– ఛేజ్ చేయడంతో పారిపోయిన దుండుగులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే20: అత్తాపూర్లో యువతి కిడ్నాప్ కథ సుఖాంతంగా ముగిసింది. ఎట్టకేలకు యువతిని పోలీసులు ట్రేస్ చేశారు. మలక్పేట్లోని తన ఇంట్లోనే యువతి సేఫ్ ఉన్నట్లు తెలిపారు. ఫోన్ నంబర్ ఆధారంగా యువతిని పోలీసులు గుర్తించారు. అత్తాపూర్ జోయ్ ఆస్పత్రి వద్ద అర్ధరాత్రి యువతి కిడ్నాప్ అవడం సంచలనం సృష్టించింది. ఓ యువతిని కొందరు వ్యక్తులు థార్ కార్లో వచ్చి అందరూ చూస్తుండగానే కిడ్నాప్ చేశారు. విషయం తెలిసిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు రంగంలోకి దిగారు. యువతిని కిడ్నాప్ చేసిన కారును ఛేజ్ చేశారు. కిడ్నాపర్లు పోలీసులకు చిక్కకుండా పారిపోయారు. కారుకు నంబర్ ప్లేట్ లేకపోవడంతో వివరాలు సేకరించడం పోలీసులకు కష్టంగా మారింది. జోయ్ హాస్పిటల్ హౌస్ కీపింగ్ సూపర్వైజర్ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. యువతిని కొందరు వ్యక్తులు బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కిడ్నాప్ నకు ముందు యువతి ఆస్పత్రి పక్కనే ఉన్న రత్నదీప్ సూపర్ మార్కెట్ కు వెళ్లి అక్కడ వస్తువులను కొనుగోలు చేసి ఫోన్ పే ద్వారా డబ్బులు చెల్లించినట్లు పోలీసులు గుర్తించారు. ఆ ఫోన్ నంబర్ ఆధారంగా మలక్‌పేటకు చెందిన యువతిగా నిర్ధారించారు. అక్కడకు వెళ్లి చూడగా యువతి తన ఇంట్లోనే క్షేమంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



