Category Crime

పిల్లలను బావిలోకి తోసి తల్లి ఆత్మహత్య

రంగారెడ్డి, ప్రజాతంత్ర, జూలై 17: రంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. శంకర్‌పల్లి మండలం కొత్తపల్లిలో ఇద్దరు పిల్లలను బావిలో తోసి, తల్లి ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వికారాబాద్‌ ‌జిల్లా తాండూర్‌కు చెందిన వసంత (35), సుధాకర్‌ ‌దంపతులు కొత్తపల్లికి వచ్చి స్థిరపడ్డారు. వీరికి ఇద్దరు పిల్లలు. కూతురు (15), కొడుకు (10) ఉన్నారు.…

ప్రేమను నిరాకరించిందని యువతి హత్య

– కర్నాటకలో యువకుడి దురాగతం బెంగళూరు,జూలై17:తన ప్రేమను నిరాకరించిందని ఉన్మాదిగా మారిన యువకుడు.. రద్దీగా ఉండే బస్టాండ్‌లో యువతిని దారుణంగా హత్య చేశాడు. కర్నాకటలో ఈ దుర్ఘటన జరిగింది. బాధితురాలు లావణ్యకు నిందితుడు చేతన్‌ ‌వరసకు బంధువు అవుతాడని సమాచారం. అతను కొంతకాలంగా లావణ్యను ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతుండగా, ఆమె అతని ప్రేమను నిరాకరించింది. దాంతో పగ…

హైదరాబాద్‌ ‌నుంచి కర్నాటకకు రేషన్‌ ‌బియ్యం

– ఐదుగురు వ్యక్తుల ముఠాను పట్టుకున్న పోలీసులు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 16: తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ ‌బియ్యం ముఠా గుట్ట రట్టు చేశారు గచ్చిబౌలి పోలీసులు. ఈ ముఠాకు చెందిన ఐదుగురు వ్యక్తులను పోలీసులు గురువారం అరెస్ట్ ‌చేశారు. వారి నుంచి 220 టన్నుల రేషన్‌ ‌బియ్యం, 40…

ఆత్మహత్య చేసుకున్న పోక్సో కేసు నిందితుడు

కామారెడ్డి, ప్రజాతంత్ర, జూలై 16 : కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం చింతామన్‌పల్లి గ్రామంలో యువకుడి ఆత్మహత్య కలకలం రేపింది. రంగబోయిన సందీప్‌ (23) గ్రామ శివారులోని ఓ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గతంలో పోక్సో కేసులో నిందితుడైన‌ ఇత‌ను ఇటీవలే జైలుకు వెళ్లి బెయిల్‌పై వచ్చాడు. అప్పటి నుంచి బాలిక తల్లిదండ్రులు తనను…

బాలికపై గ్యాంగ్‌రేప్ కేసులో ఐదుగురికి జీవిత ఖైదు

– బాధితురాలికి రూ.12 లక్షల పరిహారం – ఒక్కో నిందితుడికి రూ.20 వేల జరిమానా – జగిత్యాల ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక పోక్సో కోర్టు కీలక తీర్పు జగిత్యాల, ప్రజాతంత్ర, జూలై 15: మహిళలు, చిన్నారులపై లైంగిక నేరాలకు పాల్పడే వారికి గట్టి హెచ్చరికగా నిలిచే తీర్పును జగిత్యాల ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక పోక్సో కోర్టు…

భారీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు

– 80 తులాల బంగారం, 5.5 కిలోల వెండి స్వాధీనం.. – 63 కేసుల నిందితుడు అరెస్ట్ – దుబ్బాక పోలీసుల సక్సెస్ – ప్రత్యేక బృందాలను అభినందించిన సీపీ రష్మి  సిద్దిపేట, ప్రజాతంత్ర జూలై 15:  సిద్దిపేట జిల్లా దుబ్బాక పోలీస్‌స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన భారీ చోరీ కేసును సిద్దిపేట పోలీసులు అత్యంత…

బాబా అవతారంలో రౌడీ షీటర్‌

-‌ వలపన్ని పట్టుకున్న పోలీసులు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 14:  హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు బాబా అవతారం ఎత్తిన రౌడీషీటర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మహ్మద్‌ ‌జావేద్‌ అనే వ్యక్తి 2018లో సైఫాబాద్‌ ‌పోలీస్‌స్టేషన్‌ ‌పరిధిలో ఓ వ్యక్తిని రౌడీషీటర్‌ ‌హత్య చేశాడు. ఆపై పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్నాడు. హత్యపై కేసు నమోదు…

టాటా షోరూంలో భారీ అగ్ని ప్రమాదం

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, జులై 11 మాదాపూర్‌లోని ప్రముఖ టాటా మోటార్స్ షోరూమ్‌లో శనివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో షోరూమ్‌లోని పలు కొత్త కార్లు, ఫర్నిచర్‌తో పాటు విలువైన ఎలక్ట్రానిక్ పరికరాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రమాదంలో కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే ప్రమాద సమయంలో షోరూమ్‌లో…

బస్సు ఎత్తుకెళ్లిన తాగుబోతు

– అదుపుతప్పి సిమెంట్ దిమ్మెను ఢీకొన్న బస్సు – జనగామలో వింత సంఘటన జనగామ, ప్రజాతంత్ర, జూలై 10: జన గామ జిల్లాలో మద్యం మత్తులో ఓ వ్యక్తి చేసిన నిర్వాకం కలకలం రేపింది. జన గామ ఆర్టీసీ బస్టాండ్లో నిలిపి ఉంచిన అద్దె బస్సును ఎవరికి తెలియకుండా స్థా ర్ట్ చేసి తీసుకెళ్లాడు. సుమారు…