ప్రతి ఉదయం నిద్రలేచింది మొదలు
నిదురకల్లతోనే నిను వేతుకుతుంటాను
మనసారా నిన్ను ముద్ధాడితే గానీ
నా ఉదయం మొదలవ్వదు
పొగలు గక్కుతున్న నిన్ను చూస్తుంటే
నా మెదట్లో సెగలు రేగుతాయి
ఎక్కడో వాన పడుతున్న
పక్కనే మట్టివాసన వచ్చినట్టు
నీవేక్కడో సలసలా మరుగుతున్నా
ఇక్కడ నాలో కోరిక రగులుతుంది
మరిగిస్తుంటే మారే నీ రంగు చూసి
మనసు పారేసుకోని మానవుడెవడన్న ఉన్నాడంటే
మతి తక్కువ వాడే బంగారం
చివరి బొట్టు తాగి కళ్ళుమూసుకుంటే
మదిలో మెదిలే నీ మధురానుభావన
ఎంత రాసినా ఒడువని ప్రేమకావ్యమే తెలుసా…
భూమి మీదంతా పాదం మోపిన
నీకోసం రాజ్యాలే తన్నుకు సచ్చినా
నీ ఘాటు,లేత రుచుల ముద్దుకోసం నేటికీ
ప్రతి రోజూ గిలగిలా కొట్టుకు చస్తారు సఖి
నిన్ను ఒడుపుకున్న పింగానో బంగారానిదో కాదు
తలెత్తి పొగరుగా పొగలుకక్కే నీది అసలు విలువ
నిన్ను గుటుకేసి పదమెత్తుకుంటే చెలీ
ప్రకృతి నిలపడి పరవశంతో ఊగిపోతదంటే నమ్ము
నిన్ను నడిమిట్ల పెట్టీ
ఏళ్ల నాటి శత్రువును శాంతింపజేసి సందిజేసుకోగలను
నిన్ను పందమేసి మరీ ప్రపంచాన్ని సవాలు చేయగలను
అనుకోని అతిథికైనా
నీ అధర చుంబనమే అతి మధురం
ఆకలి కడుపునకు నీవే
అమృత జలం ప్రియా…
దిలీప్.వి
ప్రభుత్వ ఉపాధ్యాయుడు
మల్లంపల్లి,ములుగు
సెల్: 8464030808