకాడ, ఖడక్వాస్లా పూర్వ విద్యార్థి అయిన ధీరజ్‌ ‌సేథ్‌ 1986‌లో భారత సైన్యంలో చేరారు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు సైన్యంలో వివిధ హోదాల్లో పని చేశారు. ధీరజ్‌ ‌సేథ్‌ ‌దక్షిణ కమాండ్‌, ‌దక్షిణ పశ్చిమ కమాండ్‌లకు సారథ్యం వహించడంతో పాటు, ఆర్మీ ప్రధాన కార్యాలయం లోనూ కీలక పదవులు చేపట్టారు. సైన్యంలో విశిష్ట సేవలకు గుర్తింపుగా ఆయనకు పరమ్‌ ‌విశిష్ట సేవా మెడల్‌, ఉత్తమ్‌ ‌యుద్ధ సేవా మెడల్‌, అతి విశిష్ట సేవా మెడల్‌ ‌వంటి ప్రతిష్ఠాత్మక పురస్కారాలు లభించాయి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *