మేడ్చల్, ప్రజాతంత్ర, మే 22: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా డిప్యూటీ కలెక్టర్ (యూఎల్‌సీ) వంశీ మోహన్ నివాసాల్లో ఏసీబీ తనిఖీలు చేస్తోంది. ఆయనకు చెందిన ఎనిమిది ఇండ్లల్లో సోదాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ ఆస్తులను వంశీమోహన్ భారీ ఎత్తున స్వాహా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అతనిపై ఏసీబీ కేసును నమోదు చేసి తనిఖీలు నిర్వహిస్తోంది. శేరిలింగంపల్లిలోనేగాక పలు ఇతర ప్రాంతాల్లో పనిచేసిన వంశీ మోహన్ అబ్ధుల్లాపూర్ మెట్, పిగ్లీపురంలో ఎనిమిది ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాహా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. తన మామ పేరుపై భూమిని రిజిస్ట్రేషన్ చేయించి ఆ తర్వాత ఓ రియల్టర్‌కు ధారాదత్తం చేశారనే అభియోగాలను ఎదుర్కొంటున్నారు. ఈ పరిణామాల్లోనే ఓ రియల్టర్ నుంచి వంశీమోహన్ పది ప్లాట్లను గిఫ్ట్ డీడ్ రూపంలో తీసుకున్నట్లు ఏసీబీ గుర్తించినట్లు తెలుస్తోంది. వందలాది కోట్ల రూపాయల ఆస్తులను పోగేసినట్లు ఏసీబీ గుర్తించింది. తనిఖీలకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
—————————————————————————————————————————————————————–
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



